విరాట్ కోహ్లీ, వెంటనే సచిన్ టెండూల్కర్‌కి ఫోన్ చేసి, ఏం చేయాలో అడుగు...

Published : Aug 27, 2021, 05:20 PM IST

క్రికెట్ ప్రపంచంలో అనితర సాధ్యమైన రికార్డులెన్నో క్రియేట్ చేశాడు సచిన్ టెండూల్కర్. అంతర్జాతీయ క్రికెట్‌లో 100 సెంచరీలు బాదిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా నిలిచిన సచిన్‌కి పోటీవచ్చేలా కనిపించాడు విరాట్ కోహ్లీ...

PREV
113
విరాట్ కోహ్లీ, వెంటనే సచిన్ టెండూల్కర్‌కి ఫోన్ చేసి, ఏం చేయాలో అడుగు...

కెరీర్ ఆరంభం నుంచి 11 ఏళ్ల పాటు సెంచరీల మోత మోగించి, ఒకే దశాబ్దంలో 20వేలకు పైగా పరుగులు చేసిన మొట్టమొదటి బ్యాట్స్‌మెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు ‘రన్ మెషిన్’ విరాట్ కోహ్లీ...

213

అలాంటి రన్‌మెషిన్‌కి ఇప్పుడు కాస్త రిపేర్ అవసరమనుకుంటా... అంతర్జాతీయ కెరీర్‌లో అత్యంత వేగంగా 70 సెంచరీలు నమోదుచేసిన విరాట్ కోహ్లీ, సచిన్ రికార్డును అధిగమించేలా కనిపించాడు...

313

అయితే గత రెండేళ్లుగా 71వ సెంచరీ మార్కును అందుకోవడంలో విఫలం అవుతున్నాడు విరాట్ కోహ్లీ. అప్పుడు కోహ్లీకి సెంచరీ లేకుండానే 50 ఇన్నింగ్స్‌లు ముగిసిపోయాయి...

413

గత 18 ఇన్నింగ్స్‌ల్లో కేవలం మూడంటే మూడు సార్లు మాత్రమే 50+ స్కోరు చేసిన విరాట్ కోహ్లీ, ఇంగ్లాండ్ టూర్‌లో ఆ మార్కు అందుకోవడానికి కూడా తెగ కష్టపడుతున్నాడు... ఇప్పటిదాకా నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కోహ్లీ చేసిన పరుగులు 69 మాత్రమే...

513

టెస్టుల్లో 10 వేల పరుగులు అందుకున్న మొట్టమొదటి బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టించిన భారత మాజీ క్రికెటర్ ‘లిటిల్ మాస్టర్’ సునీల్ గవాస్కర్... విరాట్ కోహ్లీకి ఓ సలహా ఇచ్చాడు. 

613

‘విరాట్ కోహ్లీ, వెంటనే సచిన్ రమేష్ టెండూల్కర్‌కి ఫోన్ చేసి, ‘ఏం చేయాలో అడుగు...’, నీకిప్పుడు ఆయన సలహా అవసరం... కోహ్లీ వరుసగా ఐదు, ఆరో, ఏడో స్టంప్‌ బంతులకు అవుట్ అవుతున్నాడు...

713

2014లో ఆఫ్ స్టంప్‌కి వేసిన బంతులకు విరాట్ కోహ్లీ అవుట్ అయ్యాడు. ఇలాంటి బంతులను ఎలా ఎదుర్కోవాలో సచిన్ టెండూల్కర్ సిడ్నీ ఇన్నింగ్స్ చూస్తే తెలుస్తుంది...

813

సిడ్నీలో సచిన్ టెండూల్కర్, తన ఫెవరెట్ కవర్ డ్రైవ్ ఆడకూడదని తనకి తాను నిర్ణయించుకుని, డబుల్ సెంచరీ చేశాడు... టెండూల్కర్ సలహా ఫాలో అయితే నువ్వు కూడా సక్సెస్ అవుతావు..’ అంటూ తెలిపాడు సునీల్ గవాస్కర్...

913

2014 ఇంగ్లాండ్‌ టూర్‌లో తెగ ఇబ్బందిపడిన విరాట్ కోహ్లీ, జేమ్స్ అండర్సన్ బౌలింగ్‌లో ఎడ్జ్ ఇస్తూ, అవుట్ అయ్యాడు. 2018 టూర్‌లో ఈ టెక్నిక్‌ను సరిచేసుకున్నట్టే కనిపించిన కోహ్లీ, అండర్సన్ బౌలింగ్‌లో భారీగా పరుగులు చేశాడు...

1013

అయితే ఇప్పుడు మాత్రం విరాట్ కోహ్లీ మళ్లీ అదే విధంగా అవుట్ అవుతున్నాడు. ఇంగ్లాండ్‌ టూర్‌లో ఆడిన తొలి ఇన్నింగ్స్‌లోనే విరాట్ కోహ్లీ, అండర్సన్ బౌలింగ్‌లో గోల్డెన్ డకౌట్ అయ్యాడు...

1113

మూడో టెస్టులోనూ అండర్సన్ బౌలింగ్‌లో అదే విధంగా అవుట్ అయ్యాడు. ఇంతకుముందు సచిన్ టెండూల్కర్‌కి కూడా ఈ ఇబ్బంది ఉండేది. అయితే దాన్ని సమర్థవంతంగా అధిగమించిన సచిన్, క్రికెట్‌లో లెజెండ్‌గా ఎదిగాడు...

1213

ఇప్పుడు విరాట్ కోహ్లీ కూడా ఇదే సమస్యతో ఇబ్బందిపడుతుండడంతో దాన్ని అధిగమించాలంటే ఏం చేయాలో సచిన్ టెండూల్కర్‌ అనుభవం నుంచి తెలుసుకోవాలని సూచించాడు సునీల్ గవాస్కర్...

1313

టీ20ల్లో ఫెయిల్ అవుతున్నప్పుడు తన స్నేహితుడు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్ ఏబీ డివిల్లియర్స్‌కి కాల్ చేసి మాట్లాడానని చెప్పిన విరాట్ కోహ్లీ, తన సీనియర్ సచిన్ టెండూల్కర్‌కి కాల్ చేస్తాడా? అనేది అనుమానమే అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్... 

click me!

Recommended Stories