రోహిత్ లాంటి ప్లేయర్, ఇలా అవుట్ అవ్వడం... ప్చ్..! సునీల్ గవాస్కర్ ఫైర్...

First Published Jan 16, 2021, 1:17 PM IST

ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్టులో ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ... 74 బంతుల్లో 6 ఫోర్లతో 44 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ప్రస్తుత జట్టులో సీనియర్ మోస్ట్ ప్లేయర్ అయిన రోహిత్ శర్మ, నాథన్ లియాన్ బౌలింగ్‌లో చెత్త షాట్ ఆడి మిచెల్ స్టార్క్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. గబ్బా పిచ్‌పై రోహిత్ శర్మ రాణిస్తాడని ఊహించిన అభిమానులకు ఈ ఒక్క షాట్ సెలక్షన్‌తో ఊహించని షాక్ తగిలింది.

గబ్బా టెస్టులో రోహిత్ శర్మ అవుట్ అయిన విధానంపై సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురుస్తోంది. రోహిత్ శర్మ లాంటి సీనియర్ ప్లేయర్ ఇలా ఆడడం భావ్యం కాదని కామెంట్ చేస్తున్నారు మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు.
undefined
‘రోహిత్ శర్మను రోహిత్ శర్మలా ఇంకెవరూ అవుట్ చేయలేరు... కరెక్టుగా ఎప్పుడు అవుట్ కాకూడదదో అప్పుడే లూజ్ షాట్ ఆడి పెవిలియన్ చేరడం రోహిత్‌కి బాగా తెలుసు’ అంటూ ట్రోల్ చేస్తున్నారు అభిమానులు.
undefined
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి ఏ మాత్రం తక్కువ కాదని హిట్ మ్యాన్ ఫ్యాన్స్ తెగ వాదిస్తుంటారని, కానీ కీలక మ్యాచుల్లో వికెట్‌ను ఎలా కాపాడుకోవాలో విరాట్‌ను చూసి నేర్చుకోవాలని కామెంట్ చేస్తున్నారు కెప్టెన్ కోహ్లీ ఫ్యాన్స్...
undefined
‘ఇది అస్సలు ఊహించలేదు...రోహిత్ శర్మ ఏ మాత్రం బాధ్యత లేకుండా ఈ షాట్ ఆడాడు. అంతకుముందే ఓ బౌండరీ కొట్టావు, మళ్లీ ఏం చేద్దామని అలాంటి షాట్ ఆడావు...
undefined
నువ్వు ఓ సీనియర్ ప్లేయర్‌వి. ఇలా అనవసరంగా ప్రత్యర్థులను వికెట్‌ సమర్పించుకోవడం క్షమించరాని నేరం.. ఇలా ఆడాల్సిన అవసరమే లేదు...
undefined
ఇది టెస్టు మ్యాచ్. వన్డే, టీ20 మ్యాచ్ కాదు. వెంటవెంటనే బౌండరీలు కొట్టాలనే ఆత్్రం ఎందుకు. ప్రత్యర్థి 369 పరుగుల భారీ స్కోరు చేసినప్పుడు ఎలా ఆడాలి...
undefined
దక్కిన శుభారంభాన్ని సెంచరీలుగా మలుచుకుంటేనే ప్రత్యర్థికి ధీటుగా సమాధానం ఇవ్వగలమనే కనీస ఆలోచన కూడా లేకుండా రోహిత్ ఆ షాట్ ఆడాడు...’ అంటూ రోహిత్ షాట్ సెలక్షన్‌పై ఫైర్ అయ్యాడు మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్.
undefined
‘ఎంతో అనుభవం ఉన్న క్రికెటర్ అయిన రోహిత్ శర్మ, ఏ మాత్రం అనుభవం లేని యంగ్ ప్లేయర్‌లా ఈ షాట్ ఆడాడు... ఇది ఎంత వరకూ కరెక్ట్’ అంటూ కామెంట్ చేశాడు మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్.
undefined
గాయం నుంచి కోలుకుని ఆస్ట్రేలియాలో చివరి రెండు టెస్టులు ఆడేందుకు వచ్చిన రోహిత్ శర్మ, ఆ బాధ్యతతో బ్యాటింగ్ చేసి ఉంటే, గబ్బా టెస్టులో భారత జట్టు మంచి పొజిషన్‌లో ఉండేదని భావిస్తున్నారు టీమిండియా ఫ్యాన్స్.
undefined
click me!