IPL 2024 టైటిల్ కోసం సన్‌రైజర్స్ మాస్టర్ ప్లాన్.. ఆరెంజ్ ఆర్మీకి ఛాంపియన్ లీడర్‌..!

Published : Mar 05, 2024, 11:26 PM IST

Sunrisers Hyderabad: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ కొత్త సీజ‌న్ (ఐపీఎల్ 2024)  ప్రారంభానికి కౌంట్ డౌన్ మొద‌లైంది. ఈ క్ర‌మంలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు రాబోయే ఐపీఎల్  టోర్నీ టైటిల్ ను ద‌క్కించుకోవాల‌ని చూస్తోంది.   

PREV
17
IPL 2024 టైటిల్ కోసం సన్‌రైజర్స్ మాస్టర్ ప్లాన్.. ఆరెంజ్ ఆర్మీకి ఛాంపియన్ లీడర్‌..!
Pat Cummins, Aiden Markram

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 224) టోర్నమెంట్ మార్చి 22న ప్రారంభమవుతుంది. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్,  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు చెన్నైలో ప్రారంభ మ్యాచ్‌లో తలపడనున్నాయి.

27
Pat Cummins

2016 తర్వాత మళ్లీ కప్ చేజిక్కించుకోవాలని చూస్తున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు.. ఇప్పుడు తగిన విధంగా వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ఈ క్ర‌మంలోనే వ‌చ్చే ఐపీఎల్ టోర్నీకి తమ జట్టుకు కెప్టెన్ గా ఆస్ట్రేలియా స్టార్ ప్యాట్ కమిన్స్ ను నియమించింది.

37

ఐపీఎల్ టోర్నమెంట్ 17వ ఎడిషన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఛాంపియన్ కెప్టెన్ పాట్ కమిన్స్ నాయకత్వం వహిస్తాడని ఫ్రాంచైజీ ఇప్పుడు అధికారికంగా ప్రకటించింది.

47

గతేడాది ఐసీసీ టెస్ట్ వరల్డ్ చాంపియన్‌షిప్, ఐసీసీ వన్డే ప్రపంచకప్ టోర్నీల్లో ఆస్ట్రేలియా జట్టును చాంపియన్‌గా నిలిపిన పాట్ కమిన్స్.. ఇప్పుడు ఆరెంజ్ ఆర్మీని ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలపడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు.

57

గత డిసెంబర్ 19న జరిగిన ఐపీఎల్ ఆటగాళ్ల వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ప్యాట్ కమిన్స్‌ను రూ.20.50 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ వేలం చరిత్రలో అత్యంత ఖరీదైన రెండో ఐపీఎల్ ప్లేయర్‌గా పాట్ కమిన్స్ నిలిచాడు. మిచెల్ స్టార్క్ (24.75) ఐపీఎల్ లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా.. కేకేఆర్ టీమ్ లో కొన‌సాగుతున్నాడు.

67

ఇప్పుడు ఐడెన్ మార్క్‌రమ్ స్థానంలో పాట్ కమిన్స్ ఆరెంజ్ ఆర్మీకి నాయకత్వం వహించనున్నాడు. మార్చి 23న చారిత్రక ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ గత ఎడిషన్‌లో దారుణ‌మైన ప్రదర్శనతో ఐపీఎల్ టోర్నీలో చివరి స్థానంలో నిలిచింది. 

 

77

అయితే, ఈ సారి మాత్రం స‌త్తా చాటాల‌ని చూస్తోంది. ఇప్పుడు చాలా మంది యువ, అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో కూడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈసారి అద్భుతంగా పునరాగమనం చేస్తుందన్న నమ్మకంతో ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories