చెన్నై గెలిచినా చెత్త రికార్డు మాత్రం ఆ బౌలర్‌దే.. లీగ్ చరిత్రలోనే టాపర్ ఆఫ్ ది బ్యాచ్ మరి..!

First Published May 30, 2023, 4:23 PM IST

IPL 2023: ఐపీఎల్- 16ను చెన్నై సూపర్ కింగ్స్ ఘనంగా ముగించింది. ఆ జట్టు  ఐదో టైటిల్ ను గెలుచుకున్నా సీఎస్కే బౌలర్  తుషార్ దేశ్‌పాండే మాత్రం   చెత్త రికార్డు నమోదుచేశాడు.  

ఐపీఎల్ -16 లో గుజరాత్ టైటాన్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య   సోమవారం అర్థరాత్రి ముగిసిన ఫైనల్ లో    171 పరుగుల లక్ష్యాన్ని ఆఖరి ఓవర్లో ఛేదించిన  చెన్నై సూపర్ కింగ్స్.. చరిత్ర సృష్టించింది.   ఈ లీగ్ లో ముంబై ఇండియన్స్ తర్వాత ఐదు ట్రోఫీలు సాధించిన  జట్టుగా నిలిచింది.  

Image credit: PTI

సీఎస్కే ఈ మ్యాచ్ లో రికార్డుల మీద రికార్డులు బద్దలుకొడితే ఆ జట్టు పేసర్ తుషార్ దేశ్‌పాండే మాత్రం ఓ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఒక సీజన్ లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్ గా  తుషార్ రికార్డులకెక్కాడు.  

Image credit: Getty

ఈ సీజన్ లో   16 మ్యాచ్ ల ఆడి  56.5 ఓవర్లు బౌలింగ్ చేసి   ఏకంగా 564 పరుగులు సమర్పించుకున్నాడు.  అడపా దడపా వికెట్లు తీసిన తుషార్.. ఈ సీజన్ లో 21 వికెట్లు దక్కించుకున్నాడు.  అయితే ఒక ఐపీఎల్ సీజన్ లో అత్యధిక పరుగుల సమర్పించుకున్న బౌలర్ల జాబితాలో తుషార్ అగ్రస్థానానికి ఎగబాకాడు. 

Image credit: PTI

గతంలో ఈ రికార్డు.. రాజస్తాన్ రాయల్స్ పేసర్ ప్రసిధ్ కృష్ణ పేరిట ఉండేది. ప్రసిధ్..  2022 సీజన్ లో 551 పరుగులిచ్చుకున్నాడు. ఇప్పుడు తుషార్ ఆ రికార్డును బ్రేక్ చేయడంతో ప్రసిధ్ రెండో స్థానానికి పడిపోయాడు. 

ఈ జాబితాలో తుషార్, ప్రసిధ్ తర్వాత కగిసొ రబాడా మూడో స్థానంలో ఉన్నాడు. రబాడా.. 2020 సీజన్ లో 548 రన్స్ ఇచ్చుకోగా 2018లో  సిద్ధార్థ్ కౌల్.. 547  పరుగులు ఇచ్చుకున్నాడు.  ఇక  ఇదే సీజన్ లో  సీఎస్కే బౌలర్ డ్వేన్ బ్రావో..  533 పరుగులిచ్చాడు. 

ఇక ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో ఒక్క వికెట్ కూడా తీయకుండా అత్యధిక పరుగులు సమర్పించిన  రెండో బౌలర్ గా  తుషార్ నిలిచాడు. ఈ జాబితాలో షేన్ వాట్సన్  ఫస్ట్  ప్లేస్ లో ఉన్నాడు.  వాట్సన్.. 2016లో ఆర్సీబీ తరఫున ఆడుతూ సన్ రైజర్స్ తో  జరిగిన ఫైనల్లో 4 ఓవర్లు వేసి 61  పరుగులిచ్చాడు.ఈ జాబితాలో   లాకీ ఫెర్గూసన్ (2021లో కేకేఆర్ తరఫున ఆడుతూ సీఎస్కేతో ఫైనల్లో) 4 ఓవర్లలో 56 రన్స్ ఇచ్చాడు.  ఇక  నిన్నటి మ్యాచ్  లో  తుషార్.. 4 ఓవర్లలో 36  పరుగులిచ్చాడు.

click me!