ఇది సురేష్ రైనా చేతుల్లో నిర్మించబడిన టీమ్‌... సీఎస్‌‌కేపై అంబటి రాయుడు కామెంట్...

Published : May 31, 2023, 10:21 AM IST

ఐపీఎల్ 2023 సీజన్ ఫైనల్ మ్యాచ్‌తో అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు అంబటి రాయుడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్, సీఎస్‌కే టీమ్స్‌కి ఆడిన అంబటి రాయుడు, ఫైనల్ మ్యాచ్‌లోనూ మెరుపులు మెరిపించాడు...

PREV
16
ఇది సురేష్ రైనా చేతుల్లో నిర్మించబడిన టీమ్‌... సీఎస్‌‌కేపై అంబటి రాయుడు కామెంట్...

8 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 19 పరుగులు చేసిన అంబటి రాయుడు, మోహిత్ శర్మ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఫైనల్ మ్యాచ్ అనంతరం కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు అంబటి రాయుడు...
 

26
PTI Photo/R Senthil Kumar)(PTI04_03_2023_000330B)

‘నా కెరీర్‌కి ఇదో అద్భుతమైన ముగింపు. ఇంతకంటే బెటర్ క్లైమాక్స్ అడగలేను. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ వంటి గొప్ప టీమ్స్‌ తరుపున ఆడే అవకాశం రావడం నా అదృష్టం...

36

ఈ ఫైనల్ మ్యాచ్ నాకు జీవితాంతం గుర్తుండిపోతుంది. 30 ఏళ్లుగా క్రికెట్ ఆడుతున్నా. నా బయోగ్రఫీలో ఈ ముగింపుకి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌, నాకు అన్ని వేళలా అండగా నిలిచింది...

46

ఈ టీమ్ విజయంలో సురేష్ రైనాకి కూడా క్రెడిట్ దక్కుతుంది. ఎందుకంటే సురేష్ రైనా చేతుల్లోనే చెన్నై సూపర్ కింగ్స్ అనే టీమ్ ఇంత గొప్పగా తయారైంది. అతనితో ఆడడం కూడా మరిచిపోలేని అనుభూతి...’ అంటూ కామెంట్ చేశాడు అంబటి రాయుడు.. 
 

56
Photo source- Instagram

చెన్నై సూపర్ కింగ్స్‌కి మూడు టైటిల్స్ అందించిన Mr.IPL సురేష్ రైనా, 10 సార్లు టీమ్‌ని ప్లేఆఫ్స్‌కి చేర్చాడు. రైనా లేకుండా ఆడిన మొదటి సీజన్ 2020లో సీఎస్‌కే అట్టర్ ఫ్లాప్ అయ్యింది...

66

సీఎస్‌కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి క్రెడిట్ ఇవ్వకుండా సురేష్ రైనా చేతుల్లో చెన్నై సూపర్ కింగ్స్ నిర్మించబడిందని అంబటి రాయుడు చేసిన కామెంట్లపై మాహీ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు... 

click me!

Recommended Stories