ఎలా పట్టుకొచ్చాడో తెలీదు, డ్రై ప్లేస్‌లో షాంపైన్ తీసుకొచ్చాడు... కపిల్‌దేవ్‌పై గవాస్కర్..

Published : Jun 06, 2022, 05:54 PM IST

భారత క్రికెట్ గతిని మార్చిన కెప్టెన్ కపిల్ దేవ్. అండర్‌ డాగ్స్‌గా 1983 వరల్డ్ కప్‌ టోర్నీలో కపిల్ దేవ్ కెప్టెన్సీలో అడుగుపెట్టిన భారత జట్టు, వెస్టిండీస్‌ని ఓడించి టైటిల్ కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. సునీల్ గవాస్కర్ నుంచి కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న కపిల్ దేవ్, సరికొత్త చరిత్రని ఆద్యం పోశాడు...

PREV
17
ఎలా పట్టుకొచ్చాడో తెలీదు, డ్రై ప్లేస్‌లో షాంపైన్ తీసుకొచ్చాడు... కపిల్‌దేవ్‌పై గవాస్కర్..

టెస్టు ఫార్మాట్‌లో 10 వేల పరుగులు చేసిన మొట్టమొదటి క్రికెటర్‌గా, 34 సెంచరీలు చేసిన బ్యాటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు సునీల్ గవాస్కర్. 125 టెస్టుల్లో 34 సెంచరీలతో 10,122 టెస్టు పరుగులు చేశాడు సునీల్ గవాస్కర్...

27

1987లో పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో 58 పరుగుల వద్ద టెస్టుల్లో 10 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు సునీల్ గవాస్కర్. అహ్మదాబాద్‌లో జరిగిన ఈ టెస్టు మ్యాచ్‌ని మరోసారి గుర్తు చేసుకున్నాడు ‘లిటిల్ మాస్టర్’... 

37

‘ఆ టెస్టు మ్యాచ్‌లో నేను 57 పరుగులు చేస్తే 10 వేల టెస్టు పరుగులు అందుకుంటానని తెలుసు. ఎప్పటిలాగే స్కోరు బోర్డును చూడకుండా బ్యాటింగ్ చేస్తున్నా. అయితే 50 దాటగానే స్టేడియంలో జనాలు చప్పట్లతో అభినందిస్తారు...
 

47

సింగిల్‌తో 50 పరుగులు పూర్తి చేశాను. అప్పటికి 10 వేల పరుగులు పూర్తి కావాలంటే ఇంకో 7 పరుగులు కావాలి. మొట్టమొదటి బ్యాటర్‌గా ఈ ఫీట్ సాధించడమంటే చాలా చాలా ప్రత్యేకం... 

57

అంతకుముందు ఏ బ్యాటర్ కూడా 9 వేల పరుగులు కూడా చేయలేకపోయారు. అందుకే నాకు నేను మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిన బ్యాటర్‌గా కనిపించేవాడిని. నేను 57 పరుగులు పూర్తి చేయగానే అహ్మదాబాద్ స్టేడియంలో జనాలందరూ లేచి చప్పట్లతో అభినందించారు...

67

అప్పుడు అహ్మదాబాద్ డ్రై ప్లేస్. మందు దొరికేది కాదు. అయితే కపిల్ మాత్రం ఎక్కడి నుంచి తెచ్చాడో ఓ షాంపైన్ బాటిల్ తీసుకొచ్చాడు. అది చాలా పెద్ద విశేషమే. 

77

అప్పుడు అతనే కెప్టెన్. నా కోసం ప్రత్యేకంగా పర్మిషన్ తీసుకుని ఎక్కడి నుంచి దాన్ని తెప్పించాడు...’ అంటూ ఆనాటి మధుర క్షణాలను గుర్తు చేసుకున్నాడు భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్...

click me!

Recommended Stories