అంపైర్‌కి రిషబ్ పంత్ బ్యాటింగ్ పొజిషన్ మర్చాల్సిన అవసరం ఏముంది... సునీల్ గవాస్కర్ ఫైర్...

First Published Aug 28, 2021, 3:55 PM IST

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో 2 పరుగులకే అవుటైన తర్వాత రిషబ్ పంత్ చేసిన కామెంట్లు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. అంపైర్, తన బ్యాటింగ్ పొజిషన్‌ను మార్చడం వల్లే త్వరగా అవుట్ అయ్యానని రిషబ్ పంత్ కామెంట్లపై స్పందించాడు భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్...

టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 78 పరుగులకే ఆలౌట్ కావడం, ఇంగ్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేయడంతో ఆతిథ్య జట్టుకి మూడో టెస్టుపై పట్టు సాధించే అవకాశం దక్కింది... 

ఫామ్‌లో లేని విరాట్ కోహ్లీ, అజింకా రహానే, ఛతేశ్వర్ పూజారాలపై పెద్దగా అంచనాలు లేకపోయినా మంచి ఫామ్‌లో ఉన్న రిషబ్ పంత్ కాసేపైనా మెరుపులు మెరిపిస్తాడని భావించారు క్రికెట్ ఫ్యాన్స్...

అయితే 9 బంతుల్లో 2 పరుగులు చేసిన రిషబ్ పంత్ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు. దీనిపై స్పందించిన రిషబ్ పంత్... ‘నేను క్రీజు బయట నిలబడి బ్యాటింగ్ చేస్తున్నా, అయితే నా కాలు, డేంజర్ ఏరియాలోకి వచ్చందని చెప్పి, అంపైర్ అభ్యంతరం తెలిపాడు...

అందుకే నేను బ్యాటింగ్ పొజిషన్‌ను మార్చుకుని, చేయాల్సి వచ్చింది... ఆ తర్వాతి బంికే ఫ్రీగా బ్యాటింగ్ చేయలేక అవుట్ అయ్యాను...’ అంటూ కామెంట్ చేశాడు.

‘అంపైర్, రిషబ్ పంత్‌తో అలా చెప్పాడంటే నమ్మలేకపోతున్నా. అదే నిజమేనా, లేక ఎవరైనా కల్పించి రాశారా... బ్యాట్స్‌మెన్‌కి క్రీజులో ఎక్కడైనా నిలబడే స్వాతంత్ర్యం ఉంటుంది. 

కావాలంటే పిచ్ మధ్యలో కూడా బ్యాటింగ్ చేయవచ్చు. స్పిన్ బౌలింగ్‌లో క్రీజు ముందుకొచ్చి, బ్యాటింగ్ చేయడానికి ఇష్టపడతారు బ్యాట్స్‌మెన్...

అంపైర్ అలా చెప్పడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. అది ఏ క్రికెట్ రూల్‌కి కిందకి వస్తుంది...డీఆర్‌ఎస్ రివ్యూలు వచ్చిన తర్వాత కూడా పక్షపాతం లేకుండా నిర్ణయాలు చెప్పే అంపైర్‌లు కావాలి...

ఎందుకంటే అలా బ్యాట్స్‌మెన్‌ను స్వేచ్ఛగా ఆడనివ్వకుండా ఇబ్బంది పెడితే, మ్యాచ్ రిజల్ట్‌పైన ప్రభావం పడుతుంది... ఇది కచ్ఛితంగా ఛీటింగ్‌తో సమానమే’ అంటూ కామెంట్లు చేశాడు మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్...

click me!