Steve Smith: ప్రిన్సెస్ లాగా బిల్డప్ ఇవ్వకు బ్రో.. స్టీవ్ స్మిత్‌ను ఆటాడుకున్న క్రికెట్ లవర్స్ !

Published : Aug 13, 2026, 03:00 PM IST

Steve Smith: బంగ్లా పేసర్ల దాటికి ఆసీస్ తడబడింది. ఆ బౌలింగ్ దెబ్బతో ఒక స్టార్ ప్లేయర్ అవుట్ అయ్యాననుకొని వెళ్ళిపోయాడు కానీ, కట్ చేస్తే నాటౌట్. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో స్టీవ్ స్మిత్ పెవిలియన్ వైపు వెళ్లడంతో మరో వివాదం మొదలైంది.

PREV
15
డార్విన్ టెస్టులో స్టీవ్ స్మిత్ హైడ్రామా

ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ జట్ల మధ్య డార్విన్‌లోని మరారా స్టేడియంలో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్‌లో ఓ డ్రామా చోటుచేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టుకు బంగ్లాదేశ్ బౌలర్లు షాక్ ఇచ్చారు. మ్యాచ్ తొలి రోజే ఆసీస్ టాప్ స్టార్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. అయితే ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ వికెట్ చుట్టూ నడిచిన వివాదం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

25
వాకింగ్ వివాదం: అవుట్ అనుకుని వెళ్లిన స్మిత్

ఎబాదత్ హొస్సేన్ వేసిన 21వ ఓవర్‌లో స్టీవ్ స్మిత్ బ్యాట్‌ను బంతి తాకి కీపర్ చేతికి వెళ్లినట్లు బంగ్లాదేశ్ ప్లేయర్లు గట్టిగా అపీల్ చేశారు. అంపైర్ కుమార ధర్మసేన దాన్ని నాటౌట్‌గా ప్రకటించడంతో బంగ్లాదేశ్ రివ్యూకి వెళ్లింది. అంతలోనే స్వీయ తప్పిదాన్ని ఒప్పుకున్నట్టు స్టీవ్ స్మిత్ దాదాపు 20 మీటర్లు మైదానం నుంచి బయటకు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు.

తాను అవుట్ అయ్యానని స్మిత్ బలంగా నమ్మాడు. కానీ అల్ట్రా ఎడ్జ్ లో చెక్ చేయగా బంతి బ్యాట్‌కు తగలలేదని తేలింది. దాంతో అంపైర్ తన నాటౌట్ నిర్ణయానికే కట్టుబడ్డాడు. స్మిత్ మళ్లీ క్రీజులోకి రావలసి వచ్చింది. బ్యాటర్ తాను అవుట్ అనుకుని వెళ్ళిపోతున్నప్పుడు అంపైర్లు దాన్ని పరిగణనలోకి తీసుకోకూడదా అని టీవీ కామెంటేటర్లు ప్రశ్నించారు.

35
స్మిత్‌ను తిట్టిన అభిమానులు

ఒకవైపు వికెట్లు పడుతున్న వేళ స్టీవ్ స్మిత్ నిలకడగా ఆడుతూ టీ విరామ సమయానికి 67 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అయితే ఈ ఇన్నింగ్స్ సమయంలో సైట్ స్క్రీన్ సమస్య వల్ల స్మిత్ ఆటను కొద్దిసేపు నిలిపివేశాడు. దీనిపై సహనం కోల్పోయిన ఓ ఆస్ట్రేలియా అభిమాని మైదానంలో నుంచే గట్టిగా అరిచాడు. "ఓవర్ యాక్షన్ ఆపు స్మిత్! ప్రిన్సెస్‌లా ప్రవర్తించకు, నువ్వు గేమ్‌ కంటే పెద్దోడివి కాదు. సరిగ్గా బ్యాటింగ్ చేయి" అంటూ గట్టిగా సెటైర్లు వేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

45
బంగ్లాదేశ్ పేసర్ల విధ్వంసం

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాకు బంగ్లాదేశ్ పేసర్లు గట్టి షాక్ ఇచ్చారు. హసన్ మహమూద్ (4/49), తస్కిన్ అహ్మద్ (2/46) అద్భుతమైన స్పెల్స్‌తో ఆసీస్ టాప్ ఆర్డర్‌ను దెబ్బతీశారు. ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (22), జేక్ వెదర్‌రాల్డ్ (23) తొలి వికెట్‌కు 45 పరుగులు జోడించినా, ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయారు. లంచ్ సమయానికి ఆస్ట్రేలియా 74 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. కామెరాన్ గ్రీన్ (13), మార్నస్ లబుషేన్ (1) ఘోరంగా విఫలమయ్యారు. ఆ తర్వాత 198 పరుగులకు ఆలౌట్ అయింది.

55
స్టీవ్ వా రికార్డ్‌ను సమం చేసిన స్మిత్

ఒకవైపు వికెట్లు పడుతున్నా స్టీవ్ స్మిత్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. ఆస్ట్రేలియా 198 పరుగులకు ఆలౌట్ అయింది. స్మిత్ 71 పరుగులు చేశాడు. ఈ అర్ధసెంచరీతో స్మిత్ తన కెరీర్‌లో 45వ టెస్ట్ ఫిఫ్టీని నమోదు చేశాడు. అంతేకాదు, ఆస్ట్రేలియా తరఫున అత్యధిక 50+ స్కోర్లు (82) సాధించిన దిగ్గజ ప్లేయర్ స్టీవ్ వా రికార్డును స్మిత్ సమం చేశాడు. ప్రస్తుతం స్మిత్ ఖాతాలో 37 సెంచరీలు, 45 అర్ధసెంచరీలు ఉన్నాయి. ఈ జాబితాలో రికీ పాంటింగ్ 103 ఏభైకి పైగా స్కోర్లతో టాప్ లో ఉన్నాడు.

Read more Photos on
click me!

Recommended Stories