గత ఏడాది కాలంగా టీ20లలో అత్యద్భుతమైన ఫామ్ లో ఉన్న సూర్యకుమార్ యాదవ్.. టీమిండియాలో ఈ సీజన్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఉన్నాడు. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో రెండో స్థానంలో ఉన్న సూర్య.. భారత్ ఆడిన గత ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీస్ లలో కూడా రాణించాడు. కానీ దక్షిణాఫ్రికాతో మంగళవారం ముగిసిన మూడో టీ20లో 8 పరుగులు మాత్రమే చేశాడు.