స్టీవ్ స్మిత్ భార్యకు దూరంగా ఉంటున్నాడు... అందుకే అతని బ్యాటింగ్ సరిగా లేదు...

First Published Jan 1, 2021, 10:11 AM IST

ఐపీఎల్‌లో పెద్దగా రాణించని ఆసీస్ స్టార్ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్... ‘ఫామ్ అందుకున్నానంటూ’ చెప్పి మరీ టీమిండియాతో జరిగిన మొదటి రెండు వన్డేల్లో సెంచరీలు బాదాడు. అయితే ఆ తర్వాత మళ్లీ పరుగులు చేయడానికి తెగ ఇబ్బంది పడుతున్నాడు స్మిత్. దీనికి కారణం స్టీవ్ స్మిత్ నాలుగున్నర నెలలుగా భార్యకు దూరంగా ఉండడమే అంటున్నాడు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ కిమ్ హ్యూజ్‌.

టీమిండియాపై మంచి ట్రాక్ రికార్డు ఉన్న స్టీవ్ స్మిత్... మొదటి రెండు టెస్టుల్లో ఘోరంగా ఫెయిల్ అయ్యాడు... డబుల్ డిజిట్ స్కోరు కూడా చేరుకోలేకపోయాడు...
undefined
రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాపై మొట్టమొదటిసారి డకౌట్ అయిన స్టీవ్ స్మిత్... రెండో ఇన్నింగ్స్‌లో 8 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు..
undefined
మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియంలో స్టీవ్ స్మిత్‌కి ఇదే అత్యల్ప స్కోర్లు. ఈ మ్యాచ్‌కి ముందు ఈ స్టేడియంలో 113+ యావరేజ్‌తో పరుగులు చేశాడు స్టీవ్ స్మిత్...
undefined
స్టీవ్ స్మిత్ ఫామ్ కోల్పోవడానికి ప్రధాన కారణం క్వారంటైన్ నిబంధనల కారణంగా భార్యకు దూరంగా ఉంటుండమే అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఆసీస్ మాజీ క్రికెటర్ కిమ్ హ్యూజ్.
undefined
‘క్రికెట్ కారణంగా స్టీవ్ స్మిత్ తన భార్య డానికి నాలుగున్నర నెలలుగా దూరంగా ఉంటున్నాడు... క్వారంటైన్ నిబంధనల కారణంగా భార్యను కలుసుకోవడానికి కూడా వీలు లేకుండా పోయింది...
undefined
భార్యకు దూరం కావడం వల్ల, స్టీవ్ స్మిత్‌తో స్ట్రెస్ బాగా పెరిగిపోయింది. అతనికి కావాల్సిన ఫిజికల్, మెంటల్ రిలీఫ్ కూడా దొరకడం లేదు... అతని బ్యాటింగ్ గాడి తప్పడానికి ఇదే ప్రధాన కారణం’ అంటూ చెప్పుకొచ్చాడు కిమ్ హ్యూజ్...
undefined
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైక్ హుస్సీ మాత్రం స్టీవ్ స్మిత్‌ను అవుట్ చేసేందుకు భారత జట్టు వేస్తున్న ప్రణాళికలు... అద్భుతంగా వర్కవుట్ అవుతున్నాయని అభిప్రాయపడ్డాడు...
undefined
ఆడిలైడ్‌ టెస్టులో స్టీవ్ స్మిత్‌ను 1 పరుగుకే అవుట్ చేసిన రవిచంద్రన్ అశ్విన్, బాక్సింగ్ డే టెస్టులో డకౌట్ చేసి రికార్డు క్రియేట్ చేశాడు. టీమిండియాపై స్మిత్ డకౌట్ కావడం ఇదే తొలిసారి...
undefined
‘స్టీవ్ స్మిత్ ఈ సిరీస్‌లో సరిగా పరుగులు చేయలేకపోతున్నాడు. ఆస్ట్రేలియాకి ఇది చాలా పెద్ద సమస్యే...
undefined
స్టీవ్ స్మిత్ రాణిస్తే ఆస్ట్రేలియా జట్టు అవకాశాలు పెరుగుతాయి... స్మిత్‌ను అవుట్ చేసేందుకు భారత జట్టు అద్భుతమైన ప్రణాళికలు రూపొందిస్తోంది...
undefined
వాటిని పక్కగా అమలు చేస్తోంది. స్టంప్స్‌ను టార్గెట్ చేస్తూ భారత బౌలర్లు బౌలింగ్ చేస్తున్నారు. లెగ్ సైడ్ ఫీల్డ్‌కి బంతులు వేయకుండా పరుగులను నియంత్రిస్తున్నారు...
undefined
గత ఏడాది సమ్మర్‌లో న్యూజిలాండ్ జట్టు స్మిత్‌ను నాలుగు సార్లు షార్ట్ బాల్‌తో అవుట్ చేసింది. బుమ్రా కూడా అదే మంత్రాన్ని స్మిత్‌పై వాడుతున్నాడు.
undefined
అవసరమైతే బౌల్డ్ చేసేందుకు లేదా ఎల్బీడబ్ల్యూ రూపంలో అవుట్ చేసేందుకే టార్గెట్ చేస్తే బౌలింగ్ వేస్తున్నాడు... ఇది స్మిత్‌కి సమస్యగా మారింది..
undefined
స్టీవ్ స్మిత్ చాలా గొప్ప ప్లేయర్. అతను ఈ లోపాన్ని సరిదిద్దుకుని రాణిస్తాడని నమ్ముతున్నా... ’ అని చెప్పుకొచ్చాడు మైక్ హస్సీ.
undefined
భారీ అంచనాలను సిరీస్ ఆరంభించిన లబుషేన్, వాటిని అందుకోలేకపోతున్నాడని చెప్పిన హస్సీ... అతనిపై కూడా టీమిండియా పర్ఫెక్ట్ ప్లానింగ్ వర్కవుట్ చేస్తోందని చెప్పాడు.
undefined
click me!