Shreyas Iyer, Kolkata Knight Riders IPL 2025 Retentions, Kolkata Knight Riders, IPL 2025 Retentions, IPL 2025
Kolkata Knight Riders IPL 2025 Retentions: కోల్‌కతా నైట్ రైడర్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2025) కోసం రిటైన్ చేసుకున్న, అలాగే జట్టు నుంచి విడుదల చేసిన ఆటగాళ్ల జాబితాను ప్రకటించింది. ఈ ఏడాది ప్రారంభంలో 'పర్పుల్ బ్రిగేడ్' తమ మూడవ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టైటిల్ ను గెలుచుకుంది. జట్టును మూడో ఐపీఎల్ టైటిల్ వరకు నడిపించిన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కు కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) షాక్ ఇచ్చింది. అతన్ని రిటైన్ చేసుకోకుండా వదులుకుంది.
కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) రిటైన్ చేసుకున్న ఆటగాళ్లలో భారత యంగ్ ప్లేయర్ రింకు సింగ్ కు టాప్ ప్లేస్ ఇచ్చింది. రింకూ సింగ్ తో పాటు వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, హర్షిత్ రాణా, రమణదీప్ సింగ్ లు కోల్ కతా టీమ్ రిటైన్ లిస్టులో ఉన్నారు. వేలానికి ముందు కేకేఆర్ మొత్తం ఆరు రిటెన్షన్ స్లాట్‌లను పూర్తి చేసింది.
కేకేఆర్ మిడిల్-ఆర్డర్ బ్యాటర్ రింకూ సింగ్ కు టాప్ ప్లేస్ ఇస్తూ రూ. 13 కోట్లతో రిటైన్ చేసుకోవడం హాట్ టాపిక్ అవుతోంది. శ్రేయాస్ అయ్యర్‌ను తిరిగి రిటెన్షన్ పూల్‌లోకి విడుదల చేసిన తర్వాత రింకూ కెప్టెన్ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.
Rinku singh,
భారత లెగ్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తితో పాటు వెస్టిండీస్ ఆల్‌రౌండర్లు సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్‌లను ఒక్కొక్కరికి రూ.12 కోట్లు చెల్లించి జట్టుతోనే ఉంచుకుంది. ఇక హర్షిత్ రాణా, రమణదీప్ సింగ్ లను 4 కోట్ల రూపాయలతో అన్‌క్యాప్డ్ స్లాట్‌లను పూర్తి చేసింది కేకేఆర్.
అంతకుముందు సీజన్లలో ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత 2022లో కోల్ కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) శ్రేయాస్ అయ్యర్‌ను కెప్టెన్‌గా నియమించింది. 2022, 2024 ఐపీఎల్ సీజన్‌లలో కేకేఆర్ ఫ్రాంచైజీకి అయ్యర్ కెప్టెన్ గా జట్టునున ముందుకు నడిపించాడు. 2023 అయ్యర్ గైర్హాజరీలో నైట్ రైడర్స్‌కు నితీష్ రాణా నాయకత్వం వహించారు. అయితే, శ్రేయాస్ అయ్యర్ ఇప్పటికే ఇతర ఫ్రాంఛైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లను అందుకుంటున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. మెగా వేలానికి ముందే అతని నుంచి ఒప్పందం చేసుకునే అవకాశాలను కూడా ప్రస్తావించాయి.
గత సీజన్‌లో రికార్డు స్థాయిలో రూ. 24.75 కోట్లకు కొనుగోలు చేసిన ఆస్ట్రేలియా స్పీడ్‌స్టర్ మిచెల్ స్టార్క్‌ను కేకేఆర్ వదులు కుంది. ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక ధర పలికిన ప్లేయర్లలో ఒకరిగా మిచెల్ స్టార్క్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. మొత్తం ఆరు స్లాట్‌లను పూర్తి చేయడంతో కేకేఆర్ మొత్తం 120 కోట్ల రూపాయల నిలుపుదల పర్స్‌లో మెగా వేలానికి ముందు మొత్తం 57 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. ప్రతి సీజన్ లో కేకేఆర్ కోసం అద్భుతమైన ఇన్నింగ్స్ లను ఆడుతున్న సునీల్ నరైన్ ను కేకేఆర్ రిటైన్ చేసుకుంది.
Image credit: PTI
కోల్ కతా నైట్ రైడర్స్ రిటైన్ చేసిన ఆటగాళ్ల జాబితా
రింకూ సింగ్: రూ. 13 కోట్లు
వరుణ్ చక్రవర్తి: రూ. 12 కోట్లు
సునీల్ నరైన్: రూ. 12 కోట్లు
ఆండ్రీ రస్సెల్: రూ. 12 కోట్లు
హర్షిత్ రానా: రూ. 4 కోట్లు
రమణదీప్ సింగ్: రూ. 4 కోట్లు
కోల్ కతా నైట్ రైడర్స్ KKR విడుదల చేసిన ఆటగాళ్ల జాబితా
శ్రేయాస్ అయ్యర్
నితీష్ రాణా
రహ్మానుల్లా గుర్బాజ్
ఫిల్ సాల్ట్
సుయాష్ శర్మ
అనుకుల్ రాయ్
వెంకటేష్ అయ్యర్
వైభవ్ అరోరా
KS భరత్
చేతన్ సకారియా
మిచెల్ స్టార్క్
అంగ్క్రిష్ షెర్ఫార్‌ఫొర్
రఘువన్
మనీష్ పాండే
అల్లా గజన్‌ఫర్
దుష్మంత చమీరా
సాకిబ్ హుస్సేన్
జాసన్ రాయ్
గుస్ అట్కిన్సన్
ముజీబ్ ఉర్ రెహమాన్
KKR కోసం IPL 2025 మెగా వేలం పర్స్ లో మిగిలినది: రూ. 63 కోట్లు