భారత బౌలర్లంటే అంత భయమా! వణికిపోతున్నారు... ఆస్ట్రేలియా టీమ్‌పై రికీ పాంటింగ్ ఫైర్...

First Published Dec 31, 2020, 1:23 PM IST

క్రికెట్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్. ఆసీస్‌కు రెండు వన్డే వరల్డ్‌కప్స్ అందించిన రికీ పాంటింగ్, బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా ప్రదర్శనపై ఫైర్ అయ్యాడు. భారత బౌలింగ్‌కి ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ వణికిపోతున్నారని, ఇలాంటి ప్రదర్శన ఇంతకుముందెప్పుడూ చూడలేదని కామెంట్ చేశాడు. సచిన్‌తో పాటు పరుగుల వేటలో పోటీపడిన రికీ పాంటింగ్... స్మిత్, లబుషేన్‌ల ఫెయిల్యూర్‌పై క్లాస్ తీసుకున్నాడు.

తొలి టెస్టులో భారత జట్టుపై 8 వికెట్ల తేడాతో అద్భుత విజయం అందుకున్న ఆస్ట్రేలియా, రెండో టెస్టులో 8 వికెట్ల తేడాతో ఓడింది...
undefined
‘బ్యాటింగ్‌లో ఆస్ట్రేలియా ఘోరంగా ఫెయిల్ అయింది. బాక్సింగ్ డే టెస్టులో ఆసీస్ పరాజయానికి ఇదే ప్రధాన కారణం. ఆడిలైడ్‌లో కూడా పెద్దగా పరుగులు చేయలేకపోయారు.
undefined
మొదటి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకే ఆలౌట్ అయ్యింది... బౌలర్లు రాణించడంతో భారత జట్టు స్వల్ప స్కోరుకే అవుట్ కావడంతో అదృష్టవశాత్తు విజయం సాధించింది...
undefined
కానీ మెల్‌బోర్న్‌లో కూడా ఆసీస్ బ్యాట్స్‌మెన్ ఫెయిల్ అయ్యారు. మొదటి ఇన్నింగ్స్‌లో 195, రెండో ఇన్నింగ్స్‌లో 200 పరుగులకే ఆలౌట్ అయ్యింది ఆస్ట్రేలియా...
undefined
ఇది టెస్టు క్రికెట్... టీమిండియాపై ఆడుతున్నప్పుడు ఈ పరుగులు ఏ మాత్రం సరిపోవు. రన్‌రేటు కూడా మరీ దారుణంగా ఉంది...
undefined
టీమిండియా బౌలింగ్‌లో ఔట్ అయిపోతామని ఆసీస్ బ్యాట్స్‌మెన్ భయపడుతున్నట్టు తెలుస్తోంది. ముందు ఈ భయాన్ని వీడాలి... క్రీజులోకి బ్యాటుతో వెళ్లిన తర్వాత పరుగులు చేయడం గురించే ఆలోచించాలి...
undefined
టెస్టు క్రికెట్‌లో సుదీర్ఘ ఇన్నింగ్స్‌లో చాలా కీలకం. ఓపిగ్గా బ్యాటింగ్ చేయాలి... రెండు టెస్టుల్లోనూ ఆస్ట్రేలియా నుంచి ఇలాంటి ఇన్నింగ్స్ రాలేదు...
undefined
టెస్టుల్లో భాగస్వామ్యాలు చాలా అవసరం. స్టీవ్ స్మిత్, లబుషేన్ పరుగులు సాధిస్తే, ఆస్ట్రేలియా విజయం సాధించడం పెద్ద కష్టమేమీ కాదు...
undefined
లబుషేన్, స్మిత్ ఫామ్‌లోకి వస్తే ఆసీస్ ప్రదర్శన మెరుగవుతుంది...ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ కంటే మొదటి మ్యాచ్ ఆడుతున్న శుబ్‌మన్ గిల్ ఎంతో కాన్ఫిడెన్స్‌తో బ్యాటింగ్ చేశాడు...
undefined
రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ శుబ్‌మన్ గిల్మంచి షాట్స్ ఆడాడు...’ అంటూ కామెంట్ చేశాడు రికీ పాంటింగ్.
undefined
తొలిటెస్టు ఓటమి తర్వాత ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌ను 4-0 తేడాతో క్లీన్ స్వీప్ చేస్తుందని కామెంట్ చేశాడు ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్...
undefined
పాంటింగ్ తర్వాత కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న క్లార్క్కూడా ఇదే విధంగా వ్యాఖ్యానించాడు. విరాట్ కోహ్లీ లేకుండా టీమిండియా మ్యాచ్ గెలిస్తే ఏడాది మొత్తం సంబరాలు చేసుకోవచ్చని కామెంట్ చేశాడు మైఖేల్ క్లార్క్...
undefined
click me!