2013 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఇంగ్లాండ్‌పై ఐసీసీ మ్యాచ్ గెలవలేదు భారత్. 2023 వన్డే వరల్డ్ కప్‌లో అది సాధ్యమైంది... అలాగే ఇంతకుముందు పాకిస్తాన్‌పై ఆఫ్ఘాన్ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది. 2023 ప్రపంచ కప్‌లో ఈ రికార్డు కూడా సాధ్యమైంది..
Mitchell Starc
వన్డే వరల్డ్ కప్ టోర్నీలో ఆడిన ప్రతీ మ్యాచ్‌లోనూ వికెట్ తీస్తూ వచ్చాడు మిచెల్ స్టార్క్. అయితే ధర్మశాలలో జరిగిన మ్యాచ్‌లో 9 ఓవర్లు బౌలింగ్ చేసిన మిచెల్ స్టార్క్, 89 పరుగులు ఇచ్చి వికెట్ తీయలేకపోయాడు. వన్డే ప్రపంచ కప్‌లో గత 23 మ్యాచుల్లో వికెట్ తీస్తూ వచ్చిన స్టార్క్, ఆ ఫీట్‌ని కొనసాగించలేకపోయాడు..
Virat Kohli
టీ20, వన్డే వరల్డ్ కప్ టోర్నీల్లో కలిపి 56 మ్యాచులు ఆడిన విరాట్ కోహ్లీ, మొట్టమొదటిసారి డకౌట్ అయ్యాడు. వన్డే వరల్డ్ కప్‌లో 32 మ్యాచుల తర్వాత డకౌట్ అయిన విరాట్ కోహ్లీ, సనత్ జయసూర్య 34 వన్డే వరల్డ్ కప్ మ్యాచుల రికార్డును మిస్ చేసుకున్నాడు..
విరాట్ కోహ్లీతో పాటు ఇంగ్లాండ్ తరుపున వన్‌డౌన్‌లో వచ్చిన జో రూట్ కూడా డకౌట్ అయ్యాడు. వన్డే వరల్డ్ కప్ మ్యాచ్‌లో ఇరు జట్ల వన్‌డౌన్ ప్లేయర్లు డకౌట్ కావడం ఇదే తొలిసారి..
Ben Stokes
విరాట్ కోహ్లీయే కాదు, ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్, ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్లు బెన్ స్టోక్స్, జో రూట్ కూడా ఇంతవరకూ వరల్డ్ కప్ మ్యాచ్‌లో డకౌట్ కాలేదు. అయితే ఈ నలుగురూ లక్నోలోనే డకౌట్ కావడం విశేషం..