బుమ్రాకి అది చాలా అవసరం... ఇంగ్లాండ్ సిరీస్‌కి దూరంగా పెట్టండి... గౌతమ్ గంభీర్ కామెంట్...

First Published Jan 16, 2021, 6:01 AM IST

బుమ్... బుమ్... బుమ్రా... భారత జట్టులో అత్యంత కీలకంగా మారిన స్టార్ బౌలర్. రవిచంద్రన్ అశ్విన్, ఇషాంత్ శర్మ లాంటి సీనియర్లు కేవలం టెస్టు సిరీస్‌లకి మాత్రమే పరిమితం కాగా జస్ప్రిత్ బుమ్రా మాత్రం టీ20, వన్డే, టెస్టు అనే తేడా లేకుండా అన్ని ఫార్మాట్లలోనూ బరిలో దిగుతున్నాడు. ఐపీఎల్ 2020 నుంచి మహా బిజీగా ఉన్న బుమ్రాకి వచ్చే ఇంగ్లాండ్ సిరీస్‌లో విశ్రాంతి ఇవ్వాలని సూచించాడు భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్.

ఐపీఎల్ 2020 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కి ఆడిన జస్ప్రిత్ బుమ్రా... 15 మ్యాచుల్లో 27 వికెట్లు పడగొట్టి టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు..
undefined
ఆ తర్వాత ఆస్ట్రేలియా టూర్‌లో టీ2, వన్డే జట్టులకు ప్రాతినిథ్యం వహించిన బుమ్రా... టెస్టు సిరీస్‌లో కూడా కీలక ప్లేయర్‌గా మారాడు.
undefined
మొదటి మూడు టెస్టుల్లో ఆడిన అతికొద్ది మంది భారత ప్లేయర్లలో బుమ్రా కూడా ఒకడు. విరామం లేకుండా ఇలా వరుస సిరీస్‌లు ఆడించడం సరికాదని అంటున్నాడు గంభీర్.
undefined
‘బుమ్రా భారత జట్టుకి దొరికిన ఓ అద్భుతమైన పేసర్. అతను ఇంకా కొన్నేళ్ల పాటు భారత జట్టుకి స్టార్ పేసర్‌గా కొనసాగుతాడు...
undefined
అతని బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత టీమిండియాకు ఉంది. ఇలా ఊపిరిపీల్చుకోనివ్వకుండా సిరీస్‌లు ఆడిస్తే... బుమ్రాపై ఒత్తిడి పెరుగుతుంది...
undefined
కాబట్టి వచ్చే ఇంగ్లాండ్ సిరీస్‌లు అతనికి కావాల్సినంత విశ్రాంతి ఇవ్వాలి. బుమ్రా ఇప్పటిదాకా స్వదేశంలో ఒక్క టెస్టు సిరీస్ కూడా ఆడలేదు.
undefined
విదేశీ పిచ్‌లపైన అద్భుతంగా రాణించిన బుమ్రాకి స్వదేశీ పిచ్‌లపై రాణించడం పెద్ద కష్టమేమీ కాదు... కానీ వర్క్ లోడ్ తగ్గించడం చాలా ముఖ్యం...
undefined
కాబట్టి అతనికి కావాల్సినంత విశ్రాంతిని ఇచ్చేందుకు భారత జట్టు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి...’ అంటూ వ్యాఖ్యానించాడు గౌతమ్ గంభీర్.
undefined
అయితే ఆసీస్ టూర్‌లో భారత సీనియర్ పేసర్లు ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీలు గాయపడ్డారు. ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్ గాయం నుంచి కోలుకుని సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీ ఆడుతున్నారు.
undefined
ఈ ఇద్దరూ ఇంగ్లాండ్‌తో స్వదేశంలో జరిగే నాలుగు టెస్టుల సిరీస్‌కి ఎంపికయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. మొదటి రెండు టెస్టులకి బుమ్రాకి విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది.
undefined
ఫిబ్రవరి 5 నుంచి మొదలయ్యే ఇంగ్లాండ్ సిరీస్‌లో భారత జట్టు నాలుగు టెస్టులు, 5 టీ20 మ్యాచులతో పాటు 3 వన్డేలు కూడా ఆడబోతోంది...
undefined
click me!