ఇలాంటి మ్యాచులు టెస్టు క్రికెట్‌ను బతికిస్తాయి... ఐపీఎల్ 2021 ఫేజ్ 2 కూడా ఆడతా...

First Published Aug 17, 2021, 2:32 PM IST

ఆస్ట్రేలియా క్రికెటర్, ఢిల్లీ క్యాపటిల్స్ ప్లేయర్ స్టీవ్ స్మిత్, ఐపీఎల్ 2021 సెకండ్ ఫేజ్‌లో ఆడబోతున్నట్టు ప్రకటించాడు. ఐపీఎల్ 2021 ఫేజ్ 1లో ఆరు మ్యాచులు ఆడిన స్టీవ్ స్మిత్, 104 పరుగులు చేశాడు. ఇందులో అత్యధికంగా 34 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు...

కొన్ని నెలలుగా గాయంతో బాధపడుతున్న స్టీవ్ స్మిత్, వెస్టిండీస్‌ టూర్‌లో, ఆ తర్వాత బంగ్లాదేశ్ టూర్‌లో పాల్గొనలేదు. స్టీవ్ స్మిత్‌తో పాటు డేవిడ్ వార్నర్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ వంటి స్టార్ ప్లేయర్లు లేకుండా ఆడిన వెస్టిండీస్ సిరీస్‌లోనూ, ఆ తర్వాత బంగ్లాదేశ్ సిరీస్‌లోనూ చిత్తుగా ఓడింది ఆస్ట్రేలియా...

ఈ పర్ఫామెన్స్ కారణంగా టీ20 వరల్డ్‌కప్‌లో ఆసీస్ దారుణంగా విఫలం అవుతుందని అంచనా వేస్తున్నారు అభిమానులు. దీంతో గాయం నుంచి కోలుకున్న స్టీవ్ స్మిత్, టీ20 ఫార్మాట్‌లో రీఎంట్రీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాడు...

కొన్ని నెలల ముందు గాయం కారణంగా టీ20 వరల్డ్‌కప్ ఆడబోనని, ఐపీఎల్ సెకండ్ ఫేజ్‌లో ఆడడం కూడా కష్టమేనని చెప్పాడు స్టీవ్ స్మిత్. యాషెస్ సిరీస్‌కి ఫిట్‌గా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు స్టీవ్ స్మిత్...

అయితే ఆస్ట్రేలియా వరుస పరాజయాలకు అడ్డుకట్ట వేయాలంటే స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ వంటి ప్లేయర్లు రీఎంట్రీ ఇవ్వడం అత్యంత అవసరం. అందుకే టీ20 వరల్డ్‌కప్ టోర్నీకి ముందు జరిగే ఐపీఎల్ 2021 ఫేజ్‌2లో పాల్గొనబోతున్నట్టు ప్రకటించాడు స్టీవ్ స్మిత్...

‘అవును... ఐపీఎల్‌ ఫేజ్ 2లో ఆడాలని అనుకుంటున్నా... గాయం నుంచి కోలుకున్నా, టీ20 వరల్డ్‌కప్ టోర్నీకి ముందు యూఏఈలో జరిగే ఐపీఎల్ ఆడితే మెగా టోర్నీకి ముందు కావాల్సిన ప్రాక్టీస్ దొరుకుతుందని ఈ నిర్ణయం తీసుకున్నా...’ అంటూ ప్రకటించాడు స్టీవ్ స్మిత్..

లార్డ్స్‌లో జరిగిన ఇంగ్లాండ్, ఇండియా టెస్టు మ్యాచ్ గురించి కూడా కామెంట్ చేశాడు స్టీవ్ స్మిత్.. ‘వాట్ ఏ టెస్ట్ మ్యాచ్... వాట్ ఏ గేమ్ ఆఫ్ క్రికెట్... ఇలాంటి మ్యాచులు టెస్టు క్రికెట్‌ను బతికిస్తాయి... టీమిండియాకి అభినందనలు...’ అంటూ కామెంట్ చేశాడు స్టీవ్ స్మిత్...

ప్రస్తుతం ఢిల్లీ ఓపెనర్లు పృథ్వీషా, శిఖర్ ధావన్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. అలాగే శ్రేయాస్ అయ్యర్ కూడా గాయం నుంచి కోలుకుని, తిరిగి ప్రాక్టీస్ మొదలెట్టేశాడు. దీంతో యూఏఈలో జరిగే ఫేజ్ 2లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇవ్వాలని చూస్తోంది ఢిల్లీ క్యాపిటల్స్... 

స్టీవ్ స్మిత్‌తో పాటు ఢిల్లీ ప్లేయర్లు మార్కస్ స్టోయినిస్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ డేవిడ్ వార్నర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ వంటి ఆస్ట్రేలియా క్రికెటర్లు కూడా ఐపీఎల్ ఫేజ్ 2లో పాల్గొనబోతున్నారు. 

click me!