ఇంగ్లాండ్ బ్యాటింగ్ ముగియగానే వాతావరణం కూడా... టీమిండియా బ్యాడ్‌లక్ మామూలుగా లేదుగా...

First Published Aug 27, 2021, 4:18 PM IST

ఇంగ్లాండ్ టూర్‌లో భారత జట్టుకి వాతావరణం నుంచి ఏ మాత్రం సహకారం లభించడం లేదు. ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచి ఇంగ్లాండ్ వెదర్, భారత్‌ను ఇబ్బందులు పెడుతూనే ఉంది. ప్రత్యర్థి బ్యాటింగ్ చేస్తున్నంతసేపు ఎంతో చక్కగా ఉంటున్న వాతావరణం, భారత బ్యాటింగ్ వచ్చేసరికి మబ్బులు కమ్మి, మసకబారుతోంది...

ఇంగ్లాండ్‌లో పిచ్‌లు, వాతావరణాన్ని బట్టి స్పందిస్తూ ఉంటుంది. వెలుతురు చక్కగా ఉండి, ఎండ కాచినప్పుడు బ్యాటింగ్ చేయడం చాలా తేలికవుతుంది... అలాగే బౌలింగ్ చేయడానికి ఇబ్బందులు పడాల్సి ఉంటుంది..

అదే మబ్బులు కమ్ముకుంటే, పిచ్ బౌలర్లకు చక్కగా సహకరిస్తుంది. బ్యాటింగ్ చేయడం ఇబ్బందిగా మారుతుంది. టీమిండియాను వెంటాడుతూ ఇబ్బంది పెడుతున్నది ఇదే...

ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసింది టీమిండియా. వర్షం కారణంగా తొలి రోజు పూర్తిగా రద్దు కాగా, రెండో రోజు వెలుతురు లేమి, ఆ తర్వాత వర్షం అడ్డంకిగా మారాయి...

న్యూజిలాండ్ బ్యాటింగ్ చేసిన సమయంలో వెదర్ వాళ్లకి అనుకూలంగా మారింది. ఫలితంగా తొలి ఇన్నింగ్స్‌లో కివీస్‌కి ఆధిక్యం దక్కింది... నాలుగో రోజు భారత బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కూడా ఇదే సీన్ రిపీట్ అయ్యింది...

నాటింగ్‌హమ్‌లో జరిగిన తొలి టెస్టును కూడా వరుణుడు చాలా ఇబ్బంది పెట్టాడు. అయితే ఎలాగోలా ప్రత్యర్థిపై పూర్తి డామినేషన్ చూపించి, విజయం అంచుల్లో నిలిచింది టీమిండియా...

ఐదో రోజు కేవలం 150+ పరుగుల లక్ష్యం ఉండడం, చేతిలో 9 వికెట్లు ఉండడంతో ఈజీగా టీమిండియా గెలిచేస్తుందని ఆశగా ఎదురుచూశారు అభిమానులు. అయితే వరుణుడి రాకతో ఆ రోజు ఒక్క బంతి వేయకుండానే ఆట రద్దు అయ్యింది.

తొలి టెస్టు గెలిచి, ఆతిథ్య జట్టుపై ఒత్తిడి పెంచాలనే టీమిండియా ఆశలు నెరవేరలేదు. అయితే రెండో టెస్టులో మాత్రం అన్యూహ్యంగా భారత జట్టుకి వాతావరణంతో పాటు అన్నీ కలిసొచ్చాయి...

లార్డ్స్ టెస్టులో గెలిచి, 1-0 వచ్చిన టీమిండియా... ఆ విజయాన్ని పూర్తిగా ఆస్వాదించేలోపు మూడో టెస్టులో ఘోర ఓటమి అంచున నిలిచింది... ఎప్పుడో లేనట్టుగా ఈ సారి వర్షం రావాలని టీమిండయా ఫ్యాన్స్ కోరుకున్నారు...

కుండపోత వర్షం కురిసి, ఒకటి రెండు రోజుల ఆట రద్దు అయితే మ్యాచ్ డ్రాగా ముగుస్తుందని భావించారు టీమిండియా ఫ్యాన్స్. అయితే ఈసారి కూడా నిరాశే ఎదురైంది...

ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేసిన సమయంలో ఎర్రటి ఎండ కాచి, బ్యాటింగ్‌కి చక్కగా అనుకూలించిన వాతావరణం... వాళ్ల ఇన్నింగ్స్ ముగియగానే మబ్బులు కమ్ముకుంది. ఇలాంటి వాతావరణం, బౌలర్లకు ఫెవరెట్...

వర్షం కురిసి ఆట ఆగిపోతే, టీమిండియాకి లాభమే తప్ప నష్టం ఉండదు.... కానీ ఇలా వర్షం కురవకుండా కేవలం తుంపరలు పడుతూ, చల్లని వాతావరణం ఉంటే మాత్రం అది టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో కూడా ఇబ్బందిపడక తప్పదు..

click me!