INDvsENG: 150 దాటిన రోహిత్ శర్మ... అజింకా రహానే హాఫ్ సెంచరీ...

First Published Feb 13, 2021, 3:40 PM IST

మొదటి టెస్టులో ఘోరంగా విఫలమైన భారత వైస్ కెప్టెన్ అజింకా రహానే, రెండో టెస్టులో అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చాడు. 104 బంతుల్లో 8 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు అజింకా రహానే.  మరోవైపు భారత ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ 150+ స్కోరు దాటాడు.  టెస్టుల్లో 150 పరుగులు చేయడం రోహిత్ శర్మకు ఇది నాలుగోసారి. టెస్టుల్లో మొదటి 60 ఇన్నింగ్స్‌ల్లో అత్యధిక సార్లు 150+ స్కోరు చేసిన బ్యాట్స్‌మెన్‌గా పూజారా, గంభీర్ రికార్డులను సమం చేశాడు రోహిత్ శర్మ. 

రహానేకి ఇది టెస్టుల్లో 23వ హాఫ్ సెంచరీ. ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన భారత ప్లేయర్‌గా ఛతేశ్వర్ పూజారాతో కలిసి సమానంగా 9 హాఫ్ సెంచరీలు చేశాడు రహానే.
undefined
తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఒక్క పరుగుకే పెవిలియన్ చేరిన రహానే, రెండో ఇన్నింగ్స్‌లో డకౌట్ అయ్యాడు. దీంతో ఫామ్ కోల్పోయి పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్న రహానేని జట్టు నుంచి తప్పించాలని విమర్శలు వినిపించాయి...
undefined
అజింకా రహానే స్థానంలో కెఎల్ రాహుల్ లేదా హార్ధిక్ పాండ్యాలను ఆడించాలని డిమాండ్లు వినిపించాయి. అయితే ఈ విమర్శలకు తన బ్యాటుతోనే సమాధానం చెప్పాడు అజింకా రహానే. జట్టుకి అత్యంత ఆవశ్యకమైన సమయంలో రోహిత్‌తో కలిసి ఇన్నింగ్స్ నిర్మిస్తున్నాడు.
undefined
రహానేపై వచ్చిన విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు భారత సారథి విరాట్ కోహ్లీ... ‘రహానే చాలా మంచి బ్యాట్స్‌మెన్. అతను సామర్థ్యంపైన మాకు నమ్మకం ఉంది. జట్టుకి అవసరమైన సమయంలో మెల్‌బోర్న్‌లో చేసిన సెంచరీ ఎవ్వరూ మరిచిపోలేరు. అతను జట్టుతో కొనసాగుతాడు...’ అంటూ వైస్ కెప్టెన్‌కి అండగా నిలిచాడు.
undefined
రెండో టెస్టు ఆరంభానికి ముందు కూడా తాను బ్యాటింగ్‌లో మరింత ఘోరంగా ఫెయిల్ అవ్వడం లేదని చెప్పిన అజింకా రహానే, గత 10 ఇన్నింగ్స్‌లు చూస్తే తాను బ్యాటింగ్‌లో చేసిన పరుగులు చూడొచ్చని చెప్పాడు. చెప్పి మరీ మంచి ఇన్నింగ్స్‌తో కమ్‌బ్యాక్ ఇచ్చాడు రహానే...
undefined
రోహిత్ శర్మతో కలిసి నాలుగో వికెట్‌కి అజేయంగా 145 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు అజింకా రహానే. ఇంగ్లాండ్ జట్టు బౌలింగ్ చేసిన మొదటి 69 ఓవర్లలో ఒక్క ఎక్స్‌ట్రా కూడా ఇవ్వకపోవడం విశేషం.
undefined
ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో 1000 పరుగులు పూర్తి చేసుకున్న మొట్టమొదటి భారత క్రికెటర్, ఆసియా క్రికెటర్‌గా నిలిచాడు అజింకా రహానే. మయాంక్ అగర్వాల్, రోహిత్ శర్మ, ఛతేశ్వర్ పూజారా... రహానే తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
undefined
ఓపెనర్‌గా అన్ని ఫార్మాట్లలో కలిపి 11 సార్లు 150+ అధిగమించాడు రోహిత్ శర్మ. వీరేంద్ర సెహ్వాగ్ 16, క్రిస్ గేల్ 12 సార్లు మాత్రమే రోహిత్ శర్మ కంటే ముందున్నారు...
undefined
click me!