మా ఆయన ఫస్ట్ లవ్ అదే.. అందుకే ఎప్పుడూ అలా ఉంటాడు: ధనశ్రీ వర్మ షాకింగ్ కామెంట్స్

Published : Jun 06, 2022, 04:47 PM IST

Yuzvendra Chahal - Dhanashree Verma: టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఇటీవల ముగిసిన ఐపీఎల్ సీజన్ లో రాజస్తాన్ రాయల్స్ తరఫున అదరగొట్టిన విషయం తెలిసిందే. ఈ సీజన్ లో  అతడు   పర్పుల్ క్యాప్ కూడా దక్కించుకున్నాడు.

PREV
18
మా ఆయన ఫస్ట్ లవ్ అదే.. అందుకే ఎప్పుడూ అలా ఉంటాడు: ధనశ్రీ వర్మ షాకింగ్ కామెంట్స్

ఏడాదిన్నర క్రితం వివాహ బంధంతో ఒక్కటయ్యారు యుజ్వేంద్ర చాహల్-ధనశ్రీ వర్మ.  ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. ఎప్పుడూ అందర్నీ నవ్విస్తూ నవ్వుతూ సంతోషంగా ఉంటారు. అయితే తాజాగా ధనశ్రీ.. చాహల్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. 
 

28

యుజీకి ఫస్ట్ లవ్ క్రికెటే అని.. అందుకే అతడు ఎప్పుడూ తన హ్యాపీగా ఉంటాడని చెప్పుకొచ్చింది. రాజస్తాన్ రాయల్స్ పోడ్కాస్ట్ లో  ధనశ్రీ ఈ కామెంట్స్ చేసింది. 

38

ధనశ్రీ మాట్లాడుతూ... ‘యుజీ ఎప్పటికీ హ్యాపీ పర్సన్. నిజం చెప్పాలంటే అతడికి క్రికెట్ అంటే చాలా ఇష్టం.  క్రికెట్ ను పిచ్చిపిచ్చిగా ప్రేమిస్తాడు. అతడి ఫస్ట్ లవ్ క్రికెట్. 

48

అందుకే అతడు ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు. చాహల్ ఎక్కడుంటే అక్కడ నవ్వులే. తన తోటి వాళ్లతో కూడా చాహల్ ఎంతో ఫ్రెండ్లీగా ఉంటాడు. మాములుగా డ్రెస్సింగ్ రూమ్ లలో ఎన్విరాన్మెంట్ చాలా గంభీరంగా ఉంటుంది.  చాలా మంది ఒత్తిడికి కూడా గురవుతారు. 

58

కానీ  యుజీ మాత్రం ఎప్పటికీ తన ముఖంపై చిరునవ్వు చెదరనివ్వడు. యుజీ.. యుజీలాగే ఉంటాడు..’ అని చెప్పుకొచ్చింది. అయితే తాను మాత్రం అందుకు విరుద్ధంగా ఉంటానని.. తాను భావాలను కంట్రోల్ చేసుకోలేనని, అందుకే మ్యాచులు చూసేప్పుడు  బిగ్గరగా అరవడం.. ఓవర్ గా ఎక్స్ర్పెస్ అవడం వంటివి చేస్తుంటానని తెలిపింది.

68

‘ఐపీఎల్ మ్యాచులు చూసేవారందరికీ తెలుసు నేను కాస్త ఓవర్ ఎక్స్ప్రెసివ్ అని.. అవును. నేను ఆ రకమే.  ఐపీఎల్ అయినా, టెస్టు, వన్డే అయినా మ్యాచులు చూడటానికి వచ్చే ప్రేక్షకులు కచ్చితంగా ఒత్తిడికి గురవుతారు. 

78

ఎందుకంటే వాళ్లు ఒక జట్టుకు మద్దతుగా నిలవాలి. మీ జట్టు భాగా ఆడాలని మీరు కోరుకుంటారు. నేనూ అదే చేస్తాను. వికెట్ తీసినా, సిక్సర్ కొట్టినా.. నేను ఓవర్ గానే రియాక్ట్ అవుతుంటా...’ అని తెలిపింది. 
 

88

ఐపీఎల్-15లో రాజస్తాన్ రాయల్స్ తరఫున ఆడిన చాహల్.. ఈ సీజన్ లో 17 మ్యాచుల్లో 27 వికెట్లు తీశాడు. లీగ్ మ్యాచుల సందర్భంగా కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో హ్యాట్రిక్ తో పాటు ఐదు వికెట్ల ప్రదర్శన కూడా చేశాడు. 

click me!

Recommended Stories