జడేజాలో టన్నుల్లో టాలెంట్ ఉంది, దాన్ని పూర్తిగా వాడేస్తా... రోహిత్ శర్మ కామెంట్...

Published : Mar 07, 2022, 12:17 PM IST

మాజీ సారథి విరాట్ కోహ్లీ 100వ టెస్టు, టెస్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మకు తొలి టెస్టు, శ్రీలంకకి కెరీర్‌లో 300వ టెస్టు... అయితే మొహాలీ టెస్టు మాత్రం రవీంద్ర జడేజా టెస్టులా ముగిసింది. అటు బ్యాటింగ్‌లో దుమ్మురేపి, బౌలింగ్‌లోనూ ఇరగదీశాడు జడ్డూ...

PREV
18
జడేజాలో టన్నుల్లో టాలెంట్ ఉంది, దాన్ని పూర్తిగా వాడేస్తా... రోహిత్ శర్మ కామెంట్...

బ్యాటుతో 175 పరుగులు చేసి, ఏడో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చి అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన భారత బ్యాటర్‌గా నిలిచాడు రవీంద్ర జడేజా...

28

25 పరుగుల తేడాతో డబుల్ సెంచరీ మిస్ చేసుకున్న జడ్డూ స్వయంగా ఇన్నింగ్స్ డిక్లేర్ చేయాల్సిందిగా కెప్టెన్ రోహిత్ శర్మను కోరాడు...
 

38

అటు బంతితోనూ ఈ మధ్యకాలంలో బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చిన రవీంద్ర జడేజా, తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీసి... ‘కెరీర్ బెస్ట్ గణాంకాలు’ నమోదు చేసుకున్నాడు...

48

రవీంద్ర జడేజా బౌలింగ్ కారణంగా తొలి ఇన్నింగ్స్‌లో 174 పరుగులకి ఆలౌట్ అయిన శ్రీలంక, రెండో ఇన్నింగ్స్‌లోనూ ఆ స్కోరుకి మరో 4 పరుగులు అధికంగా జోడించి చాపచుట్టేసింది...
 

58

‘కెప్టెన్‌గా రవీంద్ర జడేజాని ఇంకా ఎక్కువగా వాడాలని అనుకుంటున్నా. అతనిలో టన్నుల్లో టాలెంట్ ఉంది...  జడ్డూ బౌలింగ్ గురించి, ఫీల్డింగ్ గురించి అందరికీ తెలుసు. అయితే బ్యాటింగ్ గురించి మాత్రం చాలా తక్కువ మందికి తెలుసు. ఇప్పుడున్న టాప్ ఆల్‌రౌండర్లలో జడ్డూ ఒకడు...

68

అందుకే జడేజాని పూర్తిగా వాడేయాలని అనుకుంటున్నా. టీమిండియా విజయాల్లో జడ్డూ కీ రోల్ పోషించాడు. అయినా అతని ఆకలి తీరలేదు. ఇప్పుడు అదే ఆకలితో పరుగెడుతున్నాడు...

78

ఇంకా ఏదో సాధించాలనే తపన రవీంద్ర జడేజాలో చూశాను. దాన్ని కరెక్టుగా వాడుకోవడమే నా పని...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా నయా సారథి రోహిత్ శర్మ... 

88

మొహాలీ టెస్టులో 175 పరుగులు, బంతితో 9 వికెట్లు తీసుకున్న రవీంద్ర జడేజా, ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కించుకున్న విషయం తెలిసిందే...

click me!

Recommended Stories