ఇండియా, న్యూజిలాండ్ మధ్య వన్డే సిరీస్ వాయిదా... టీ20 వరల్డ్‌కప్ తర్వాత...

First Published Sep 16, 2021, 3:14 PM IST

ఒకప్పుడు ఏడాదిలో మహా అయితే ఓ 100 రోజులు మాత్రమే మ్యాచులు ఆడేవాళ్లు క్రికెటర్లు. అయితే ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. ఐపీఎల్, ఐసీసీ టోర్నీలు, ద్వైపాక్షిక సిరీస్‌ల కారణంగా తీరిక లేకుండా క్రికెట్ ఆడుతున్నారు...

ఐపీఎల్ 2021 సీజన్ కోసం సిద్ధమవుతున్న టీమిండియా ప్లేయర్లు, ఆ తర్వాత యూఏఈలోనే టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ ఆడబోతున్నారు...

ఇది ముగిసిన తర్వాత స్వదేశంలో న్యూజిలాండ్‌తో సిరీస్ ఉంటుంది... 2023 వన్డే వరల్డ్‌కప్‌కి అర్హత సాధించడానికి మూడు వన్డే మ్యాచులు కూడా ఈ సిరీస్‌లో ఆడాల్సి ఉంది...

అయితే బిజీ షెడ్యూల్ కారణంగా వన్డే సిరీస్‌ని వచ్చే ఏడాదికి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు నిర్వాహకులు... 

వచ్చే ఏడాది అక్టోబర్ నెలలో ఆస్ట్రేలియాలో 2022 టీ20 వరల్డ్‌కప్ జరగనుంది. ఈ టోర్నీ ముగిసిన తర్వాత న్యూజిలాండ్, ఇండియా మధ్య వన్డే సిరీస్ నిర్వహించే అవకాశం ఉంది...

2021 టీ20 వరల్డ్‌కప్ ముగిసిన తర్వాత సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్‌తో సిరీస్‌లు ఆడనుంది న్యూజిలాండ్... వీటితో పాటు 2022 వుమెన్స్ వరల్డ్‌కప్ టోర్నీ కూడా న్యూజిలాండ్‌లోనే జరగనుంది...

దీంతో టీమిండియాతో జరగాల్సిన సిరీస్‌ను కుదించారు. ఇంతకుముందు షెడ్యూల్ ప్రకారం భారత పర్యటనలో న్యూజిలాండ్ మూడు టీ20 మ్యాచులు, రెండు టెస్టులు, మూడు వన్డేలు ఆడాల్సి ఉంది...

ఇప్పుడు వన్డే సిరీస్‌ వాయిదా పడడంతో రెండు టెస్టులు, టీ20 సిరీస్ ముగించుకుని స్వదేశానికి బయలుదేరుతుంది న్యూజిలాండ్...

న్యూజిలాండ్ సిరీస్ ముగిసిన సౌతాఫ్రికా పర్యటనకి వెళ్లే టీమిండియా అక్కడ మూడు టెస్టులు, మూడు వన్డేలు, నాలుగు టీ20 మ్యాచులు ఆడుతుంది. 

click me!