వాళ్లను కూర్చోబెట్టి, సంజూ శాంసన్‌ని 10 మ్యాచులు ఆడించండి... మాజీ కోచ్ రవిశాస్త్రి కామెంట్..

Published : Nov 20, 2022, 01:37 PM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ఎంపిక చేసిన జట్టులో సంజూ శాంసన్‌కి చోటు ఇవ్వకపోవడం అప్పట్లో తీవ్ర వివాదాస్పదమైంది. ‘#SanjuSamsonforT20WC’ హ్యాష్ ట్యాగ్‌ని ట్రెండ్ చేసిన అభిమానులు, సంజూ శాంసన్ కోసం టీమిండియా ఆడే మ్యాచుల్లో నిరసన గళం వినిపించారు.. తిరువనంతపురంలో జరిగిన మ్యాచ్‌ సమయంలో టీమ్ బస్సును అడ్డుకున్నారు. అయితే బీసీసీఐ మాత్రం, సంజూ ఫ్యాన్స్‌ని పట్టించుకోవడం లేదు...  

PREV
18
వాళ్లను కూర్చోబెట్టి, సంజూ శాంసన్‌ని 10 మ్యాచులు ఆడించండి... మాజీ కోచ్ రవిశాస్త్రి కామెంట్..
Sanju Samson

న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కి ఎంపికైన సంజూ శాంసన్, రెండో టీ20లో తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. రిషబ్ పంత్, ఇషాన్ కిషన్‌లతో ఓపెనింగ్ చేయించిన కెప్టెన్ హార్ధిక్ పాండ్యా... సంజూ శాంసన్‌ని రిజర్వు బెంచ్‌కే పరిమితం చేశాడు. దీనిపై రవిశాస్త్రి తన స్టైల్‌లో ఫైర్ అయ్యాడు...

28
Sanju Samson Player of the match

‘సంజూ శాంసన్ లాంటి కుర్రాడికి అవకాశాలు ఇవ్వాలి. మిగిలిన వారిని కూర్చోబెట్టి, సంజూ శాంసన్‌ని 10 మ్యాచులు ఆడించాలి. అంతేకానీ ఓ మ్యాచ్ ఆడించి, మళ్లీ కూర్చోబెట్టి.. ఇలా అప్పుడప్పుడూ ఆడించడం కరెక్ట్ కాదు...

38
Sanju Samson

సంజూ శాంసన్‌ని ఆడించాలని అనుకుంటే మిగిలిన వాళ్లను కూర్చోబెట్టి వరుసగా ఓ 10 మ్యాచులు ఆడించండి. వాటిల్లో అతను సరిగ్గా ఆడకపోతే అప్పుడు సంజూని పక్కనబెట్టినా పర్లేదు. అంతేకానీ రెండు మ్యాచులు ఆడించి మరో మూడు మ్యాచులు కూర్చోబెట్టడం మాత్రం కరెక్ట్ కాదు... ’ అంటూ వ్యాఖ్యానించాడు టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి...

48
Sanju Samson

అయితే ఈ వ్యాఖ్యలపై టీమిండియా ఫ్యాన్స్ రివర్స్‌లో రవిశాస్త్రిపైనే ఫైర్ అవుతున్నారు. రవిశాస్త్రి హెడ్ కోచ్‌గా ఉన్న సమయంలో రిషబ్ పంత్‌కి వరుస అవకాశాలు ఇస్తూ వచ్చింది టీమిండియా. రిషబ్ పంత్ వరుసగా ఫెయిల్ అవుతూ వస్తుండడంతో సంజూ శాంసన్‌కి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు...

58
Sanju Samson

అయితే అభిమానుల డిమాండ్‌ని పట్టించుకోని రవిశాస్త్రి... రిషబ్ పంత్‌ని వెనకేసుకొచ్చాడు. ఐపీఎల్ 2020 తర్వాత రిషబ్ పంత్, గబ్బా టెస్టు గెలిపించి టీమిండియాకి మ్యాచ్ విన్నర్ అయిపోయాడు. దీంతో సంజూ శాంసన్‌, మళ్లీ అవకాశాల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది...

68
Sanju Samson

అప్పుడెప్పుడో ఏడేళ్ల క్రితం భారత జట్టు తరుపున ఆరంగ్రేటం చేసిన సంజూ శాంసన్ మాత్రం ఇప్పటిదాకా ఆడింది 14 మ్యాచులే... 2015 జూలైలో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో ఆరంగ్రేటం చేసిన సంజూ శాంసన్, తన మొదటి మ్యాచ్‌లో 19 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. అయితే ఈ మ్యాచ్‌లో జింబాబ్వే చేతుల్లో 10 పరుగుల తేడాతో ఓడింది భారత జట్టు. మళ్లీ ఐదేళ్ల వరకూ సంజూ శాంసన్‌ని పట్టించుకోలేదు సెలక్టర్లు... 

78
Sanju Samson

2020 జనవరిలో శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో ఓ టీ20 మ్యాచ్, ఫ్రిబవరిలో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో 2 టీ20 మ్యాచులు, ఆ తర్వాత డిసెంబర్‌లో ఆస్ట్రేలియాపై 3 టీ20 మ్యాచులు ఆడించింది భారత జట్టు... అయితే ఏడాదిలో సంజూ శాంసన్ ఆడింది ఐదు మ్యాచులే... ఈ సమయంలో టీమిండియా హెడ్ కోచ్‌గా ఉన్నది రవిశాస్త్రియే...

88

అప్పుడు సంజూ శాంసన్‌కి అవకాశాలు ఇవ్వకుండా రిజర్వు బెంచ్‌కి పరిమితం చేసిన రవిశాస్త్రి, ఇప్పుడు కామెంటేటర్‌గా మారిన తర్వాత ఇలా చెప్పడాన్ని తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు అభిమానులు. అప్పుడు అవకాశం ఇచ్చి ఉంటే, ఈపాటికి సంజూ శాంసన్ టీమిండియాలో కీలక సభ్యుడిగా ఉండేవాడని వాపోతున్నారు... 

click me!

Recommended Stories