భార‌త్ కు బిగ్ షాక్.. తొలిసారి ఇలా

First Published | Jan 5, 2025, 2:28 PM IST

ICC World Test Championship: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ నుంచి భార‌త్ ఔట్ అయింది. డ‌బ్ల్యూటీసీలో మొద‌టిసారి టీమిండియా ఫైనల్‌కు చేరుకోలేక‌పోయింది. 
 

ICC World Test Championship: భార‌త క్రికెట్ జ‌ట్టుకు బిగ్ షాక్ త‌గిలింది. బోర్డర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా, ఆస్ట్రేలియాలు ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ను ఆడాయి. కీల‌క‌మైన సిడ్నీ టెస్టులో భార‌త జ‌ట్టు ఘోరంగా ఓడిపోయింది. దీంతో భార‌త జ‌ట్టు తొలిసారి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ నుంచి ఔట్ అయింది. 

5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లోని ఐదవ, చివరి టెస్ట్‌లో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు 6 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించి 3-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. 10 ఏళ్ల తర్వాత భారత్‌పై టెస్టు సిరీస్‌ను గెలుచుకున్న ఆస్ట్రేలియాకు ఇది పెద్ద విజయం. చివరిసారిగా 2014-15లో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని ఆస్ట్రేలియా గెలుచుకుంది. ఈ సమయంలో భారత్ తన గడ్డపై రెండుసార్లు ఆస్ట్రేలియాను ఓడించింది.

WTC లో రెండోసారి ఫైనల్‌కు చేరిన ఆసీస్ 

బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీలో తొలి మ్యాచ్ లో భార‌త్ అద్భుత విజయాన్ని అందుకుంది. అయితే, పెర్త్‌లో జరిగిన మొదటి టెస్టులో ఓడిపోయిన తర్వాత, ఆస్ట్రేలియా అద్భుతంగా పునరాగమనం చేసింది. అడిలైడ్, మెల్‌బోర్న్, సిడ్నీలలో భారత్‌కు బిగ్ షాకిస్తూ అద్భుత విజ‌యాలు అందుకుంది. 

ఈ విజయంతో ఆస్ట్రేలియా జట్టు వరుసగా రెండోసారి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరుకుంది. ఇక భారత జ‌ట్టు తొలిసారిగా WTC ఫైనల్‌ ఆడలేకపోతోంది. భారత్ చివరి రెండు ఫైనల్స్‌కు చేరుకుంది, అయితే రెండుసార్లు ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. న్యూజిలాండ్ 2021లో భారత్‌ను ఓడించగా, 2023లో ఆస్ట్రేలియా భారత్‌ను ఓడించింది. ఈ సారైనా WTC టైటిల్ సాధించాల‌నే భార‌త్ క‌ల చెదిరిపోయింది. 


WTC దక్షిణాఫ్రికాతో పోటీ ప‌డ‌నున్న ఆసీస్ 

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ చివరి మ్యాచ్ జూన్ 11 నుంచి 15 వరకు జరగనుంది. ఇంగ్లండ్‌లోని లార్డ్స్‌లో ఆస్ట్రేలియాతో దక్షిణాఫ్రికా తలపడనుంది. కంగారూ జట్టు ఈ ట్రోఫీని కాపాడుకోవడానికి వెళ్తుంది. శ్రీలంకలో ఇంకా 2-టెస్టుల సిరీస్ ఆడాల్సి ఉంది. అయితే ఆ సిరీస్ ఫలితం ఫైనల్‌పై ఎలాంటి ప్రభావం చూపదు.

WTC మూడో స్థానంలో భార‌త్ 

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ లో భారత్ 50.00 PCT (పాయింట్ల శాతం)తో మూడో స్థానంలో నిలవగా, ఆస్ట్రేలియా 63.73 PCTతో WTC ఫైనల్‌కు అర్హత సాధించింది. దక్షిణాఫ్రికా ఇప్పటికే 66.67 PCTతో ఫైనల్‌కు తన స్థానాన్ని నిల‌బెట్టుకుంది. 

సిడ్నీ మ్యాచ్‌లో ఏం జరిగిందంటే?

కీల‌మైన సిడ్నీ టెస్టుకు భార‌త కెప్టెన్ రోహిత్ శ‌ర్మ దూరంగా ఉన్నాడు. అత‌ని స్థానంలో బుమ్రా కెప్టెన్సీని కొన‌సాగించాడు. బ్యాట‌ర్ గా శుభ్ మ‌న్ గిల్ జ‌ట్టులోకి వ‌చ్చాడు. టాస్ గెలిచిన బుమ్రా తొలుత బ్యాటింగ్ దిగాడు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 157 పరుగులు చేసింది.

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 181 పరుగులు చేసింది. భారత్‌కు 4 పరుగుల ఆధిక్యం లభించింది. భార‌త జ‌ట్టు రెండో ఇన్నింగ్స్ త‌ర్వాత ఆధిక్యం 161 పరుగులకు చేరింది. కంగారూ జట్టు 162 పరుగుల లక్ష్యాన్ని ఈజీగానే అందుకుంది. దీంతో ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసి విజయం సాధించింది. బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీని ఆసీస్ 3-1తో గెలుచుకుంది.

IND vs AUS

ఘోరంగా విఫ‌ల‌మైన భార‌త బ్యాట‌ర్లు 

బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భార‌త జ‌ట్టు ఓట‌మికి బ్యాటింగ్, బౌలింగ్ తో పాటు చెత్త‌ ఫీల్డింగ్ కూడా కార‌ణం అయింది. మ‌రీ ముఖ్యంగా సీనియ‌ర్ స్టార్ ప్లేయ‌ర్ రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీలు చెత్త ప్ర‌ద‌ర్శ‌న‌లు చేశారు. 

ఇత‌ర ప్లేయ‌ర్లు కూడా ఆశించిన స్థాయిలో ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇవ్వ‌లేక‌పోయారు. బౌలింగ్ విభాగంలో కూడా భార‌త్ ఎక్కువ‌గా స్టార్ పేస‌ర్ జస్ప్రీత్ బుమ్రాపై ఆధార‌ప‌డాల్సి వ‌చ్చింది. చెత్త ఫీల్డింగ్ కూడా భార‌త్ ఓట‌మిలో కార‌ణంగా ఉంది. ఆసీస్ చేతిలో ఘోరంగా ఓడిపోయిన భార‌త జ‌ట్టుపై తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఆట‌గాళ్ల తీరుపై మాజీలు, క్రికెట్ ల‌వ‌ర్స్ మండిప‌డుతూ.. తీవ్ర‌మైన కామెంట్స్ చేస్తున్నారు.

Latest Videos

click me!