సచిన్ టెండూల్కర్ క్రీడాస్ఫూర్తిని ప్రశ్నించిన స్టువర్ట్ బ్రాడ్... ఆడుకుంటున్న నెటిజన్లు...

First Published Sep 25, 2022, 7:53 PM IST

క్రికెట్ ప్రపంచాన్ని రెండు దశాబ్దాలకు పైగా ఏలిన క్రికెటర్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. అనితర సాధ్యమైన రికార్డులెన్నో క్రియేట్ చేసి, ‘క్రికెట్ గాడ్’గా గుర్తింపు తెచ్చుకున్న సచిన్ టెండూల్కర్, క్రీడా స్ఫూర్తి విషయంలోనూ మహోన్నత స్థానంలో ఉండేవాడు. అలాంటి సచిన్‌ని అనవసర వివాదంలోకి లాగాలని ప్రయత్నించి, అడ్డంగా బుక్కయ్యాడు ఇంగ్లాండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్..

Deepti Sharma

.
ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరిగిన మూడో వన్డేలో దీప్తి శర్మ చేసిన రనౌట్  (మన్కడింగ్) గురించి క్రికెట్ ప్రపంచంలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఐపీఎల్‌ 2019లో జోస్ బట్లర్‌ని రవిచంద్రన్ అశ్విన్‌ మన్కడింగ్ ద్వారా రనౌట్ చేసినప్పుడు అతని క్రీడా స్ఫూర్తిని ప్రశ్నించిన ఇంగ్లాండ్ క్రికెటర్లు గుంపు, ఇప్పుడు టీమిండియా మహిళా ప్లేయర్‌ని టార్గెట్ చేశారు...

Deepti Sharma

అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్, ఆఖరి వికెట్‌ని ఇలా కోల్పోవడం వల్లే ఆ మ్యాచ్ ఓడిపోయిందనేది వారి వాదన. ఇప్పటికే రెండు వన్డేల్లో చిత్తుగా ఓడిన ఇంగ్లాండ్, ఆ రనౌట్ చేయకపోయి ఉంటే మూడో వన్డేలో గెలిచి పరువు కాపాడుకుని ఉండేదని ఇంగ్లాండ్ మాజీల అభిప్రాయం...

Image credit: Getty

టీమిండియా చేతుల్లో ఇంగ్లాండ్‌లో క్లీన్ స్వీప్ కావడంతో ఆ ఓటమిపై విమర్శలు రాకుండా అభిమానుల దృష్టిని తెలివిగా ఈ మన్కడింగ్ రనౌట్‌వైపు మళ్లించారు ఇంగ్లాండ్ క్రికెటర్లు. ఈ ప్రయత్నంలో దాదాపు సక్సెస్ అయినా, ఇంగ్లాండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్, ఈ వివాదంలోకి సచిన్ టెండూల్కర్‌ని లాగబోయి అడ్డంగా బుక్కయాడు. 

‘ఏ రనౌట్... ఇలా మ్యాచ్ ఫినిష్ అవ్వడం దారుణాతి దారుణం’ అంటూ ట్వీట్ చేశాడు స్టువర్ట్ బ్రాడ్. దీంతో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో బ్యాటు అంచుకు బాల్ తగిలినా క్రీజు వదలకుండా నిల్చున్న స్టువర్ట్ బ్రాడ్ వీడియోను పోస్టు చేశారు ఓ క్రికెట్ అభిమాని. 

దానికి సమధానం ఇచ్చిన స్టువర్ట్ బ్రాడ్... ‘నేను ఆడిన ప్లేయర్లలో 99 శాతం బ్యాటు అంచుకి బాల్ తగిలినా క్రీజు వదల్లేదు. అయితే 1 శాతం మంది మాత్రమే వికెట్ తీయడానికి మన్కడింగ్ విధానం వాడతారు’ అంటూ కామెంట్ చేశాడు...

‘స్లిప్‌లో క్యాచ్ ఇచ్చి క్రీజు వదలకపోతే అది దారుణం... రనౌట్ కాదు. మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ తన కొడుక్కి క్రికెట్ లా నేర్పించాలనుకుంటా...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ దొడ్డ గణేశ్. దీనికి ఆవేశంగా రిప్లై ఇవ్వబోయిన స్టువర్ట్ బ్రాడ్... సచిన్ టెండూల్కర్‌ వీడియోని షేర్ చేశాడు...

Sachin Tendulkar

‘బ్యాటు అంచుకి తగిలిన క్రీజు వదలని ప్లేయర్ల గురించి 1000 ఉదాహరణలు చెబుతా. సచిన్ టెండూల్కర్ కూడా లక్కీగా ఇలా మిస్ అయ్యాడు. బ్యాటు అంచుకి తగిలినా క్రీజు వదల్లేదు’ అంటూ ఓ వీడియో షేర్ చేశాడు స్టువర్ట్ బ్రాడ్. అనవసర వివాదంలోకి సచిన్ టెండూల్కర్‌ని లాగడం టీమిండియా ఫ్యాన్స్‌కి తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది.

అంపైర్లు తప్పుడు నిర్ణయాలు ప్రకటించిన సందర్భాల్లోనూ వారిని ప్రశ్నించకుండా, వారితో వాగ్వాదం దిగకుండా నవ్వుతూ పెవిలియన్ చేరాడు సచిన్ టెండూల్కర్. అంపైర్ తప్పుడు నిర్ణయాల వల్ల అవుట్ కాకపోయి ఉంటే సచిన్ టెండూల్కర్ మరో 50 సెంచరీలు చేసేవాడు కూడా..
 

Sachin Tendulkar

సచిన్ టెండూల్కర్ బ్యాటు అంచుకి బాల్ తగిలిన వెంటనే అంపైర్ వైపు కూడా పెవిలియన్‌కి నడుచుకుంటూ వెళ్లిపోయిన సందర్భాలు కోకొల్లలు. కొన్ని మ్యాచుల్లో 91, 99 పరుగుల వద్ద కూడా ఇలా స్వచ్ఛందంగా పెవిలియన్ చేరి క్రీడా స్ఫూర్తిని చాటుకున్నాడు సచిన్ టెండూల్కర్...

కొన్నిసార్లు బ్యాటుకి బాల్ తగిలిన విషయం కూడా బ్యాటర్‌కి తెలీదు. ఈ కారణంగానే క్యాచ్ అవుట్ విషయంలో కూడా డీఆర్‌ఎస్ తీసుకుంటున్నారు చాలామంది బ్యాటర్లు. ఆ మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్‌కి బ్యాటు అంచుకి బాల్ తగిలిందనే విషయం తెలియకపోవచ్చు. 

stuart broad

సచిన్ టెండూల్కర్‌ని అడ్డం పెట్టుకుని తాను చేసిన తప్పును కరెక్ట్ అని చెప్పుకోవాలని చూసిన స్టువర్ట్ బ్రాడ్‌ని తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్. సచిన్ టెండూల్కర్ గురించి, ఆయన ఆడిన క్రికెట్ గురించి, ఆయన్ని ఎందుకు ‘క్రికెట్ గాడ్’ అంటారో అనే విషయాలు తెలుసుకుని ఉంటే బ్రాడ్ ఈ సాహసం చేసేవాడని ఓ లెవెల్‌లో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు టీమిండియా అభిమానులు... 

click me!