జో రూట్ బ్యాటింగ్ చేస్తుంటే, ట్రెండింగ్‌లో అశ్విన్ పేరు... అభిమానులకు తెలిసినంత కూడా...

Published : Aug 27, 2021, 03:30 PM IST

తొలి రెండు టెస్టుల్లో భారత ఫాస్ట్ బౌలర్లు అదరగొట్టారు. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌ను స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేర్చడంలో సూపర్ సక్సెస్ అయ్యారు. అయితే ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ మాత్రం భారత బౌలర్లకు చిక్కకుండా, రివర్స్‌లో చుక్కలు చూపిస్తున్నాడు...

PREV
112
జో రూట్ బ్యాటింగ్ చేస్తుంటే, ట్రెండింగ్‌లో అశ్విన్ పేరు... అభిమానులకు తెలిసినంత కూడా...

మూడో వన్డేలో తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో కలిపి సిరీస్‌లో మూడు సెంచరీలు చేసిన జో రూట్, 500+ పరుగులు చేసి సత్తా చాటాడు. ఇరు జట్లలోని మిగిలిన బ్యాట్స్‌మెన్ ఎవ్వరూ 250+ పరుగులు కూడా చేయలేకపోయారంటే జో రూట్ ఏ రేంజ్ ఫామ్‌లో ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు...

212

మూడో టెస్టులో జో రూట్‌తో పాటు ఇంగ్లాండ్ ఓపెనర్లు రోరీ బర్న్స్, హసీబ్ హమీద్, డేవిడ్ మలాన్ కూడా రాణించడంతో 400+ స్కోరును కూడా అధిగమించింది ఇంగ్లాండ్. భారత బ్యాట్స్‌మెన్ పట్టుమని పది పరుగులు చేయడానికి ఇబ్బంది పడిన చోట, ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ వీరబాదుడు బాదుతున్నారు...

312

ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ సాగుతున్న సమయంలో సోషల్ మీడియాలో భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పేరు ట్రెండింగ్‌లో కనిపించింది... ఒక్కసారి మూడు టెస్టుల్లోనూ రూట్ బ్యాటుతో అదరగొడుతున్నప్పుడు అశ్విన్ ట్రెండ్ అయ్యాడు. 

412

దీనికి కారణం తొలి మూడు వన్డేల్లో రవిచంద్రన్ అశ్విన్‌కి తుది జట్టులో చోటు దక్కలేదు... మొదటి టెస్టులో లేకపోయినా, రెండో టెస్టులో వస్తాడనుకుంటే అలా జరగలేదు. మూడో టెస్టులో అశ్విన్ ఎంట్రీ ఖాయమనుకుంటే, ‘విన్నింగ్ కాంబినేషన్’ అంటూ పాత జట్టునే కొనసాగించాడు విరాట్ కోహ్లీ..

512

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టాప్ బౌలర్‌గా రెండో స్థానంలో ఉన్న రవిచంద్రన్ అశ్విన్, ఆల్‌రౌండర్‌గా నాలుగో స్థానంలో ఉన్నాడు... అలాంటి స్టార్ ప్లేయర్‌ను పక్కనబెట్టడం వల్లే టీమిండియాకి ఇలాంటి పరిస్థితి వచ్చిందంటున్నారు క్రికెట్ విశ్లేషకులు...

612

ఆస్ట్రేలియా టూర్‌లో స్టీవ్ స్మిత్ కూడా ఆరంభంలో భారత జట్టును ఇలాగే ఇబ్బంది పెట్టాడు. అయితే ఆ తర్వాత అశ్విన్ మ్యాజిక్ అద్భుతంగా పనిచేసింది... తొలి టెస్టులో సెంచరీ చేసిన స్టీవ్ స్మిత్, ఆ తర్వాత అశ్విన్‌ను ఎదుర్కోవడానికి ఇబ్బంది పడడం స్పష్టంగా కనిపించింది...

712

బీభత్సమైన ఫామ్‌లో ఉన్న స్టీవ్ స్మిత్‌ను ఓ ఇన్నింగ్స్‌లో డబుల్ డిజిట్ స్కోరు కూడా దాటకుండానే అవుట్ చేసిన రవిచంద్రన్ అశ్విన్, మరో ఇన్నింగ్స్‌లో డకౌట్ చేశాడు... అలాంటి మ్యాచ్ విన్నర్‌ను పక్కనబెడుతోంది టీమిండియా...

812

ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్‌ను ఐదు సార్లు అవుట్ చేశాడు రవిచంద్రన్ అశ్విన్. భారత బౌలర్లలో మిగిలినవారి కంటే అశ్విన్‌కే జో రూట్‌పై మంచి రికార్డు ఉంది...

912

అలాంటి ప్లేయర్‌ను, విన్నింగ్ కాంబినేషన్‌ పేరుతో జట్టుకి దూరంగా పెట్టడం ఎంతవరకూ సమంజసం అంటున్నారు ఫ్యాన్స్... డబ్ల్యూటీసీ ఫైనల్‌లో నాలుగు వికెట్లు తీసిన అశ్విన్, ఆ తర్వాత కౌంటీ మ్యాచ్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు పడగొట్టాడు...

1012

కేవలం రవీంద్ర జడేజా బ్యాటింగ్ ఫామ్‌లో ఉన్నాడని చెప్పి, అతడిని కొనసాగిస్తోంది టీమిండియా. అయితే టెస్టుల్లో రవీంద్ర జడేజా కంటే అశ్విన్‌కి బ్యాటుతో కూడా మంచి రికార్డు ఉంది...

1112

చెన్నై మ్యాచ్‌లో ఇంగ్లాండ్ బౌలర్లను ఎదుర్కొంటూ, అద్భుతమైన సెంచరీ నమోదుచేశాడు రవిచంద్రన్ అశ్విన్. అలాంటి అశ్విన్‌ను పక్కనబెట్టడం వల్లే జో రూట్, టీమిండియాకి కొరకరాని కొయ్యగా మారాడని అంటున్నారు అభిమానులు...

1212

మూడో టెస్టులో పిచ్ భారత ఫాస్ట్ బౌలర్లకు పెద్దగా అనుకూలించడం లేదు. ఫాస్ట్ బౌలర్లు ఫెయిల్ అయినప్పుడు ఆపద్భాంధవుడిగా మారే రవిచంద్రన్ అశ్విన్ లేని లోటు అభిమానులకు మూడు టెస్టుల్లో కనిపిస్తున్నా, కోహ్లీ మాత్రం విన్నింగ్ కాంబినేషన్ అంటూ అతన్ని పక్కనబెడుతున్నాడని ట్రోల్స్ చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్...

click me!

Recommended Stories