అతన్ని కంఫ్యూజ్ చేయకండి! కంఫ్యూజన్‌లో... కెఎల్ రాహుల్‌కి రవిశాస్త్రి సపోర్ట్...

First Published Sep 25, 2022, 7:03 PM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ముందు కెఎల్ రాహుల్ గాయం నుంచి పూర్తిగా కోలుకొని రీఎంట్రీ ఇచ్చాడు. కెఎల్ రాహుల్ గాయం కారణంగా జట్టుకి దూరం కావడంతో రకరకాల ఓపెనర్లను ప్రయత్నించి, ప్రయోగాలు చేసింది టీమిండియా.. అయితే ఆసియా కప్ 2022 టోర్నీ పర్ఫామెన్స్, కెఎల్ రాహుల్‌ని ఇరకాటంలో పడేసింది.

Image credit: Getty

ఆసియా కప్ 2022 టోర్నీలో ఆఫ్ఘాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి ఓపెనింగ్ చేశాడు తాత్కాలిక కెప్టెన్ కెఎల్ రాహుల్.  దాదాపు మూడేళ్లుగా సెంచరీ చేయలేకపోయిన విరాట్ కోహ్లీ, ఆ మ్యాచ్‌లో శతకంతో చెలరేగిపోయాడు...

Image credit: Getty

విరాట్ కోహ్లీ సెంచరీ చేయడంతో రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేయిస్తే బాగుంటుందనే వాదనలు మొదలయ్యాయి. ఎంతో అనుభవం ఉన్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అయితే ఇన్నింగ్స్‌ని చక్కగా నిర్మించగలరని మాజీ క్రికెటర్లు, విమర్శకులు అభిప్రాయం వ్యక్తం చేశారు...

KL Rahul

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఈ అభిప్రాయానికి తలఊపాడు. ‘టీ20 వరల్డ్ కప్‌ 2022 టోర్నీకి మూడో ఓపెనర్‌ని ఎవ్వరినీ సెలక్ట్ చేయలేదు. అవసరమైతే విరాట్ కోహ్లీని మూడో ఓపెనర్‌గా పరిగణిస్తాం...’ అంటూ వ్యాఖ్యానించాడు రోహిత్ శర్మ...

‘కెఎల్ రాహుల్‌ని కంఫ్యూజ్ చేయొద్దు. కంఫ్యూజన్‌లో సరిగ్గా ఆడలేడు. నా ఉద్దేశంలో కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ ఓపెనింగ్ చేయడమే కరెక్ట్. ఏదైనా అత్యవసరం పడితే, లేదా గాయమైతే విరాట్ కోహ్లీని ఓపెనర్‌గా వాడొచ్చు. అలాంటి సమయాల్లో కెఎల్ రాహుల్‌ని లోయర్ మిడిల్ ఆర్డర్‌లో వాడొచ్చు...
 

Rohit Sharma and KL Rahul

ఆస్ట్రేలియాలో పిచ్, వాతావరణ పరిస్థితులను అర్థం చేసుకుని ఆడడం చాలా కష్టం. మిడిల్ ఓవర్లలో ఎక్కువ వికెట్లు పడతాయి. అక్కడ బౌన్స్ ఎక్కువగా ఉంటుంది. దూకుడుగా బ్యాటింగ్ చేయాలని ప్రయత్నిస్తే, వికెట్ పడే ప్రమాదం ఉంటుంది..

Suryakumar Yadav KL Rahul

విరాట్ కోహ్లీ వన్‌డౌన్‌లో వస్తే మిడిల్ ఆర్డర్ బ్యాటర్లతో కలిసి చక్కని ఇన్నింగ్స్‌లు నిర్మించగలడు. ఆస్ట్రేలియాలో చాలా మ్యాచులు ఆడిన అనుభవం అతనికి ఎంతో ఉపయోగపడుతుంది. ఆ అనుభవాన్ని వాడి, కుర్రాళ్లకు కూడా సాయం చేయగలడు...

రాహుల్ ఓపెనర్‌గా చక్కగా రాణిస్తున్నాడు. అతన్ని ఆ పొజిషన్‌లో ఆడించడమే బెటర్. విరాట్ కోహ్లీని ఓపెనర్‌గా ఆడించాలంటే కెఎల్ రాహుల్ కంఫ్యూజన్‌లో పడిపోతాడు. ఓపెనింగ్ చేయాలా? మిడిల్ ఆర్డర్‌లో ఆడాలా? తెలియక అయోమయానికి గురవుతాడు...
 

KL Rahul

ఏ పొజిషన్‌లో అయినా ఆడగల ప్లేయర్లు ఉండడం ఏ జట్టుకైనా వరం. టీమిండియాకి అలాంటి ప్లేయర్లు చాలా మంది ఉన్నారు. అయితే వారికి ముందుగా ఓ క్లారిటీ వస్తే, ఏ పొజిషన్‌లో అయినా ఆడడానికి సిద్ధంగా ఉంటారు...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి...

click me!