యుజ్వేంద్ర చాహల్ - ధనశ్రీ వర్మలు విడిపోతున్నారా? సోషల్ మీడియాలో కొత్త‌ అలజడి

First Published | Jan 4, 2025, 11:55 PM IST

Yuzvendra Chahal-Dhanashree Verma: డిసెంబర్ 22, 2020న పెళ్లి చేసుకున్న యుజ్వేంద్ర చాహల్ - ధనశ్రీ వర్మలు విడాకులకు వెళుతున్నారనే ఊహాగానాలు పెరిగాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ జోడీ ఒకరినొకరు అన్‌ఫాలో చేయడంతో సోష‌ల్ మీడియాలో కొత్త అల‌జ‌డి మొద‌లైంది.
 

Yuzvendra Chahal and Dhanashree Verma: భారత స్టార్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, అతని భార్య ధనశ్రీ వర్మ మధ్య విడాకులు పుకార్లు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. ఈ జంట విడాకుల పుకార్లు సోషల్ మీడియాలో తుఫాను సృష్టించింది.

గతేడాది 2024లో భారత ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా, నటి నటాషా స్టాంకోవిచ్‌ల విడాకులు అందరినీ షాక్‌కి గురిచేసిన నేపథ్యంలో ఇప్పుడు కొత్త సంవత్సరం 2025లో యుజ్వేంద్ర చాహల్‌, ధనశ్రీ వర్మల వార్తలు సంచలనంగా మారాయి. ఈ స్టార్ జోడీ నిజంగానే విడాకులు తీసుకుంటుందా?

Image credit: Dhanashree VermaInstagram

యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ మధ్య సంబంధాలు తెగిపోయాయా?

డిసెంబర్ 22, 2020న పెళ్లి చేసుకున్న యుజ్వేంద్ర చాహల్ - ధనశ్రీ వర్మలు విడాకులకు వెళుతున్నారనే ఊహాగానాలు పెరిగాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ జోడీ ఒకరినొకరు అన్‌ఫాలో చేయడాన్ని అభిమానులు త్వరగా గమనించారు. దీంతో సోష‌ల్ మీడియాలో కొత్త అల‌జ‌డి మొద‌లైంది.

యుజ్వేంద్ర చాహల్ కూడా ధనశ్రీ వర్మతో కలిసి ఉన్న ఒక చిత్రాన్ని మినహా అన్ని చిత్రాలను తొలగించారు, ఇది అగ్నికి ఆజ్యం పోసింది. కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ, యుజ్వేంద్ర చాహల్ వైవాహిక జీవితంలో సమస్యల పుకార్లు చాలా కాలంగా వార్తల్లో ఉన్నాయి. ఇప్పుడు ఫోటోల డిలీట్ తో మ‌ళ్లీ ర‌చ్చ మొద‌లైంది.


ఈ స్టార్ జోడీ విడాకుల పుకార్లు నిజమేనా?

విడాకుల పుకార్లు నిజమేనని ఈ జంటకు సన్నిహిత వర్గాలు చెప్పిన‌ట్టు ప‌లు మీడియా కథ‌నాలు పేర్కొంటున్నాయి. కానీ, ఇప్ప‌టివ‌ర‌కు ఈ జోడీ అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు.

ప‌లు మీడియా నివేదిక‌లు పేర్కొన్న ప్రకారం..  ''విడాకుల ద‌శ‌కు చేరుకున్నారు. అది అధికారికం కావడానికి కొద్ది సమయం మాత్రమే ఉంది. వారి విడిపోవడానికి ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు, అయితే ఈ జంట విడివిడిగా జీవించాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టమైందని'' పేర్కొంటున్నాయి.

2020లో చాహల్-ధనశ్రీ వివాహం

యుజ్వేంద్ర చాహల్-ధనశ్రీ వర్మల జోడీ 2020 సంవత్సరంలో మూడు ముళ్ల బంధంతో ఒక్క‌ట‌య్యారు. అప్ప‌ట్లో వారి వివాహం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది.

ఎందుకంటే  యూజీ అని పిలవబడే యుజ్వేంద్ర చాహ‌ల్ ఒక అద్భుతమైన భారతీయ క్రికెటర్. అతని భార్య ధనశ్రీ కొరియోగ్రాఫర్. ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో 'నటి, కళాకారిణి, డాక్టర్' అని పేర్కొన్నారు.

చాహల్, ధనశ్రీల వివాహం ఎలా జరిగింది?

ధనశ్రీ వర్మ 2024లో 'ఝలక్ దిఖ్లా జా 11' అనే డ్యాన్స్ రియాలిటీ షోలో పాల్గొన్నారు. షోలో, హోస్ట్‌లు గౌహర్ ఖాన్, రిత్విక్ ధంజని యుజ్వేంద్ర చాహల్‌తో ఆమె ప్రేమకథ గురించి ధనశ్రీ వర్మను అడిగినప్పుడు.. ధనశ్రీ తాను చాహ‌ల్ కు డ్యాన్స్ నేర్పించడం గురించి చెప్పారు. అలా వారి మధ్య ప్రేమ చిగురించిందని చెప్పింది. ఆ ప్రేమ పెళ్లి వ‌ర‌కు చేరింది.

చాహల్, ధనశ్రీల ప్రేమకథ

యుజ్వేంద్ర చాహల్ తో ఆమె ప్రేమకథను గురించి ధనశ్రీ వర్మ చెబుతూ.. ''కోవిడ్ -19 లాక్‌డౌన్ (2020) సమయంలో మ్యాచ్‌లు జరగడం లేదు. క్రికెటర్లందరూ ఇంట్లో కూర్చుని నిరాశకు గురయ్యారు. అప్పుడు చాహ‌ల్ డాన్స్ నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు.

యుజ్వేంద్ర చాహల్ సోషల్ మీడియాలో నా డ్యాన్స్ వీడియోలను చూశాడు. ఆ సమయంలో అత‌ను న‌న్ను సంప్రదించి నా విద్యార్థిగా మారాడు. నేను అతనికి డాన్స్ నేర్పడానికి అంగీకరించాను. ఆ త‌ర్వాత మ‌ధ్య ప్రేమ చిగురించింది. మూడు ముళ్ల బంధంతో ఒక్క‌ట‌య్యాము'' అని చెప్పారు.

Latest Videos

click me!