వన్డే వరల్డ్ కప్ 2019 నుంచి బీభత్సమైన ఫామ్‌లో ఉన్నాడు భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా. గాయాల కారణంగా వన్డే, టీ20ల్లో పెద్దగా అందుబాటులో ఉండని జడ్డూ, టెస్టుల్లో మాత్రం మంచి నిలకడైన పర్ఫామెన్స్ కనబరుస్తున్నాడు...
మొహాలీ టెస్టులో 228 బంతుల్లో 17 ఫోర్లు, మూడు సిక్సర్లతో 175 పరుగులు చేసి అజేయంగా నిలిచిన రవీంద్ర జడేజా, డబుల్ సెంచరీ చేసుకునే అవకాశం ఉన్నా వదులుకున్నాడు...
210
రిషబ్ పంత్‌తో కలిసి ఆరో వికెట్‌కి, అశ్విన్‌తో కలిసి ఏడో వికెట్‌కి, మహ్మద్ షమీతో కలిసి 9వ వికెట్‌కి శతాధిక భాగస్వామ్యాలు నమోదు చేశాడు జడేజా...
310
బౌలింగ్‌లోనూ అదిరిపోయే పర్ఫామెన్స్ కనబర్చిన జడేజా, తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసి.. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు...
410
అయితే రవీంద్ర జడేజా ఇన్నింగ్స్, అంత గొప్పదేం కాదని... కేవలం అంకెల గారడీ కారణంగా అలా అనుకుంటున్నారని షాకింగ్ కామెంట్లు చేశాడు భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్...
510
‘ఇది పెద్ద గొప్ప ఇన్నింగ్సేం కాదు. ఎందుకంటే ఆస్ట్రేలియాలోనే, ఇంగ్లాండ్‌లోనూ... కనీసం సౌతాఫ్రికాలో అయినా రవీంద్ర జడేజా ఏడో స్థానంలో బ్యాటింగ్ చేసి 40 పరుగులు చేసి ఉంటే... అది డబుల్ సెంచరీ కంటే ఎక్కువే...
610
ఎందుకంటే విదేశీ పిచ్ కండీషన్స్‌లో చేసే పరుగులు, బ్యాటర్‌కి ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయి. స్వదేశంలో, అదీ అనుభవం లేని లంకపై డబుల్ సెంచరీ చేయడం గొప్ప విషయమేమీ కాదు.
710
సెంచరీ తర్వాత ధనంజయ డి సిల్వ, అసలంక, ఎంబూల్దేనియా బౌలింగ్‌లో జడేజా పరుగులను పిండుకున్నాడు... పరుగులు రాబట్టడానికి ఏ మాత్రం ఇబ్బంది పడలేదు.
810
అదే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లో అయితే ఇలా బ్యాటింగ్ చేయగలడా? అక్కడ మనవి కాని పరిస్థితుల్లో 40 లేదా 50 చేసినా అవి జట్టుకి ఎంతో అమూల్యమైనవిగా మారతాయి...
910
ఈ 175 పరుగులు, జడేజా కెరీర్‌లో అత్యధిక స్కోరు కావచ్చు కానీ అతని బెస్ట్ ఇన్నింగ్స్ అయితే కాదు. ఎందుకంటే అప్పటికే జట్టు మంచి పొజిషన్‌లో ఉంది...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్...
1010
మార్చి 12 నుంచి బెంగళూరు వేదికగా భారత్, శ్రీలంక మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. డే నైట్ టెస్టుగా జరిగే ఈ పింక్ బాల్ టెస్టుపై భారీ అంచనాలే ఉన్నాయి.