రవిశాస్త్రి టెన్షన్ తట్టుకోలేక, శార్దూల్‌ని పంపించాడు! అతనేమో చెప్పింది వినకుండా...

Published : Feb 06, 2023, 10:20 AM IST

టీమిండియా టెస్టు క్రికెట్ ఫ్యాన్స్ ఈ మధ్యకాలంలో మరిచిపోలేని మ్యాచుల్లో గబ్బా టెస్టు ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుంది. ఆ తర్వాత ప్లేస్ సిడ్నీ టెస్టుదే. ఆడిలైడ్ టెస్టు పరాభవం తర్వాత ఊహించని విధంగా కమ్‌బ్యాక్ ఇచ్చి మెల్‌బోర్న్ టెస్టు గెలిచింది టీమిండియా. అయితే సిడ్నీ టెస్టులో ఆసీస్ పట్టు బిగించింది... అయితే అనుకున్న రిజల్ట్ అయితే రాబట్టలేకపోయింది..

PREV
19
రవిశాస్త్రి టెన్షన్ తట్టుకోలేక, శార్దూల్‌ని పంపించాడు! అతనేమో చెప్పింది వినకుండా...

తొలి ఇన్నింగ్స్‌లో 338 పరుగులు చేసిన ఆస్ట్రేలియా, భారత జట్టును 244 పరుగులకి ఆలౌట్ చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 312 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. నాలుగో ఇన్నింగ్స్‌లో టీమిండియా ముందు 406 పరుగుల భారీ లక్ష్యాన్ని పెట్టింది...

29

రోహిత్ శర్మ 52, శుబ్‌మన్ గిల్ 31 పరుగులు చేయగా అజింకా రహానే 4 పరుగులు చేసి నిరాశపరిచాడు. అయితే రిషబ్ పంత్, ఛతేశ్వర్ పూజారా కలిసి నాలుగో వికెట్‌కి 148 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 118 బంతుల్లో 12 ఫోర్లు,3 సిక్సర్లతో 97 పరుగులు చేసిన రిషబ్ పంత్, సెంచరీకి 3 పరుగుల దూరంలో అవుట్ అయ్యాడు...
 

39

205 బంతుల్లో 12 ఫోర్లతో 77 పరుగులు చేసిన ఛతేశ్వర్ పూజారా కూడా అవుట్ కావడంతో 272 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది భారత జట్టు. రవీంద్ర జడేజా తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసే సమయంలో చేతి వేళ్లకు గాయమైంది. దీంతో అతని కంటే ముందు రవిచంద్రన్ అశ్విన్ క్రీజులోకి వచ్చాడు...

49

మరో వికెట్ పడితే చిట్లిన వేలితోనే బ్యాటింగ్ చేయాలని ఫిక్స్ అయిన రవీంద్ర జడేజా ప్యాడ్స్ కట్టుకుని రెఢీగా ఉన్నాడు. ఆస్ట్రేలియా విజయానికి మరో 5 వికెట్లు కావాలి. భారత జట్టు మరో 45 ఓవర్లు బ్యాటింగ్ చేయాలి. ఇక టీమిండియా పని అయిపోయిందని అనుకున్నారంతా...
 

59

అయితే హనుమ విహారి, రవిచంద్రన్ అశ్విన్ కలిసి చారిత్రక ఇన్నింగ్స్‌లతో మ్యాచ్‌ని డ్రాగా ముగించారు. హనుమ విహారి చేతికి గాయమైనా, అశ్విన్ వీపు కండరాలు పట్టేసినా పట్టువదలకుండా క్రీజులో పాతుకుపోయి 43 ఓవర్లు బ్యాటింగ్ చేశారు. విహారి 161 బంతులు ఆడి 23 పరుగులు చేస్తే, అశ్విన్ 128 బంతులాడి 39 పరుగులు చేశాడు... ఈ ఇద్దరూ 259 బంతులు ఆడి 62 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. 

69

‘అశ్విన్, విహారి బ్యాటింగ్ చేస్తున్నంతసేపు డ్రెస్సింగ్ రూమ్‌‌లో, డగౌట్‌లో అందరం ఉత్కంఠభరితంగా చూస్తూ కూర్చున్నాం. విహారి ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొంటుంటే, అశ్విన్, మరో ఎండ్‌లో నాథన్ లియాన్‌ను ఫేస్ చేస్తున్నాడు. అయితే వాళ్లు సింగిల్ తీయడంతో స్ట్రైయిక్స్ మారిపోయాయి... అశ్విన్, ఫాస్ట్ బౌలర్‌ని ఫేస్ చేయాల్సి వచ్చింది..

79

రవిశాస్త్రికి టెన్షన్‌తో ఒళ్లంతా చెమటలు పట్టాయి. వెంటనే సబ్‌స్టిట్యూట్‌గా ఉన్న శార్దూల్ ఠాకూర్‌ని పిలిచి, ‘నేను చెప్పేది జాగ్రత్తగా విను, నేనేం చెప్పాలో అదే అక్కడికి వెళ్లి చెప్పు. విహారి ఫాస్ట్ బౌలర్లను ఫేస్ చేయాలి, అశ్విన్, నాథన్ లియాన్‌ను ఫేస్ చేయాలి. సింగిల్స్ వద్దు. స్ట్రైయిక్ రొటేట్ చేయొద్దు.. అర్థమైందా?’ అని చెప్పాడు. శార్దూల్ నవ్వుతూ ‘ఎస్ సర్’ అని వాటర్ వాటిల్స్ తీసుకుని క్రీజులోకి వెళ్లాడు...

89

మళ్లీ తిరిగి వచ్చి, శాస్త్రి చెప్పింది చెప్పినట్టు చెప్పానని మాకు చెప్పాడు. మ్యాచ్ డ్రా అయ్యాక అడిగితే అసలు విషయం బయటపడింది. ఠాకూర్ వెళ్లి, ‘వాళ్లు చాలా చెప్పారు. కానీ మీరు దేనీ గురించి ఆలోచించకండి.మీరు చాలా బాగా ఆడుతున్నారు. అలాగే ఆడండి...’ అని చెప్పాడు. ఈ విషయం తెలియగానే అందరం షాక్ అయ్యాం..

99

అయితే ఆ సమయంలో శార్దూల్ ఠాకూర్ చేసిందే కరెక్ట్. బాగా ఆడుతున్నవాళ్లను ప్లాన్ మార్చుకోమని చెప్పడం వల్ల మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది. శార్దూల్ అదే ఆలోచించి, సరైన మెసేజ్ ఇచ్చి వచ్చాడు...’ అంటూ తన ఆటోబయోగ్రఫీ ‘కోచింగ్ బియాండ్’లో రాసుకొచ్చాడు ఆర్ శ్రీధర్.. 

click me!

Recommended Stories