డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లో అతడే కీలకం.. టీమిండియాకు అతడి పాఠాలు అవసరం : గవాస్కర్

Published : Jun 01, 2023, 12:31 PM IST

WTC Finals 2023: ఈనెల 7 నుచి 11 దాకా ఇంగ్లాండ్ లోని ది ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగబోయే  వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్  ఫైనల్ లో రోహిత్ సేన తలపడనుంది. ఈ మేరకు  భారత జట్టు  ఇప్పటికే లండన్‌కు చేరకుని అక్కడ  ప్రాక్టీస్  కూడా మొదలుపెట్టింది. 

PREV
16
డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లో అతడే కీలకం.. టీమిండియాకు అతడి పాఠాలు  అవసరం : గవాస్కర్

ఐపీఎల్ - 16 ముగిసిన నేపథ్యంలో భారత క్రికెటర్లు ఇప్పుడు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ వేటలో పడ్డారు.   ఈనెల 7 నుంచి  ఇంగ్లాండ్  లోని ప్రముఖ ది ఓవల్ గ్రౌండ్ లో  భారత్ -ఆస్ట్రేలియా మధ్య  ‘వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్’ ఫైనల్ జరుగనుంది. 

26

రెండు నెలల పాటు ఐపీఎల్ లో బిజీబిజీగా గడిపిన భారత క్రికెటర్లు ఇప్పుడు   మరో  కీలక ట్రోఫీకోసం వేట మొదలుపెట్టారు. ఈనెల 7 నుచి 11 దాకా ఇంగ్లాండ్ లోని ది ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగబోయే  వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్  ఫైనల్ లో రోహిత్ సేన తలపడనుంది. ఈ మేరకు  భారత జట్టు  ఇప్పటికే లండన్‌కు చేరకుని అక్కడ  ప్రాక్టీస్  కూడా మొదలుపెట్టింది. 

36

డబ్ల్యూటీసీ ఫైనల్స్ నేపథ్యంలో   టీమిండియాకు టాపార్డర్ బ్యాటర్ ఛటేశ్వర్ పుజారా కీలకంగా మారుతాడని  దిగ్గజ ఆటగాడు  సునీల్ గవాస్కర్  తెలిపాడు. గత కొంతకాలంగ యూకేలోనే కౌంటీ ఛాంపియన్‌షిప్ ఆడుతున్న పుజారాకు ఇక్కడి పరిస్థితులపై పూర్తి అవగాహన ఉందని గవాస్కర్ తెలిపాడు. 

46

గవాస్కర్  మాట్లాడుతూ... ‘పుజారా గడిచిన రెండు నెలలుగా అక్కడే (ఇంగ్లాండ్ లో) ఉంటున్నాడు.  కౌంటీ ఛాంపియన్‌‌షిప్ లో సెంచరీల మీద సెంచరీలు బాదుతున్నాడు.  డబ్ల్యూటీసీ ఫైనల్స్ లో భాగంగా ది ఓవల్ లో అతడు ఆడకపోయి ఉండొచ్చు గానీ  పుజారా ప్రాతినిథ్యం వహించే సస్సెక్స్ టీమ్ ఆడే మ్యాచ్ లు  ఇక్కడికి దగ్గరగానే జరిగాయి.   ఇక్కడి పరిస్థితులపై పుజారాకు అవగాహన ఉంటుంది. 

56

ఈ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు  తన తోటి బ్యాటర్లకు అతడు చెప్పే పాఠాలు ఎంతో విలువైనవి. ఈ సీజన్ లో పుజారా  సస్సెక్స్ లో ఆసీస్ ఆటగాడు స్టీవ్ స్మిత్  తో కూడా కలిసి ఆడాడు. అతడిని ఔట్ చేసేందుకు  వ్యూహాలు రూపొందించడంలో  పుజారా కీలకం..’అని తెలిపాడు. 

66

కాగా  నెల రోజుల క్రితమే మొదలైన కౌంటీ ఛాంపియన్‌షిప్ లో సస్సెక్స్ తరఫున ఆడుతున్న పుజారా  ఐదు మ్యాచ్ లు ఆడి మూడు సెంచరీలు చేశాడు. గతంలో ఇంగ్లాండ్ పర్యటనలకు వచ్చినప్పుడు కూడా పుజారా ఓవల్ లో ఆడాడు.  తాజాగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో కూడా అతడు భారత  జట్టుకు కీలకం అవుతాడని   గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. 

click me!

Recommended Stories