Abhishek Porel: ఐపీఎల్ యంగ్ స్టార్ అరెస్ట్.. సంచలనం రేపుతున్న కేసు వివరాలు.. అసలు ఏం జరిగింది?

Published : Aug 12, 2026, 08:14 AM IST

Abhishek Porel: ఇండియన్ ప్రీమియర్ లీగ్ యంగ్ స్టార్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు వికెట్ కీపర్ బ్యాటర్ అభిషేక్ పోరెల్ లైంగిక దాడి, వేధింపుల కేసులో చిక్కుకున్నాడు. ఓ మెడికల్ విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు హూగ్లీ జిల్లా పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.

PREV
15
పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం.. పోలీసుల కస్టడీలోకి ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్!

ఐపీఎల్ టోర్నీలో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడిన బెంగాల్ వికెట్ కీపర్, బ్యాటర్ అభిషేక్ పోరెల్ సంచలన రీతిలో అరెస్ట్ అయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడికి పాల్పడటం, శారీరక వేధింపులకు గురిచేయడం, వ్యక్తిగత ఫోటోలతో బెదిరించడం వంటి తీవ్ర ఆరోపణలతో హుగ్లీ జిల్లాలోని మోగ్రా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. కలకత్తా హైకోర్టు ఇచ్చిన కఠిన ఆదేశాల మేరకే పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. మంగళవారం ఛిన్సురాలోని చీఫ్ జుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో పోరెల్‌ను హాజరుపరచగా, న్యాయస్థానం బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించి 3 రోజుల పోలీసు కస్టడీకి అనుమతించింది.

25
బాధితురాలు ఎవరు? రిలేషన్‌షిప్ వెనుక అసలు కథ ఇదే

ఈ కేసులో ఫిర్యాదు చేసిన యువతి కర్ణాటకకు చెందిన మూడో సంవత్సరం మెడికల్ స్టూడెంట్. మోగ్రా పోలీసు స్టేషన్‌లో జూన్ 23న ఆమె ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. పోరెల్, ఆమె 2023 జనవరిలో మొదట కలుసుకున్నారు. ఆ ఏడాది ఏప్రిల్ నుంచి ఇద్దరి మధ్య నిరంతరం సంభాషణలు సాగాయి. దాదాపు మూడేళ్లన్నర పాటు వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. పరస్పరం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇరు కుటుంబాల మధ్య కూడా పెళ్లికి సంబంధించిన చర్చలు జరిగాయి. వీరు కలిసి విదేశాలకు కూడా వెళ్లారని సమాచారం. అయితే సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం బాధితురాలి గుర్తింపును రహస్యంగా ఉంచారు.

35
దారుణమైన ఆరోపణలు.. ఢిల్లీలో గృహబంధనం, వేధింపులు

పెళ్లి చేసుకుంటానని పోరెల్ తనను లైంగికంగా వాడుకున్నాడని బాధితురాలు ఆరోపించింది. 2026 ఏప్రిల్ 2న పోరెల్‌ను కలవడానికి ఆమె ఢిల్లీకి వెళ్లింది. అక్కడ తనను తీవ్రంగా చిత్రహింసలకు గురిచేశాడని, గదిలో ఒంటరిగా బంధించి ఆహారం కూడా ఇవ్వకుండా వేధించాడని పేర్కొంది. తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆమె ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. తమ ఇంటిమేట్ క్షణాల ఫోటోలు, వీడియోలు తన దగ్గర ఉన్నాయని, వాటిని బయటపెడతానని బెదిరించాడని తెలిపింది. ఇతర మహిళలతో కూడా పోరెల్‌కు సంబంధాలు ఉన్నాయని తెలిశాకే తానెంతగా మోసపోయానో అర్ధమైందని ఆమె వాపోయింది.

45
కేసు నమోదు, చట్టపరమైన అంశాలు ఇవే

బాధితురాలి ఫిర్యాదు మేరకు మోగ్రా పోలీసులు అభిషేక్ పోరెల్‌పై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 69 (తప్పుదారి పట్టించే మార్గాల ద్వారా, అంటే పెళ్లి చేసుకుంటానని బూటకపు హామీ ఇచ్చి లైంగిక సంబంధం పెట్టుకోవడం), తీవ్రంగా గాయపరచడానికి యత్నించడం, మోసం చేయడం వంటి తీవ్రమైన అభియోగాల కింద కేసులు నమోదు చేశారు. వీటితో పాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) యాక్ట్ కింద కూడా కేసులు పెట్టారు. ఈ అభియోగాలు కోర్టులో రుజువైతే పోరెల్‌కు గరిష్ఠంగా 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

55
హైకోర్టు సీరియస్.. చివరకు చెరసాలకు ఐపీఎల్ స్టార్

పోలీసులు మొదట తగిన చర్యలు తీసుకోవడం లేదని బాధితురాలు కలకత్తా హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ సౌగత భట్టాచార్య జూలై 14న బెంగాల్ పోలీసులను ఆదేశించారు. నిందితుడి వద్ద ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఉన్న అభ్యంతరకరమైన ఫోటోలు, డాటా బయటకు వ్యాపించకుండా వాటిని తక్షణమే సీజ్ చేయాలని, నిందితుడిని అరెస్ట్ చేయాలని ఉత్తర్వులు ఇచ్చారు. ఇప్పటికే ఒక పెన్ డ్రైవ్‌ను సీజ్ చేసి ఫోరెన్సిక్ పరీక్షలకు పంపినట్లు పోలీసులు హైకోర్టుకు తెలిపారు. ఎట్టకేలకు పోలీసు బృందం సోమవారం రాత్రి పోరెల్‌ను అరెస్ట్ చేసింది. హుగ్లీ రూరల్ ఎస్పీ కునార్ భూషణ్ సింగ్ అరెస్ట్‌ను ధృవీకరించారు.

ఐపీఎల్ 2026 సీజన్ ముగిసినప్పటి నుండి అభిషేక్ పోరెల్ ఎలాంటి కాంపిటీటివ్ క్రికెట్ ఆడలేదు. 2026 ఐపీఎల్ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున కేవలం 4 మ్యాచులు మాత్రమే ఆడాడు. ఈ అరెస్ట్‌తో అతని క్రికెట్ కెరీర్ ప్రమాదంలో పడింది. నిందితుడిగా ఉన్న పోరెల్ తరఫున ఆయన కుటుంబం ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

Read more Photos on
click me!

Recommended Stories