INDvsENG: ముగిసిన తొలి రోజు ఆట... 300 దాటిన టీమిండియా స్కోరు, క్రీజులో రిషబ్ పంత్...

Published : Feb 13, 2021, 05:12 PM IST

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు 6 వికెట్లు కోల్పోయి 300 పరుగులు చేసింది. యంగ్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ 56 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 33 పరుగులు చేయగా మొట్టమొదటి టెస్టు ఆడుతున్న అక్షర్ పటేల్ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు. రోహిత్ శర్మ అద్భుతమైన 161 పరుగులు, రహానే క్లాస్ హాఫ్ సెంచరీ కారణంగా 6 వికెట్లు కోల్పోయినా రెండో టెస్టు మొదటి రోజు మంచి ఆధిక్యం కనబర్చింది టీమిండియా. 

PREV
110
INDvsENG: ముగిసిన తొలి రోజు ఆట... 300 దాటిన టీమిండియా స్కోరు, క్రీజులో రిషబ్ పంత్...

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు రెండో ఓవర్‌లోనే షాక్ తగిలింది. యంగ్ బ్యాట్స్‌మెన్ శుబ్‌మన్ గిల్, పరుగులేమీ చేయకుండానే స్టోన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. సున్నాకే తొలి వికెట్ కోల్పోయింది టీమిండియా...

210

రోహిత్ శర్మ, ఛతేశ్వర్ పూజారా కలిసి రెండో వికెట్‌కి 85 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 58 బంతుల్లో 2 ఫోర్లతో 21 పరుగులు చేసిన ఛతేశ్వర్ పూజారాని జాక్ లీచ్ అవుట్ చేశాడు. లీచ్ బౌలింగ్‌లో బెన్ స్టోక్స్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు పూజారా. 85 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది టీమిండియా.

310

ఆ తర్వాత భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, మొయిన్ ఆలీ వేసిన ఓ అద్భుతమైన బంతికి డకౌట్ అయ్యాడు. 150వ టెస్టు ఇన్నింగ్స్ ఆడుతున్న విరాట్ కోహ్లీ, 11వ డకౌట్ కాగా... స్పిన్ బౌలింగ్‌లో డకౌట్ కావడం ఇదే తొలిసారి. టీమిండియా తరుపున అత్యధిక సార్లు డకౌట్ అయిన కెప్టెన్‌గా ధోనీ రికార్డును సమం చేశాడు కోహ్లీ. 

410

86 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియాను అజింకా రహానే, రోహిత్ శర్మ కలిసి ఆదుకున్నారు. రోహిత్ శర్మ తనదైన స్టైల్‌లో దూకుడు ప్రదర్శించగా, అజింకా రహానే క్లాస్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు...

510

231 బంతుల్లో 18 ఫోర్లు, 2 సిక్సర్లతో 161 పరుగులు చేశాడు రోహిత్ శర్మ. టెస్టుల్లో ఏడో సెంచరీ, నాలుగోసారి 150 పరుగులను దాటిన రోహిత్ శర్మ,... అజింకా రహానేతో కలిసి 162 పరుగుల అమూల్యమైన భాగస్వామ్యం నెలకొల్పి అవుట్ అయ్యాడు.

610

రోహిత్ శర్మ అవుటైన కొద్దిసేపటికే అజింకా రహానే కూడా పెవిలియన్ చేరాడు. థర్డ్ అంపైర్ మిస్టక్ కారణంగా అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న రహానే, ఆ తర్వాతి ఓవర్‌లోనే మొయిన్ ఆలీ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 

710

149 బంతుల్లో 9 ఫోర్లతో 67 పరుగులు చేసిన అజింకా రహానేని మొయిన్ ఆలీ అవుట్ చేశాడు. టెస్టు ఛాంపియన్‌షిప్‌లో 1000 పరుగులు పూర్తి చేసుకున్న రహానే, టెస్టుల్లో 23వ హాఫ్ సెంచరీ నమోదుచేశాడు...

810

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు ఆరో వికెట్ కోల్పోయింది. 19 బంతుల్లో ఓ ఫోర్‌తో 13 పరుగులు చేసిన రవిచంద్రన్ అశ్విన్‌ను జో రూట్ అవుట్ చేశాడు. రూట్ బౌలింగ్‌లో షాట్ ఆడబోయిన అశ్విన్, ఓల్లీ పోప్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 284 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది టీమిండియా...

910

అంతకుముందు ఓవర్‌లో రిషబ్ పంత్ అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. మొయిన్ ఆలీ బౌలింగ్‌లో రిషబ్ పంత్ అవుట్ అయినట్టు అంపైర్ ప్రకటించాడు. అయితే వెంటనే రివ్యూ తీసుకున్న రిషబ్ పంత్, బతికిపోయాడు. రిప్లైలో రిషబ్ పంత్ బ్యాటుకి బంతి తగలడం లేదని స్పష్టంగా కనిపించింది. 

1010

ఇంగ్లాండ్ బౌలర్లలో మొయిన్ ఆలీకి రెండు వికెట్లు దక్కగా జాక్ లీచ్ రెండు... జో రూట్, స్టోన్ చెరో వికెట్ తీశారు. 

click me!

Recommended Stories