టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో టీమిండియా టైటిల్‌కి రెండు అడుగుల దూరంలో ఆగిపోయింది.ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో ఘోరంగా ఓడింది భారత జట్టు. ఈ పరాజయంతో టీమిండియా టీ20 కెప్టెన్సీ పగ్గాలు హార్ధిక్ పాండ్యాకి దక్కబోతున్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది...
36 ఏళ్ల రోహిత్ శర్మ, అనేక కారణాల వల్ల టీమ్‌కి సరిగ్గా అందుబాటులో ఉండలేకపోతున్నాడు. రోహిత్ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన తర్వాత ఏడాదిలో 8 మంది కెప్టెన్లను మార్చింది భారత జట్టు. ఆసియా కప్ 2022 టోర్నీతో పాటు టీ20 వరల్డ్ కప్‌లోనూ ఫైనల్ కూడా చేరలేకపోయింది...
26
Hardik Pandya, rohith sharma
రోహిత్ శర్మ స్థానంలో ఐపీఎల్ 2022 టైటిల్ గెలిచిన హార్ధిక్ పాండ్యాకి టీ20 కెప్టెన్సీ అప్పగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని టాక్ వినబడుతోంది. ఐపీఎల్ 2022 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌కి సారథ్యం వహించిన హార్ధిక్ పాండ్యా, కెప్టెన్‌గా మొట్టమొదటి సీజన్‌లోనే టైటిల్ గెలిచి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు...
36
Image credit: Getty
న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్, హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీ స్కిల్స్‌కి మొదటి పరీక్ష కానుంది. ఇరు జట్ల మధ్య జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా రెండో టీ20లో టాస్ గెలిచిన న్యూజిలాండ్, టీమిండియాకి బ్యాటింగ్ అప్పగించింది. అయితే రెండో టీ20 ఆడుతున్న జట్టుపై పెదవులు విరుస్తున్నారు అభిమానులు...
46
సంజూ శాంసన్‌తో పాటు శుబ్‌మన్ గిల్, ఉమ్రాన్ మాలిక్, కుల్దీప్ యాదవ్ రిజర్వు బెంచ్‌కే పరిమతమయ్యారు. బీభత్సమైన ఫామ్‌లో ఉన్న సంజూ శాంసన్‌ని పక్కనబెట్టిన హార్ధిక్ పాండ్యా, ఇషాన్ కిషన్‌కి తుది జట్టులో చోటు ఇచ్చాడు. అదీకాకుండా రిషబ్ పంత్, ఇషాన్ కిషన్ కలిసి ఓపెనింగ్ చేశారు...
56
సంజూ శాంసన్‌కి తుది జట్టులో చోటు ఇవ్వకుండా ఇషాన్ కిషన్‌ని ఆడించడాన్ని బట్టి చూస్తుంటే.. రోహిత్ శర్మకు, హార్ధిక్ పాండ్యాకి పెద్ద తేడా ఏమీ కనిపించడం లేదని విమర్శలు చేస్తున్నారు అభిమానులు. సీనియర్లతో సేఫ్ గేమ్ ఆడితే విజయాలు వస్తాయని హార్ధిక్ పాండ్యా భావిస్తున్నాడని విమర్శలు చేస్తున్నారు.
66
umran malik
ఉమ్రాన్ మాలిక్ లాంటి బౌలర్‌ని పెట్టుకుని కూడా అతనికి తుది జట్టులో చోటు ఇవ్వడానికి రోహిత్ శర్మ, హార్ధిక్ పాండ్యా ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నారో అర్థం కావడం లేదని కామెంట్లు చేస్తున్నారు... పాకిస్తాన్, ఇంగ్లాండ్ వంటి వేరే టీమ్స్ అయితే ఉమ్రాన్ మాలిక్‌ని ఈపాటికి 20-30 మ్యాచులు ఆడించి ఉండేవని వాపోతున్నారు..