లంక ప్రీమియర్ లీగ్‌కి సురేష్ రైనా... ఆ టీమిండియా మాజీ ప్లేయర్ రూట్‌లో వెళ్తున్న మిస్టర్ ఐపీఎల్...

Published : Jun 11, 2023, 04:19 PM IST

ఐపీఎల్‌లో 5 వేలకు పైగా పరుగులు చేసిన మొట్టమొదటి క్రికెటర్ సురేష్ రైనా. చెన్నై సూపర్ కింగ్స్‌కి మూడు ఐపీఎల్ టైటిల్స్ అందించిన రైనా, లంక ప్రీమియర్ లీగ్ 2023లో ఆడబోతున్నాడు...

PREV
17
లంక ప్రీమియర్ లీగ్‌కి సురేష్ రైనా... ఆ టీమిండియా మాజీ ప్లేయర్ రూట్‌లో వెళ్తున్న మిస్టర్ ఐపీఎల్...

ఐపీఎల్‌లో ఆడితే చెన్నై సూపర్ కింగ్స్ తరుపునే ఆడతానని, వేరే టీమ్స్‌కి ఆడనని చాలా సార్లు కామెంట్ చేశాడు సురేష్ రైనా. అయితే ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో సురేష్ రైనాని బేస్ ప్రైజ్‌కి కొనుగోలు చేయడానికి కూడా చెన్నై సూపర్ కింగ్స్ ఆసక్తి చూపించలేదు...

27
Photo source- Instagram

ఐపీఎల్ 2022 సీజన్‌లో అమ్ముడుపోని ప్లేయర్ల జాబితాలో చేరిన సురేష్ రైనా, అదే ఏడాది సెప్టెంబర్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి కూడా తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. 2020 ఆగస్టు 15న మహేంద్ర సింగ్ ధోనీతో పాటు అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు సురేష్ రైనా...

37

బీసీసీఐకి రాజీనామా ఇచ్చిన సురేష్ రైనా, లంక ప్రీమియర్ లీగ్ 2023 వేలానికి రిజిస్టర్ చేయించుకున్నాడు. సురేష్ రైనా బేస్ ప్రైజ్ 50 వేల డాలర్లు (దాదాపు 41 లక్షల 30 వేల రూపాయలు)...

47

జూన్ 14న లంక ప్రీమియర్ లీగ్ (ఎల్‌పీఎల్) జరగనుంది. జూన్ 30 నుంచి ఆగస్టు 20 మధ్య లంక ప్రీమియర్ లీగ్ సీజన్ 4 జరగనుంది. ఇంతకుముందు లంక ప్రీమియర్ లీగ్‌లో ఆడిన ఒకే ఒక్క భారత క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్...
 

57

2023 సీజన్ కోసం లంక ప్రీమియర్ లీగ్‌లో తొలిసారిగా ఐపీఎల్ తరహాలో వేలం నిర్వహించబోతున్నారు. మొదటి మూడు సీజన్లలో ప్లేయర్లను నేరుగా డ్రాఫ్ట్ రూపంలో కొనుగోలు చేశాయి ఐదు ఫ్రాంఛైజీలు...

67

లంక ప్రీమియర్ లీగ్ 2023 వేలంలో సురేష్ రైనాతో పాటు 500లకు పైగా క్రికెటర్లు పాల్గొనబోతున్నారు. ఇందులో 140 మంది విదేశీ క్రికెటర్లు కూడా ఉన్నారు...  ప్రతీ ఫ్రాంఛైజీ 14 లోకల్ ప్లేయర్లను, ఆరుగురు విదేశీ ప్లేయర్లను కొనుగోలు చేయొచ్చు...

77

పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌తో పాటు షకీబ్ అల్ హసన్, డేవిడ్ మిల్లర్, మాథ్యూ వేడ్, ముజీబ్ వుల్ రహీం వంటి ప్లేయర్లు కూడా లంక ప్రీమియర్ లీగ్‌లో ఆడబోతున్నారు. ఇంతకుముందు జరిగిన మొదటి మూడు ఎల్‌పీఎల్ సీజన్లలో జఫ్నా కింగ్స్ విజేతగా నిలిచింది.. 

click me!

Recommended Stories