ఇండియాలో టెస్టు సిరీస్ గెలవడం, యాషెస్ సిరీస్ కంటే పెద్ద విషయం.. - స్టీవ్ స్మిత్...

First Published Feb 6, 2023, 11:57 AM IST

ఆస్ట్రేలియన్లకు యాషెస్ సిరీస్ అంటే ప్రత్యేకమైన అభిమానం. ఇంగ్లాండ్ జట్టు అయితే యాషెస్ సిరీస్‌కి ప్లేయర్లను సిద్ధంగా పెట్టేందుకు రొటేషన్ పద్ధతిలో స్టార్ ప్లేయర్లపై వర్క్ ప్రెజర్ పడకుండా జాగ్రత్త పడుతుంది. యాషెస్ సిరీస్ కోసం ఇరు దేశాల ప్రజలతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తారు..

Steve Smith

యాషెస్ సిరీస్ తర్వాత అంత క్రేజ్ వచ్చిన టెస్టు సిరీస్ ఏదైనా ఉందంటే అది బోర్డర్ గవాస్కర్ ట్రోఫీయే. గత మూడు సీజన్లలో ఆస్ట్రేలియాను ఖంగు తినిపించి, టెస్టు సిరీస్‌ని కైవసం చేసుకుంది భారత జట్టు. దీంతో ఈసారి ఇండియాలో టెస్టు సిరీస్ గెలవడం ఆస్ట్రేలియాకి పరువు సమస్యగా మారింది...

గత రెండు సీజన్లలో ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాని ఓడించి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలిచింది టీమిండియా. ఈసారి కూడా ఆస్ట్రేలియా ఓడిపోతే, అది ఆసీస్‌కి ఘోర అవమానం. అందుకే ఎలాగైనా టెస్టు సిరీస్ గెలిచి, స్వదేశానికి తిరిగి వెళ్లాలని భావిస్తోంది ఆస్ట్రేలియా...

Steve Smith

తాజాగా ఆస్ట్రేలియా సీనియర్ బ్యాటర్, మాజీ కెప్టెన్, ఐసీసీ నెం.2 టెస్టు బ్యాటర్ స్టీవ్ స్మిత్... బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు. ‘ఇండియాలో టెస్టు సిరీస్ గెలవడం యాషెస్ సిరీస్ కంటే పెద్దది. ఇక్కడి పరిస్థితులను దాటుకుని గెలవాలంటే నూటికి నూరు శాతం శ్రమించాల్సిందే...’ అంటూ వ్యాఖ్యానించాడు స్టీవ్ స్మిత్..

Pat Cummins

ఆసీస్ టెస్టు సారథి ప్యాట్ కమ్మిన్స్ కూడా ఇదే విధమైన వ్యాఖ్యలు చేశాడు. ‘ఇండియాలో టెస్టు సిరీస్ గెలవడమంటే ఇంగ్లాండ్‌లో యాషెస్ సిరీస్ గెలవడంతో సమానం. ఇది నా కెప్టెన్సీ కెరీర్‌కి చాలా విలువైన సిరీస్..’ అంటూ కామెంట్ చేశాడు ప్యాట్ కమ్మిన్స్...

ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్, ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా టెస్టు సిరీస్‌పై స్పందించాడు. ‘భారత్‌లో ఆడడాన్ని నేను చాలా ఎంజాయ్ చేస్తాను. అయితే ఇండియాలో ఇండియాని ఓడించడం చాలా కష్టమైన విషయం. చాలా పెద్ద ఛాలెంజ్... దీనికి మేం రెఢీగా ఉన్నాం.’ అంటూ వ్యాఖ్యానించాడు డేవిడ్ వార్నర్...

Mitchell Starc

ఆస్ట్రేలియా సీనియర్ బౌలర్ మిచెల్ స్టార్క్ కూడా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కఠినమైన పరీక్షగా అభివర్ణించాడు. ‘భారత్‌లో టెస్టు సిరీస్ గెలవాలనే కోరిక చాలామందికి అందని ద్రాక్ష‌గానే మిగిలిపోయింది. భారత జట్టు చాలా పటిష్టమైన టీమ్. ఈసారి మేం ఇలాగైనా దాన్ని సాధించాలనే గట్టి పట్టుదలతో ఉన్నాం...’ అంటూ కామెంట్ చేశాడు మిచెల్ స్టార్క్...

click me!