10 మ్యాచుల్లో 8 సెంచరీలు... వన్డే వరల్డ్ కప్ 2023 టీమ్‌లో రుతురాజ్ గైక్వాడ్‌కి చోటు దక్కుతుందా?...

First Published Dec 2, 2022, 2:57 PM IST

టీ20 వరల్డ్ కప్ టోర్నీలు ముగిశాయి. ఇక వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీపైకి ఫోకస్ షిఫ్ట్ చేసింది భారత జట్టు. న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ నుంచే వచ్చే ప్రపంచకప్‌కి సన్నాహకాలు మొదలైపోయాయి. వన్డే ఫార్మాట్‌లో జరుగుతున్న ఐసీసీ టోర్నీ కావడంతో ఐపీఎల్ పర్ఫామెన్స్‌లు ఇక్కడ లెక్కలోకి రావు...

దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హాజారే ట్రోఫీ 2022 ట్రోఫీ నుంచే మంచి పర్ఫామన్స్ ఇచ్చిన కుర్రాళ్లకు టీమిండియా నుంచి పిలుపు దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. రికార్డు లెవెల్లో గత 10 మ్యాచుల్లో 8 సెంచరీలు చేసిన రుతురాజ్ గైక్వాడ్, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో చోటు దక్కించుకుంటాడా? అనేది ఆసక్తికరంగా మారింది...

Ruturaj Gaikwad

విజయ్ హాజారే ట్రోఫీ 2021 టోర్నీలో వరుసగా నాలుగు సెంచరీలు బాది, విరాట్ కోహ్లీ, పృథ్వీ షా రికార్డులను సమం చేసిన రుతురాజ్ గైక్వాడ్, 2022 సీజన్‌లో కూడా అదే జోరును కొనసాగించాడు. విజయ్ హాజారే ట్రోఫీలో గత 10 ఇన్నింగ్స్‌ల్లో 8 సెంచరీలు బాదాడు రుతురాజ్....
 

Image credit: PTI

136, 154 నాటౌట్, 124, 21, 168, 124 నాటౌట్, 40, 220 నాటౌట్, 168 పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్, సౌరాష్ట్రతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో 131 బంతుల్లో 108 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మొదటి 96 బంతుల్లో 50 పరుగులు మాత్రమే చేసిన రుతురాజ్ గైక్వాడ్, ఆ తర్వాత 31 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు...

గత 10 మ్యాచుల్లో 180.42 సగటుతో 1263 పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్, విజయ్ హాజారే ట్రోఫీ చరిత్రలో వరుసగా రెండు సీజన్లలో నాలుగేసి సెంచరీలు నమోదు చేసిన మొట్టమొదటి ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు.  విజయ్ హాజారే ట్రోఫీ చరిత్రలో అత్యధిక సెంచరీలు నమోదు చేసిన ప్లేయర్‌గా నిలిచాడు రుతురాజ్ గైక్వాడ్...

Image credit: PTI

అయితే ఇంత చేసినా వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో రుతురాజ్ గైక్వాడ్‌కి చోటు దక్కడం కష్టమేనని అంటున్నారు అభిమానులు. దీనికి కారణం భారత జట్టులో ఓపెనింగ్ స్థానం కోసం తీవ్రమైన పోటీ ఉండడమే. రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ వన్డేల్లో ఓపెనింగ్ చేస్తున్నారు. వీరితో పాటు కెఎల్ రాహుల్ కూడా ఈ ప్లేస్ కోసం పోటీపడుతున్నాడు...

కెప్టెన్ రోహిత్ శర్మ ఓపెనర్‌గా ఉండడం గ్యారెంటీ. దీంతో అతనికి తోడుగా సీనియర్ శిఖర్ ధావన్‌ని పంపాలా? లేక కెఎల్ రాహుల్‌ని పంపాలా? అనే విషయంపైనే ఎటూ తేల్చుకోలేకపోతోంది భారత జట్టు. దీనికి తోడు ఇషాన్ కిషన్, పృథ్వీ షా కూడా ఓపెనర్ రేసులో ఉన్నారు...

వీరందరినీ దాటుకుని రుతురాజ్ గైక్వాడ్, టీమిండియా ఓపెనర్‌గా రావాలంటే అంత తేలికైన విషయం కాదు. విజయ్ హాజారే ట్రోఫీ పర్ఫామెన్స్‌తో టీమిండియాలోకైతే రుతురాజ్ ఎంట్రీ సులువైపోతుంది. అయితే భారత జట్టులోకి వచ్చాక లేటు చేయకుండా సెంచరీల మోత మోగిస్తేనే... వన్డే వరల్డ్ కప్ 2023 జట్టులో రిజర్వు బెంచ్‌లోనైనా రుతురాజ్‌కి చోటు దక్కుతుందని అంటున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్.. 

రుతురాజ్ గైక్వాడ్‌లో టన్నుల్లో టాలెంట్ ఉంది. అందుకే ఐపీఎల్‌లో అతి చిన్న వయసులో ఆరెంజ్ క్యాప్ గెలిచిన ప్లేయర్‌గా నిలవగలిగాడు. అయితే గైక్వాడ్‌ని ఆడించడానికి టీమిండియాలో ఖాళీ లేదు...

click me!