అమ్మను సంతోషంగా ఉంచడమే నాకు ముఖ్యం! మిగిలినవన్నీ తర్వాతే... - విరాట్ కోహ్లీ...

Published : Jun 11, 2023, 03:23 PM IST

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2023లో టీమిండియా విరాట్ కోహ్లీపైనే బోలెడు ఆశలు పెట్టుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో 14 పరుగులు చేసి అవుటైన విరాట్ కోహ్లీ, 2022 ఆగస్టు నుంచి మంచి ఫామ్‌లో ఉన్నాడు...

PREV
16
అమ్మను సంతోషంగా ఉంచడమే నాకు ముఖ్యం! మిగిలినవన్నీ తర్వాతే... - విరాట్ కోహ్లీ...
Virat Kohli

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ సమయంలో విరాట్ కోహ్లీతో పాటు అనుష్క శర్మ, మహ్మద్ సిరాజ్ వంటి ప్లేయర్లు, ఇన్‌స్టాలో కొటేషన్లు పోస్ట్ చేస్తుండడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది..

26

అయితే దీనికి ముందు స్టార్ స్పోర్ట్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలను బయటపెట్టాడు విరాట్ కోహ్లీ.. 

36

‘మా అమ్మను జాగ్రత్తగా చూసుకోవడమే నాకు అన్నింటికంటే ముఖ్యమైన పని. ఆమెను సంతోషంగా ఉంచేందుకు నేను చేసే ప్రతీ చిన్న పని, నాకెంతో ఆనందాన్ని ఇస్తుంది...

46

ఇండియాకి ఆడడం, ఇప్పుడు ఇంత ఎదగడానికి అమ్మే కారణం. ఆమె లేకపోతే నేను లేను. అందుకే అమ్మ కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటాను. మిగిలిన విషయాలన్నీ నాకు చాలా చిన్నవే..’ అంటూ కామెంట్ చేశాడు విరాట్ కోహ్లీ...

56

విరాట్ కోహ్లీకి 17 ఏళ్ల వయసులో ఆయన తండ్రి ప్రేమ్ కోహ్లీ గుండెపోటుతో మరణించారు. అప్పటి నుంచి తల్లి సరోజ్ కోహ్లీ, కొడుకు బాధ్యతలను తీసుకుని అతన్ని స్టార్ క్రికెటర్‌గా తీర్చి దిద్దింది...

66

సమయం దొరికినప్పుడల్లా భార్య అనుష్క శర్మ గురించి, తన కెరీర్‌లో ఆమె తీసుకొచ్చిన మార్పుల గురించి చెప్పుకొచ్చే విరాట్ కోహ్లీ... తల్లి సరోజ్ గురించి కూడా ఎమోషనల్ కామెంట్లు చేస్తుంటాడు..

Read more Photos on
click me!

Recommended Stories