ఇలా ఆడితే సక్సెస్ కాలేవని తిట్టారు... సూర్యకుమార్ యాదవ్ సెన్సేషనల్ కామెంట్స్...

First Published Dec 2, 2022, 5:06 PM IST

ఐపీఎల్ 2020 తర్వాత టీమిండియాలోకి వచ్చి, స్టార్ ప్లేయర్‌గా మారిపోయాడు సూర్యకుమార్ యాదవ్. ఈ ఏడాది టీ20ల్లో వెయ్యికి పైగా పరుగులు చేసిన ఏకైక ప్లేయర్‌గా నిలిచిన సూర్యకుమార్ యాదవ్, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో 185+ స్ట్రైయిక్ రేటుతో 3 హాఫ్ సెంచరీలు చేశాడు...

Suryakumar Yadav

క్రీజులోకి రావడంతోనే బౌండరీలు బాదడం మొదలుపెట్టడం సూర్యకుమార్ యాదవ్ స్పెషాలిటీ. టీ20ల్లో రెండు సెంచరీలు బాదిన సూర్య భాయ్... బంగ్లాదేశ్ టూర్ నుంచి రెస్ట్ తీసుకున్నాడు. బ్రేక్ దొరకడంతో దాదాపు 100 రోజుల తర్వాత ఇంటికి వెళ్లాడు సూర్యకుమార్ యాదవ్...

Suryakumar Yadav

ఇండియన్ మిస్టర్ 360 డిగ్రీస్‌గా పేరు తెచ్చుకున్న సూర్యకుమార్ యాదవ్, తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపెట్టాడు. ‘నేను అండర్ 22లో ఉన్న సమయంలో అనుకున్న మొట్టమొదటిసారి సచిన్ టెండూల్కర్‌ని కలిశాను...

Suryakumar Yadav

ఐపీఎల్‌లో నాకు చోటు దక్కడంతో ఎన్నో ఆశలు, అంతకుమించి భయాలతో వాంఖడే స్టేడియానికి వెళ్లాను. ఆ రోజు నేను కాస్త ఆలస్యంగా వెళ్లా. అప్పటికే డ్రెస్సింగ్ రూమ్‌లో అంతా నిండిపోయారు. కూర్చోవడానికి కూడా ఎక్కడా ప్లేస్ లేదు...

Suryakumar Yadav

సచిన్ సర్, గణేశ్ విగ్రహం పక్కనే కూర్చున్నారు. నాకు ఓ కూర్చో ఇచ్చి, అక్కడే కూర్చోమన్నారు. నేను ఠక్కున అందులో కూర్చున్నా. అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను అదే ప్లేస్‌లో కూర్చుంటా. అది నాకు సెంటిమెంట్‌గా మారిపోయింది...

Suryakumar Yadav

అండర్ 15, అండర్ 17 సమయంలో నా బ్యాటింగ్‌ని ఎన్నో రకాలుగా తిట్టేవాళ్లు. ఇలా ఆడితే కెరీర్‌లో పైకి రాలేవని చెప్పేవాళ్లు. నేను మాత్రం నా బ్యాటింగ్ స్టైల్‌ని మార్చుకోకూడదని గట్టిగా ఫిక్స్ అయ్యా. కోచ్ కూడా నాకు అండగా నిలిచారు...

Suryakumar Yadav

ఫార్మాట్ ఏదైనా నా మైండ్‌లో ఫిక్స్ అయ్యింది ఒక్కటే... నన్ను నేను ఎక్స్‌ప్రెస్ చేసుకోవాలని! అందరూ తప్పని చెప్పిన బ్యాటింగ్ స్టైలే, నన్ను టీమిండియాలోకి తీసుకొచ్చింది. నేను నమ్మింది తప్పు కాదని నిరూపించింది...’ అంటూ చెప్పుకొచ్చాడు సూర్యకుమార్ యాదవ్...

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో నెం.1  బ్యాటర్‌గా ఉన్న సూర్యకుమార్ యాదవ్... వన్డేల్లో లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కి వస్తున్నాడు. త్వరలో టెస్టు టీమ్‌లోకి ఎంట్రీ ఇవ్వాలని ఆశపడుతున్నాడు సూర్య..   

click me!