ఆ ముగ్గురికీ కీలకంగా మారిన డిసైడర్ మ్యాచ్... భువీ, యజ్వేంద్ర చాహాల్‌తో పాటు...

First Published Sep 25, 2022, 5:45 PM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ఇంకా నెల రోజుల సమయం కూడా లేదు. ఆసియా కప్ 2022 టోర్నీకి ముందు వరుసగా ద్వైపాక్షిక సిరీస్‌లు గెలుస్తూ హాట్ ఫెవరెట్‌గా మారిన టీమిండియాని కొన్ని నెలలుగా గాయాలు వెంటాడుతున్నాయి. బుమ్రా, హర్షల్ పటేల్ గాయపడి కోలుకోగా రవీంద్ర జడేజా.. టీ20 వరల్డ్ కప్‌కే దూరమయ్యాడు...

Harshal Patel

గాయం నుంచి కోలుకుని రీఎంట్రీ ఇచ్చిన హర్షల్ పటేల్, ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి రెండు టీ20ల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. హర్షల్ పటేల్ నుంచి టీమిండియా కోరుకుంటున్న పర్ఫామెన్స్ అయితే ఇంకా రాలేదు...

Image credit: Getty

గాయం నుంచి కోలుకున్న తర్వాత నాగ్‌పూర్‌లో జరిగిన రెండో టీ20లో రీఎంట్రీ ఇచ్చిన జస్ప్రిత్ బుమ్రా... తన మార్క్ చూపించాడు. అద్భుతమైన యార్కర్‌తో ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్‌ని బొక్క బోర్లా పడేశాడు...

Harshal Patel

అయితే టీమిండియా ప్రధాన స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్ ఫామ్, టీమిండియాని కలవరబెడుతోంది. ఆసియా కప్ 2022 టోర్నీలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసిన చాహాల్, ఆ తర్వాత కానీ అంతకుముందు కానీ అతని రేంజ్‌కి తగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయాడు...

Image credit: PTI

యజ్వేంద్ర చాహాల్ పూర్ పర్ఫామెన్స్, టీమిండియాని తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. మరోవైపు రవి భిష్ణోయ్‌తో కుల్దీప్ యాదవ్ కూడా మంచి పర్ఫామెన్స్ ఇస్తున్నారు. రవీంద్ర జడేజా ప్లేస్‌లో టీమ్‌లోకి వచ్చిన అక్షర్ పటేల్ అదరగొడుతున్నాడు...

అక్షర్ పటేల్ బ్యాటుతో కూడా మెరుపులు మెరిపించగల సత్తా ఉన్న ప్లేయర్. ఆస్ట్రేలియాలో బౌన్సీ పిచ్‌లపై నలుగురు ఫాస్ట్ బౌలర్లు, ఓ స్పిన్నర్‌ని మాత్రమే ఆడించాలని టీమిండియా భావిస్తే ఫామ్‌లో లేని చాహాల్ కంటే అక్షర్ పటేల్‌వైపే చూసే అవకాశాలు ఎక్కువ... దీంతో చాహాల్‌కి మూడో టీ20 మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది...

Bhuvi

ఈ ఇద్దరితో పాటు భువనేశ్వర్ కుమార్ పేలవ ప్రదర్శన భారత జట్టును ఇబ్బందుల్లో పడేస్తోంది. డెత్ ఓవర్ స్పెషలిస్ట్ భువీ ఫామ్‌లోకి వస్తే... బుమ్రా, భువనేశ్వర్ కుమార్ జోడి, వరల్డ్ క్లాస్ బ్యాటర్లకు చుక్కలు చూపించగలదు...

Bhuvi

ఓ రకంగా చెప్పాలంటే భువనేశ్వర్ కుమార్‌ని టీ20 వరల్డ్ కప్‌లో బుమ్రా, హర్షల్ పటేల్‌లతో కలిసి ఆడించాలా? లేక అర్ష్‌దీప్ సింగ్‌కి అవకాశం ఇవ్వాలా? అనేది అతను, ఆస్ట్రేలియాతో జరిగే మూడో టీ20లో ఇచ్చే పర్ఫామెన్స్ డిసైడ్ చేయనుంది...

Virat Kohli and Rohit Sharma

విరాట్ కోహ్లీ, ఆఫ్ఘాన్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగినా ఆ తర్వాత రెండు మ్యాచుల్లోనూ విఫలమయ్యాడు. హైదరాబాద్‌లో జరిగే మూడో టీ20లో విరాట్ నుంచి ఓ మంచి ఇన్నింగ్స్ రావాలని కోరుకుంటున్నారు అభిమానులు...

click me!