అప్పుడు అందర్నీ ఓ ఆటాడుకున్నా, ఇప్పుడేమో బ్యాటుకి తగలితే చాలు... విరాట్ కోహ్లీ ఫామ్‌పై...

Published : Jun 06, 2022, 05:19 PM IST

విరాట్ కోహ్లీ... క్రికెట్ ప్రపంచంలో ఓ అసాధారణ ప్లేయర్. సరదాకి సెంచరీలు చేస్తూ, క్రికెట్ ప్రపంచాన్ని విస్తుపోయేలా చేసిన విరాట్ కోహ్లీ ఇప్పుడు మూడంకెల మార్కును అందుకోవడానికి రెండున్నరేళ్లుగా ఆపసోపాలు పడుతున్నాడు... విరాట్ కోహ్లీ ఫామ్‌పై కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు భారత మాజీ పేసర్ ఆర్‌పీ సింగ్...

PREV
18
అప్పుడు అందర్నీ ఓ ఆటాడుకున్నా, ఇప్పుడేమో బ్యాటుకి తగలితే చాలు... విరాట్ కోహ్లీ ఫామ్‌పై...

ఐపీఎల్ 2022 సీజన్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆడిన విధానం... టీమిండియా ఫ్యాన్స్‌ని తీవ్రంగా కలవరబెడుతోంది. ఇద్దరూ కూడా ఫామ్‌ కోల్పోయి పరుగులు చేయడానికి చాలా ఇబ్బంది పడ్డారు...

28
Image credit: PTI

విరాట్ కోహ్లీ సీజన్‌లో రెండు హాఫ్ సెంచరీలు చేసినా... 16 మ్యాచుల్లో ఒకటి రెండు ఇన్నింగ్స్‌లు తప్ప మిగిలిన మ్యాచుల్లో ఏ మాత్రం ఇంప్రెస్ చేయలేకపోయాడు. రెండు సార్లు రనౌట్ అయ్యి, మరో రెండు సార్లు గోల్డెన్ డకౌట్ అయ్యాడు...

38
Image credit: PTI

‘విరాట్ కోహ్లీకి బ్యాడ్ టైమ్ నడుస్తోంది. ఎందుకంటే అతను అవుట్ అవుతున్న విధానం చూస్తుంటే చాలా తేడాగా ఉంటోంది. విరాట్‌ని మనం ఎప్పుడూ ఇలా చూడలేదు...

48
virat kohli

విరాట్ కోహ్లీ కెరీర్‌లో ఇదో సుదీర్ఘమైన బ్యాడ్ ఫేజ్.. ఎందుకంటే ఫామ్ కోల్పోయినా ఇన్నాళ్ల పాటు సెంచరీ లేకుండా ఎప్పుడూ ఉండలేదు విరాట్ కోహ్లీ.. ఇప్పుడు విరాట్ కోహ్లీ ఈ పొజిషన్ నుంచి బయటికి వచ్చి సుదీర్ఘ కెరీర్ కొనసాగించడమంటే మామూలు విషయం కాదు...

58

టెస్టుల్లో, వన్డేల్లో కావాల్సినన్ని బాల్స్ ఆడి ఫామ్‌ అందుకునే ప్రయత్నం చేయొచ్చు. అయితే టీ20ల్లో అలాంటి సౌకర్యం ఉండదు. మొదటి 50-55 బంతులాడి 60 పరుగులు చేస్తే టీమ్‌కి ఎలాంటి ఉపయోగం ఉండదు...

68

అదే 55 బంతుల్లో సెంచరీ వస్తేనే అతను విరాట్ కోహ్లీ అవుతాడు. ఇన్నాళ్లూ అతను క్రికెట్ ప్రపంచాన్ని శాసించాడు. అప్పుడు ఎలా ఆడినా ఫోర్ వెళ్లేది. ఫీల్డర్లు ఎక్కడెక్కడున్నారో పక్కగా తెలిసినట్టు షాట్స్ ఆడేవాడు...

78

ఇప్పుడు సీన్ మారింది. ఒకప్పుడు బౌలర్లకు చుక్కులు చూపించిన తాను... ఇప్పుడు ఏం ఆడినా, ఎలాంటి షాట్ ఆడినా బాల్ నేరుగా ఫీల్డర్ చేతుల్లోకి వెళ్తోందని... ఎన్ని రకాలుగా ప్రయత్నించి అవుటైపోతున్నానని విరాట్ కోహ్లీ ఫీల్ అవుతూ ఉండొచ్చు... 

88

ఫామ్‌లోకి రావాలంటే ఎక్కువ బంతులు ఆడాలి, ఎక్కువ సేపు క్రీజులో ఉండాలి. అదే సరైన విధానం. అయితే టీ20ల్లో దీన్ని ఫాలో అయితే సీన్ రివర్స్ అవుతుంది... ఈ విషయం విరాట్‌కి అర్థమై ఉండొచ్చు...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ ఆర్పీ సింగ్...

Read more Photos on
click me!

Recommended Stories