Mumbai Indians IPL 2025 Retentions: టెండూల్క‌ర్ కు షాక్.. ముంబై ఇండియ‌న్స్ రిటైన్ ప్లేయ‌ర్లు వీరే

First Published | Oct 31, 2024, 6:22 PM IST

Mumbai Indians IPL 2025 Retentions: గ‌త సీజ‌న్ ముంబై ఇండియ‌న్స్ (ఎంఐ) హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో  దారుణ ప్ర‌ద‌ర్శ‌న‌తో పాయింట్ల ప‌ట్టిక‌లో అట్ట‌డుగు స్థానంలో నిలిచింది. దీంతో రాబోయే ఐపీఎల్ 2025 సీజ‌న్ కోసం ఏ ప్లేయ‌ర్ల‌ను రిటైన్ చేసుకుంటుంద‌నేది మ‌రింత ఆస‌క్తిని పెంచింది. తాజాగా ముంబై టీమ్ రిటెన్షన్, విడుదల చేసిన ఆటగాళ్ల జాబితాను ప్రకటించింది.
 

Mumbai Indians, Mumbai Indians IPL 2025 Retentions, IPL 2025, IPL 2025 Retentions

Mumbai Indians IPL 2025 Retentions: ముంబై ఇండియన్స్ రిటైన్, విడుదల చేసిన ఆటగాళ్ల జాబితాను ప్ర‌క‌టించింది. ఐదుసార్లు ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) ఛాంపియన్ అయిన‌ ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2025 సీజ‌న్ కోసం మెగా వేలానికి ముందు ప్రస్తుత కెప్టెన్ హార్దిక్ పాండ్యా, భారత జ‌ట్టు టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, పేస్ స్పియర్ హెడ్ జస్ప్రీత్ బుమ్రా, యంగ్ ప్లేయ‌ర్ తిలక్ వర్మతో పాటు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను రిటైన్ చేసుకుంది.

అయితే, అనుకున్న‌ట్టుగానే భార‌త స్టార్ బౌల‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రాకు ముంబై ఇండియ‌న్స్ టాప్ ప్లేస్ ఇచ్చింది. బుమ్రా రూ. 18 కోట్లతో టాప్ రిటెన్షన్‌లో ఉండగా, హార్దిక్, రోహిత్, సూర్య ముగ్గురిని రూ. 16.35 కోట్లతో ముంబై రిటైన్ చేసుకుంది. యంగ్ ప్లేయ‌ర్, మిడిల్‌ ఆర్డర్‌ బ్యాటర్‌ తిలక్ వ‌ర్మ‌ను రూ. 8 కోట్లతో రిటైన్ చేసుకుంది.

వాంఖడే స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన 17వ సీజన్‌లో వారి చివరి లీగ్ మ్యాచ్‌లో రోహిత్ తన చివరి మ్యాచ్ ను ముంబై ఇండియ‌న్స్ త‌ర‌ఫున ఆడేశాడ‌నే చ‌ర్చ సాగింది. రాబోయే సీజ‌న్ లో రోహిత్ శ‌ర్మ ముంబై త‌ర‌ఫున కాకుండా మ‌రో జ‌ట్టు త‌ర‌ఫున ఆడ‌తాడ‌ని భావించారు. కానీ, అలాంటిదేమీ లేకుండా ముంబై ఇండియ‌న్స్ రోహిత్ శ‌ర్మ‌ను రిటైన్ చేసుకుంది. ముంబై ఫ్రాంచైజీ 'హిట్‌మ్యాన్'ని వేరే చోటికి వెళ్లకుండా  త‌మ‌తోనే కొన‌సాగించాల‌ని నిర్ణ‌యించుకుంది. 


అయితే, వికెట్ కీపర్-బ్యాటర్ ఇషాన్ కిషన్ కు ముంబై టీమ్ షాకిచ్చింది. ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఇషాన్ కిష‌న్ ను విడుదలయ్యాడు. అతను 2022లో కూడా ఇషాన్ ను విడుద‌ల చేసిన ముంబై టీమ్ అతన్ని రూ. 15.25 కోట్లకు తిరిగి కొనుగోలు చేసింది. మ‌ళ్లీ ఇప్పుడు అత‌న్ని వ‌దులుకుంది. అలాగే, ఆస్ట్రేలియన్ బ్యాటర్ టిమ్ డేవిడ్, మిడిల్-ఆర్డర్ బ్యాట‌ర్ నేహ‌ల్ వధేరా కూడా వేలం పూల్‌లోకి తిరిగి వెళుతున్నారు. అయితే, వారిలో ఒకరిని రైట్ టు మ్యాచ్ (RTM) కార్డు ఉపయోగించి ఉంచుకునే అవకాశం ఉంది.

Bumrah

ముంబై ఇండియ‌న్స్ రిటైన్ చేసిన‌ ఆటగాళ్ల జాబితా ఇదే 

జస్ప్రీత్ బుమ్రా (రూ. 18 కోట్లు)
హార్దిక్ పాండ్యా (సి) (రూ. 16.35 కోట్లు)
సూర్యకుమార్ యాదవ్ (రూ. 16.35 కోట్లు)
రోహిత్ శర్మ (రూ. 16.3 కోట్లు)
తిలక్ వర్మ (రూ. 8 కోట్లు).

Tilak Varma

ముంబై ఇండియ‌న్స్ విడుద‌ల చేసిన ఆటగాళ్ల జాబితా ఇదే 

డెవాల్డ్ బ్రీవిస్, ఇషాన్ కిషన్, టిమ్ డేవిడ్, హార్విక్ దేశాయ్, అర్జున్ టెండూల్కర్, షామ్స్ ములానీ, నెహాల్ వధేరా, కుమార్ కార్తికేయ, పీయూష్ చావ్లా, ఆకాష్ మధ్వల్, ల్యూక్ వుడ్, రొమారియో షెపర్డ్, గెరాల్డ్ కోయెట్జీ, శ్రేయస్ గోపాల్, నమన్ ధీర్, అన్షుల్ కాంబోజ్, మొహమ్మద్ నబీ, శివాలిక్ శర్మ, క్వేనా మఫాకా.

ఐపీఎల్ 2025 మెగా వేలం కోసం ముంబై ఇండియ‌న్స్ వ‌ద్ద పర్స్ విలువ : రూ. 45 కోట్లు

ముంబై కెప్టెన్ ఎవ‌రు? మ‌ళ్లీ హార్దిక్ పాండ్యాకే ఇస్తారా?  లేక కొత్త కెప్టెన్ వ‌స్తారా? 

గ‌త ఐపీఎల్ సీజ‌న్ కు ముందు హార్దిక్ పాండ్యా గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్టులో ఉన్నాడు. అయితే, ముంబై ఇండియ‌న్స్ అత‌న్ని భారీ ధ‌ర‌కు ఆ జ‌ట్టు నుంచి ట్రేడ్ చేసుకుంది. అలాగే, రోహిత్ శ‌ర్మ‌ను తొల‌గించి హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీని అప్పగించింది. అయితే, ముంబై ఆశించిన విధంగా హార్దిక్ కెప్టెన్సీలో ముంబై ఐపీఎల్ 2024 లో మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న ఇవ్వ‌లేక‌పోయింది. పాయింట్ల ప‌ట్టిక‌లో అట్ట‌డుగు స్థానంలో నిలిచింది. 

హార్దిక్ అరంగేట్రం కెప్టెన్సీ సీజన్‌లో జట్టు చివరి స్థానంలో నిలిచినందున కెప్టెన్‌గా ఎవరు ఉంటారనే సందేహాలు ఉన్నాయి. సూర్యకుమార్ యాదవ్ భారత T20I కెప్టెన్, జాతీయ జట్టు కెప్టెన్ గా ఉన్న సూర్య ఐపీఎల్ జ‌ట్టుకు కూడా కెప్టెన్సీ వ‌హించే అవ‌కాశం ఉంది. ఇదే స‌మ‌యంలో రోహిత్ మళ్లీ లీడ్ సైడ్‌లోకి రావడాన్ని కూడా తోసిపుచ్చలేము. 

Latest Videos

click me!