ఇదెక్కడి మాస్‌ రా మామ! ఆస్ట్రేలియా అలా గెలిచిందంటే ఈసారి వరల్డ్ కప్ మనదేనా...

Published : Jun 22, 2023, 05:47 PM IST

క్రికెట్‌లో సెంటిమెంట్స్ ఎక్కువే. అందులోనూ భారతీయులకు ఈ సెంటిమెంట్స్ మరీ ఎక్కువ. ఎన్ని సార్లు సెంటిమెంట్స్ వర్కవుట్ కాకపోయినా మళ్లీ మళ్లీ వాటిని పట్టుకుని, ఆశలు పెంచుకోవడం టీమిండియా ఫ్యాన్స్‌కి బాగా అలవాటు...  

PREV
16
ఇదెక్కడి మాస్‌ రా మామ! ఆస్ట్రేలియా అలా గెలిచిందంటే ఈసారి వరల్డ్ కప్ మనదేనా...

2011 వన్డే వరల్డ్ కప్ తర్వాత 12 ఏళ్ల మళ్లీ వన్డే వరల్డ్ కప్‌ టోర్నీకి ఆతిథ్యం ఇస్తోంది భారత జట్టు. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఐసీసీ టైటిల్ గెలవలేకపోయిన టీమిండియా, దీనిపైనే ఆశలన్నీ పెట్టుకుంది..

26

అయితే ఓ సెంటిమెంట్ ప్రకారం ఈ సారి వరల్డ్ కప్‌ మనదేనని అంటున్నారు కొందరు క్రికెట్ ఫ్యాన్స్. అయితే ఇండియాకి ఏ మాత్రం సంబంధం లేని ఆస్ట్రేలియా టెస్టు విజయాన్ని, మన వరల్డ్ కప్‌ కలతో పోలుస్తుండడం ఇక్కడ విశేషం..

36

2011లో జోహన్‌బర్గ్‌లో జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో ఉస్మాన్ ఖవాజా 65 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు...

46
Pat Cummins

ప్యాట్ కమ్మిన్స్ ఫోర్ బాది ఆస్ట్రేలియాకి విజయాన్ని అందించాడు. 12 ఏళ్ల తర్వాత ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా సరిగ్గా 2 వికెట్ల తేడాతో విజయం అందుకుంది. ఉస్మాన్ ఖవాజా 65 పరుగులు చేయగా, ప్యాట్ కమ్మిన్స్ ఫోర్ బాది విజయాన్ని అందించాడు..

56

అప్పుడు ఆస్ట్రేలియా టెస్టు గెలిచిన విధానం, ఇప్పుడు గెలిచిన విధానంలో ఒకటికి మూడు పోలికలు ఉండడంతో 2011 వన్డే వరల్డ్ కప్ టోర్నీని గెలుచుకున్న భారత జట్టు, 2023 వన్డే వరల్డ్ కప్ విజేతగా నిలుస్తుందని ఏ మాత్రం సంబంధం లేని సెంటిమెంట్‌ని చూపిస్తున్నారు టీమిండియా ఫ్యాన్స్...

66

వరుసగా దెబ్బ మీద దెబ్బ తగులుతుండడంతో ఐసీసీ టైటిల్ లేక టీమిండియా ఫ్యాన్స్ ఎంత కరువులో అల్లాడుతున్నారో ఈ సెంటిమెంట్‌ లెక్కలను బట్టే అర్థం చేసుకోవచ్చు. అయితే అప్పుడు ఉన్న టీమ్, ఇప్పుడు ఉన్న టీమ్‌లో ఒక్క విరాట్ కోహ్లీ మాత్రమే టీమ్‌లో ఇంకా కొనసాగుతున్నాడు.. 

click me!

Recommended Stories