వెళ్లి అతనితో మాట్లాడు... అతను ఉన్నది అందుకే... ఛతేశ్వర్ పూజారాకి సునీల్ గవాస్కర్ సలహా...
First Published | Dec 31, 2020, 2:05 PM ISTబాక్సింగ్ డే టెస్టులో భారత జట్టు అద్భుత విజయం అందుకున్నా, టెస్టు స్పెషలిస్టు బ్యాట్స్‌మెన్ ఛతేశ్వర్ పూజారా రెండు ఇన్నింగ్స్‌ల్లో ఫెయిల్ కావడం కలవరపెడుతున్న అంశం. పూజారా రాణిస్తే మిగిలిన బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి తగ్గుతుంది. ముఖ్యంగా లోయర్ ఆర్డర్‌లో మంచి భాగస్వామ్యాలు నెలకొల్పి, పరుగులు చేయడం పూజారాలో ఉన్న స్పెషాలిటీ. కొన్నాళ్లుగా సరైన ప్రదర్శన ఇవ్వలేకపోతున్న పూజారా, తిరిగి ఫామ్‌ను అందుకోవాలంటే భారత బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్‌తో మాట్లాడాలని సలహా ఇచ్చాడు మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్.