INDvsENG: రోహిత్ శర్మ, అజింకా రహానే అవుట్... ఐదు వికెట్లు కోల్పోయిన టీమిండియా...

Published : Feb 13, 2021, 04:18 PM IST

161 పరుగులు చేసి అవుటైన రోహిత్ శర్మ... 162 పరుగుల నాలుగో వికెట్ భాగస్వామ్యానికి తెర... వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా...

PREV
15
INDvsENG: రోహిత్ శర్మ, అజింకా రహానే అవుట్... ఐదు వికెట్లు కోల్పోయిన టీమిండియా...

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు నాలుగో వికెట్ కోల్పోయింది. ఓపెనర్‌గా వచ్చిన రోహిత్ శర్మ  231 బంతుల్లో18 ఫోర్లు, 2 సిక్సర్లతో 161 పరుగులు చేసి... జాక్ లీచ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి మొయిన్ ఆలీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

25

86 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో అజింకా రహానేతో కలిసి 310 బంతుల్లో 162 పరుగుల అమూల్యమైన భాగస్వామ్యం నెలకొల్పాడు రోహిత్ శర్మ. 248 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది టీమిండియా. 

35

రోహిత్ శర్మ అవుటైన తర్వాత కొద్దిసేపటికే అజింకా రహానే కూడా పెవిలియన్ చేరాడు. 149 బంతుల్లో 9 ఫోర్లతో 67 పరుగులు చేసిన రహానేని, మొయిన్ ఆలీ బౌల్డ్ చేశాడు. 249 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది టీమిండియా.

45

అజింకా రహానే అవుట్ అవ్వడానికి రెండు బంతుల ముందు అతని అవుట్ కోసం ఇంగ్లాండ్ అప్పీల్ చేసింది. రిప్లైలో రహానే బ్యాటుకి బంతి తగలనట్టు స్పష్టంగా కనిపించడంతో నాటౌట్‌గా ప్రకటించారు. అయితే ప్యాడ్‌కి తగిలిన తర్వాత గాల్లోకి ఎగురుతూ రహానే గ్లవ్స్‌కి బంతి తగిలినట్టు టీవీ రిప్లైలో కనిపించింది. 

55

దీంతో డీఆర్‌ఎస్ నిర్ణయంపై ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అయితే అది జరిగిన మూడో బంతికే మొయిన్ ఆలీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు అజింకా రహానే. అయితే జో రూట్ డీఆర్‌ఎస్ రివ్యూపై అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఇంగ్లాండ్ కోల్పోయిన రివ్యూని తిరిగి ఇస్తున్నట్టు ప్రకటించారు అంపైర్.

click me!

Recommended Stories