వరల్డ్ కప్ పోయాక, ఈ సెంచరీలు ఎందుకు... సూర్యకుమార్ యాదవ్ రికార్డు ఫీట్‌ని పట్టించుకోని ఫ్యాన్స్...

First Published Nov 20, 2022, 2:31 PM IST

టీ20 వరల్డ్ కప్ 2022 పరాభవం టీమిండియాపైన గట్టిగానే పడింది. వరల్డ్ కప్ సెమీస్‌లో ఓడిన టీమిండియా, మరో సెమీ ఫైనలిస్ట్ న్యూజిలాండ్‌తో కలిసి టీ20 సిరీస్ ఆడుతోంది. కివీస్ పర్యటనలో తొలి టీ20 వర్షం కారణంగా రద్దు కాగా, రెండో టీ20లో సూర్యకుమార్ యాదవ్ సెన్సేషనల్ సెంచరీ నమోదు చేశాడు...

టీ20 వరల్డ్ కప్‌ 2022 టోర్నీకి ముందు ఇంగ్లాండ్ పర్యటనలో ఇంగ్లాండ్‌పై మొట్టమొదటి టీ20 సెంచరీ బాదిన సూర్యకుమార్ యాదవ్, న్యూజిలాండ్‌ పర్యటనలో కివీస్‌పై సెంచరీ నమోదు చేశాడు. టీ20 ఫార్మాట్‌లో రెండు సెంచరీలు చేసిన మొట్టమొదటి భారత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు...

Suryakumar Yadav

ఒకే ఏడాదిలో రెండు టీ20 సెంచరీలు చేసిన రెండో భారత బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్. ఇంతకుముందు 2018లో రోహిత్ శర్మ ఈ ఫీట్ సాధించగా 2022లో సూర్యకుమార్ యాదవ్... మూడు నెలల గ్యాప్‌లో రెండు శతకాలు నమోదు చేశాడు...

Suryakumar Yadav

రెండో టీ20లో 51 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్సర్లతో 111 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు సూర్యకుమార్ యాదవ్. ఆఖరి ఓవర్‌లో హార్ధిక్ పాండ్యా, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్‌లను అవుట్ చేసిన టిమ్ సౌథీ, టీ20ల్లో రెండో హ్యాట్రిక్ నమోదు చేశాడు...

Suryakumar Yadav

15 ఓవర్లు ముగిసే సమయానికి 31 బంతుల్లో 49 పరుగులు మాత్రమే చేసిన సూర్యకుమార్ యాదవ్, ఆఖరి 5 ఓవర్లలో 20 బంతులు ఎదుర్కొని 62 పరుగులు చేశాడు. ఆఖరి 5 ఓవర్లలో 50+ స్కోర్ రాబట్టడం సూర్యకి ఇది మూడోసారి...

111 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన సూర్యకుమార్ యాదవ్, టీ20ల్లో తన రెండో అత్యుత్తమ స్కోరు నమోదు చేశాడు. విరాట్ కోహ్లీ 122, రోహిత్ శర్మ 118 పరుగులు చేసి టీమిండియా తరుపున టీ20ల్లో టాప్ స్కోరర్లుగా ఉండగా ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో 117 పరుగులు చేశాడు సూర్యకుమార్ యాదవ్.. 

Suryakumar Yadav

సూర్యకుమార్ యాదవ్ సెన్సేషనల్ సెంచరీ చేసినా సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎదుర్కొంటుండడం విశేషం. కారణం టీమిండియా ఫ్యాన్స్ ఇంకా టీ20 వరల్డ్ కప్ 2022 పరాజయాన్ని మరిచిపోకపోవడమే. టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫెయిల్ అయిన సూర్యకుమార్ యాదవ్, ఆ తర్వాత నాలుగు మ్యాచుల్లో మూడు హాఫ్ సెంచరీలు బాదాడు...

అయితే ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో సూర్య త్వరగా అవుట్ కావడం టీమిండియాపై తీవ్రంగా ప్రభావం చూపింది. దీంతో కీలక మ్యాచుల్లో ఫెయిల్ అవుతున్న సూర్య, ద్వైపాక్షిక సిరీసుల్లో సెంచరీలు చేస్తే మాత్రం ఏం లాభం? అంటూ విమర్శలు చేస్తున్నారు అభిమానులు...

టీ20 వరల్డ్ కప్ పరాభవాన్ని మరిచిపోయి మ్యాచ్‌ని ఎంజాయ్ చేద్దామనుకున్నా టీవీల్లో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సిరీస్ ప్రత్యక్ష ప్రసారాలు చేయడం లేదు. కేవలం అమెజాన్ ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్ ఉన్నవారికి మాత్రమే లైవ్ మ్యాచులు చూసే అవకాశం ఉండడంతో సూర్య ఫీట్‌ని ఎంజాయ్ చేయలేకపోతున్నారు అభిమానులు. 

click me!