ఆ ఇద్దరు స్టార్లు వన్డే వరల్డ్ కప్ ఆడడం కష్టమే... కృష్ణమాచారి శ్రీకాంత్ షాకింగ్ కామెంట్స్..

Published : Jan 07, 2023, 07:32 PM IST

గత ఏడాది టీ20 వరల్డ్ కప్‌లో సెమీ ఫైనల్ నుంచి నిష్కమించిన భారత జట్టు, ఈ ఏడాది రెండు ఐసీసీ టోర్నీల్లో ఆడనుంది. ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీతో పాటు ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిఫ్ ఫైనల్ మ్యాచ్‌లో ఇండియా, ఆస్ట్రేలియాతో తలబడే ఛాన్స్ 99 శాతం ఉంది...

PREV
17
ఆ ఇద్దరు స్టార్లు వన్డే వరల్డ్ కప్ ఆడడం కష్టమే... కృష్ణమాచారి శ్రీకాంత్ షాకింగ్ కామెంట్స్..
Image credit: PTI

అక్టోబర్‌లో జరిగే వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ కోసం ఇప్పటికే 20 మంది ప్లేయర్లను షార్ట్ లిస్ట్ చేశామని, వీరిని రొటేషన్ పద్ధతిలో అన్ని సిరీసుల్లో ఆడిస్తామని కామెంట్ చేశాడు బీసీసీఐ  సెక్రటరీ జై షా...

27

భారత సారథి రోహిత్ శర్మ, మాజీ సారథి విరాట్ కోహ్లీతో పాటు సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా, జస్ప్రిత్ బుమ్రా, రవీంద్ర జడేజా వంటి ప్లేయర్లు... వరల్డ్ కప్‌లో ఆడడం ఖాయం..

37

శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్‌కి ఎంపిక చేసిన జట్టులో శిఖర్ ధావన్‌కి చోటు దక్కలేదు. దీంతో అతను వన్డే వరల్డ్ కప్ లిస్టులో లేనట్టే. కెఎల్ రాహుల్, ఇషాన్ కిషన్‌‌లు రోహిత్ శర్మతో ఓపెనింగ్ చేసేందుకు పోటీపడుతున్నారు..
 

47

‘నా ఉద్దేశంలో శుబ్‌మన్ గిల్, శార్దూల్ ఠాకూర్... వన్డే వరల్డ్ కప్ 2023 లిస్టులో ఉండరు. ఎందుకంటే ఈ ఇద్దరికీ చాలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. మీడియం పేసర్లు కావాలనుకుంటే జస్ప్రిత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్‌ ఉన్నారు. వీరితో పాటు ఉమ్రాన్ మాలిక్ ఉన్నాడు...
 

57
Image credit: PTI

మహ్మద్ షమీ కూడా వన్డే ఫార్మాట్‌లో కీలక బౌలర్. కాబట్టి శార్దూల్ ఠాకూర్ తుది జట్టులోకి రావాలంటే చాలా హార్డ్ వర్క్ చేయాలి. శార్దూల్ ఠాకూర్ కంటే దీపక్ హుడాని వన్డే వరల్డ్ కప్ ఆడిస్తే బాగుంటుంది...

67
Shreyas Iyer-Shubman Gill

ఐసీసీ టోర్నీల్లో గెలవాలంటే యూసఫ్ పఠాన్‌లాంటి సింగిల్ హ్యాండ్‌తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చగల గెలుపు గుర్రాలు కావాలి. శుబ్‌మన్ గిల్‌కి పెద్దగా అంతర్జాతీయ అనుభవం లేదు, కెఎల్ రాహుల్‌ని అంత త్వరగా పక్కన పెట్టలేరు...

77
Image credit: Getty

అలాగే ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీతో తన ప్లేస్‌ని ఫిక్స్ చేసుకున్నాడు. రోహిత్ శర్మతో ఓపెనింగ్ చేసేందుకు ఒకరికి ఇద్దరు ఓపెనర్లు ఉన్నారు. శుబ్‌మన్ గిల్ రావాలంటే, అతను మిగిలిన మ్యాచుల్లో అత్యద్భుతంగా ఆడాల్సిందే..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్, మాజీ సెలక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్..

Read more Photos on
click me!

Recommended Stories