క్రికెట్ లెజెండ్ కు అవ‌మానం.. టీమిండియాపై సునీల్ గ‌వాస్క‌ర్ ఫైర్

First Published | Jan 5, 2025, 3:20 PM IST

Border Gavaskar Trophy: టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో చిత్తుగా ఓడిపోయింది. బోర్డర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీని కోల్పోయింది. తొలిసారి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైన‌ల్ నుంచి ఔట్ అయింది. ఈ క్ర‌మంలోనే క్రికెట్ లెజెండ్ సునీల్ గ‌వాస్క‌ర్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. 
 

Rohit Sharma, Sunil Gavaskar

Border Gavaskar Trophy: 10 ఏళ్ల తర్వాత తొలిసారిగా బోర్డర్-గవాస్కర్ సీరీస్ ట్రోఫీని భార‌త జ‌ట్టు కోల్పోయింది. సిడ్నీ వేదిక‌గా జ‌రిగిన చివ‌రి, 5వ టెస్టులో ఆసీస్ చేతిలో భార‌త్ ఓడిపోయింది. దీంతో ఆస్ట్రేలియా జ‌ట్టు 3-1తో సిరీస్ ను కైవ‌సం చేసుకుంది. ఈ ఓట‌మితో భార‌త జ‌ట్టు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఆశలు గ‌ల్లంతయ్యాయి. 

ఆదివారం సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన BGT చివరి టెస్టులో భారత్ 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. నిర్ణయాత్మక టెస్టులో ఆస్ట్రేలియా 163 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఈజీగానే ఛేదించింది. భార‌త సిరీస్ కోల్ప‌వ‌డంతో జ‌ట్టు ఆట‌గాళ్ల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

Sunil Gavaskar

10 ఏళ్లలో తొలిసారి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని కోల్పోయిన భార‌త్

గ్రేట్ ఇండియన్ బ్యాట్స్‌మెన్ సునీల్ గవాస్కర్ తన, అలన్ బోర్డర్ పేరుతో ఉన్న ట్రోఫీని ఆస్ట్రేలియా జట్టుకు అందించడానికి ఆహ్వానించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఐదవ, చివరి టెస్టులో భారత్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించి ఆస్ట్రేలియా 10 ఏళ్లలో తొలిసారి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని గెలుచుకుంది. ఆ సమయంలో సునీల్ గ‌వాస్క‌ర్ గ్రౌండ్ లోనే ఉన్నాడు. అయితే,  మైదానంలో ఉన్నప్పటికీ గవాస్కర్‌ను పిలవకపోవడంతో అలన్ బోర్డర్ ఆస్ట్రేలియా జట్టుకు బీజీటీ ట్రోఫీని అందించాడు.


ఘోర అవ‌మానం.. సునీల్ గ‌వాస్క‌ర్ ఫైర్ 

టెస్టు సిరీస్ పూర్త‌యిన త‌ర్వాత భార‌త మాజీ క్రికెట్ లెజెండ్ సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ.. 'అవార్డు పంపిణీ వేడుకకు వెళ్లడం ఆనందంగా ఉండేది. అన్నింటికంటే, ఇది బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ.. ఆస్ట్రేలియా-భారతదేశానికి సంబంధించినది. నేను మైదానంలోనే ఉన్నాను. ఆస్ట్రేలియాకు ట్రోఫీ ఇచ్చినా పట్టించుకోను. మెరుగైన క్రికెట్ ఆడి విజయం సాధించారు. అయితే, నేను భారతీయుడిని కాబట్టి నా స్నేహితుడు అలెన్ బోర్డర్‌తో కలిసి ట్రోఫీని అందజేయడం ఆనందంగా ఉండేదని అన్నారు. అలాగే, భార‌త జ‌ట్టు ప్ర‌ద‌ర్శ‌న‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. 

భార‌త్ కు బిగ్ షాక్.. తొలిసారి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ నుంచి ఔట్

బోర్డర్ గవాస్కర్ సిరీస్ ఎప్పుడు ప్రారంభం అయింది? 

బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీ సిరీస్ ప్రారంభం అయి దాదాపు 28 ఏళ్ల అవుతోంది. 1996-97 నుంచి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం భారత్, ఆస్ట్రేలియాలు టెస్టు సిరీస్ ను ఆడుతున్నాయి. చాలా రికార్డులు ఈ సిరీస్ లో న‌మోద‌వుతున్నాయి. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఈసారి గత వారం మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో వీక్షకుల రికార్డు బద్దలైంది.

ఆదివారం సిడ్నీ టెస్ట్ మూడో రోజున ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించి ఐదు మ్యాచ్‌ల బోర్డర్-గవాస్కర్ సిరీస్‌ను 3-1తో గెలుచుకుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కి కూడా చేరుకుంది. దక్షిణాఫ్రికాతో ఫైన‌ల్ లో తలపడనుంది. ఈ ఓటమితో భారత్‌ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ రేసుకు దూరమైంది. భారత్ నిర్దేశించిన 162 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ఆస్ట్రేలియా నాలుగు వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. 

Cricket, India, IND vs AUS, Team india,

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ నుంచి భారత్ ఔట్

దాదాపు ఒక దశాబ్దం తర్వాత ఆస్ట్రేలియా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని గెలుచుకుంది.  ఆస్ట్రేలియా ఇప్పుడు వరుసగా రెండోసారి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడ‌నుంది. డ‌బ్ల్యూటీసీ రెండో టైటిల్ గెలుక‌చుకోవ‌డం కోసం వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది. 

ఈ ఛాంపియన్‌షిప్ ప్రారంభమైన తర్వాత భారత్ ఫైనల్ ఆడకపోవడం ఇదే తొలిసారి. భారత జట్టు గత రెండు సార్లు రన్నరప్‌గా నిలిచింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ తొలి ఫైన‌ల్ 2021లో భారత్‌ను న్యూజిలాండ్ ఓడించింది. ఆ త‌ర్వాత 2023లో ఆస్ట్రేలియా భారత్‌ను ఓడించింది. ఈ సారైనా WTC టైటిల్ సాధించాల‌నే ప‌ట్టుద‌లతో ముందుకు సాగింది. కానీ, కీల‌క‌మైన బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ సిరీస్ లో చెత్త ప్ర‌ద‌ర్శ‌న‌తో బీజీటీ ట్రోఫీని కోల్పోవ‌డంతో పాటు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైన‌ల్ ఆడే అవ‌కాశం కూడా కోల్పోయింది.

యుజ్వేంద్ర చాహల్ - ధనశ్రీ వర్మలు విడిపోతున్నారా?

Latest Videos

click me!