Sunrisers Hyderabad, SRH, IPL , IPL 2025, Sunrisers Hyderabad IPL 2025 Retention Players
Sunrisers Hyderabad IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 ఎడిషన్ కు ముందు ఆటగాళ్ల వేలం జరగనుంది. ఐపీఎల్ ఫ్రాంఛైజీలు రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల వివరాలను ప్రకటించాయి. ఈ క్రమంలోనే సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్ హెన్రిచ్ క్లాసెన్ మెగా వేలానికి ముందు అత్యధిక నిలుపుదల మొత్తాన్ని అందుకుని కొత్త రికార్డులను నమోదుచేశాడు.
IPL Retention SRH
ప్రతి మ్యాచ్ లో తనదైన మార్కును చూపిస్తూ దూకుడుగా ఆడే వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ హెన్రిచ్ క్లాసెన్ ను సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) 23 కోట్ల రూపాయల భారీ మొత్తం చెల్లించి జట్టుతోనే ఉంచుకుంది. అలాగే, గత సీజన్ లో అద్భుతమైన కెప్టెన్సీతో జట్టును ఫైనల్ వరకు తీసుకుకెళ్లిన ప్యాట్ కమ్మిన్స్ ను కూడా హైదరాబాద్ టీమ్ రిటైన్ చేసుకుంది.
ఐపీఎల్ 2024 మినీ వేలంలో రూ. 20.50 కోట్లకు SRHలో చేరిన పాట్ కమ్మిన్స్.. ఇప్పుడు రూ. 18 కోట్లకు ఫ్రాంచైజీ రిటైన్ చేసుకుంది. అతను సీజన్‌కు ముందు కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఆ సీజన్ లోనే SRHని ఫైనల్‌కు నడిపించాడు.
సన్ రైజర్స్ హైదరాబాద్ గత సీజన్ లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మొదటి క్వాలిఫయర్, ఫైనల్ మ్యాచ్ లో ఓడిపోయి రన్నరఫ్ గా నిలిచింది. ఆరెంజ్ ఆర్మీ కెప్టెన్‌గా ప్యాట్ కమిన్స్ రాబోయే సీజన్ లో కూడా కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఆల్ రౌండర్ నితీష్ రెడ్డిని సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ 6 కోట్ల రూపాయలకు తన వద్దే ఉంచుకుంది. ఐపీఎల్ 2024 లో అద్భుతమైన ఆటతో ఆకట్టుకున్న నితీష్ రెడ్డి భారత జట్టు తరఫున కూడా ఎంట్రీ ఇచ్చాడు. అతను ఇప్పటికే టెస్ట్ జట్టులోకి కూడా వచ్చాడు.
గత ఐపీఎల్ సీజన్ లో తమ బ్యాట్ తో విధ్వంసం సృష్టించిన ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలను కూడా హైదరాబాద్ టీమ్ రిటైన్ చేసుకుంది. ఒక్కొక్కరు రూ. 14 కోట్లతో SRHలో ఉంటారు. ఈ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ జోడీ ధనాధన్ ఇన్నింగ్స్ లతో సన్ రైజర్స్ ఫైనల్ వరకు సులువుగానే వెళ్లగలిగింది. అభిషేక్ 204.21 స్ట్రైక్ రేట్‌తో 484 పరుగులు చేసాడు. ట్రావిస్ హెడ్ 191.55 స్ట్రైక్ రేట్‌తో 567 పరుగులు చేశాడు.
ఐపీఎల్ 2024 లో అదరగొట్టిన అభిషేక్ శర్మ భారత జట్టులోకి కూడా వచ్చాడు. జింబాబ్వేపై అరంగేట్రం చేశాడు. తన రెండో మ్యాచ్ లోనే సెంచరీతో చెలరేగాడు. అతను దక్షిణాఫ్రికా పర్యటన భారత జట్టులో సభ్యుడిగా కూడా ఉన్నాడు. బంగ్లాదేశ్‌తో మూడు టీ20లు కూడా ఆడాడు.
ఐపీఎల్ మెగా వేలానికి ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) ఐదుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. కాబట్టి వారికి ఒక రైట్ టు మ్యాచ్ (RTM) కార్డ్ ఉంటుంది. వారు అన్‌క్యాప్డ్ ప్లేయర్‌లో RTMని ఉపయోగించవచ్చు. ఫ్రాంచైజీలు ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్‌లను ఒక్కొక్కరు రూ. 4 కోట్లకు రిటైన్ చేసుకోవడానికి అనుమతించారు. కానీ సన్ రైజర్స్ ఆ విధంగా నిర్ణయం తీసుకోలేదు.
SRH రిటైన్ చేసిన ఆటగాళ్ల జాబితా ఇదే
హెన్రిచ్ క్లాసెన్ (రూ. 23 కోట్లు)
పాట్ కమిన్స్ (రూ. 18 కోట్లు)
అభిషేక్ శర్మ (రూ. 14 కోట్లు)
ట్రావిస్ హెడ్ (రూ. 14 కోట్లు)
నితీష్ కుమార్ రెడ్డి (రూ. 6 కోట్లు)
SRH విడుదల చేసిన ఆటగాళ్ల జాబితా ఇదే
భువనేశ్వర్ కుమార్, వాషింగ్టన్ సుందర్
ఐడెన్ మార్క్రామ్, టి నటరాజన్
రాహుల్ త్రిపాఠి, అబ్దుల్ సమద్
గ్లెన్ ఫిలిప్స్, మయాంక్ అగర్వాల్
మార్కో జాన్సెన్, సన్వీర్ సింగ్
వనిందు హసరంగా, ఆకాష్ సింగ్
షాబాజ్ అహ్మద్, ఫజల్హాక్ ఉనదేవాకత్
ఉమ్రాన్ మాలిక్, మయాంక్ మార్కండే
జాతవేద్ సుబ్రమణ్యన్, విజయకాంత్ వియస్కాంత్