పాకిస్తాన్‌తో సెమీ ఫైనల్‌ మ్యాచ్‌కి ముందు కోహ్లీకి గాయం! అయినా నొప్పిని భరిస్తూనే..

Published : Mar 07, 2022, 11:31 AM IST

క్రికెట్ ప్రపంచంలో విరాట్ కోహ్లీ క్రేజ్, పాపులారిటీ వేరే లెవెల్. భారత క్రికెట్‌ జట్టులో ఫిట్‌నెస్ స్టాండెడ్స్‌ను అమాంతం పెంచేసిన విరాట్ కోహ్లీ, గాయం కారణంగా మ్యాచ్‌కి దూరమైన సందర్భాలు అతి తక్కువ...

PREV
116
పాకిస్తాన్‌తో సెమీ ఫైనల్‌ మ్యాచ్‌కి ముందు కోహ్లీకి గాయం! అయినా నొప్పిని భరిస్తూనే..

సౌతాఫ్రికా టూర్‌లో సెంచూరియన్ టెస్టు గెలిచిన తర్వాత జోహన్‌బర్గ్ టెస్టుకి ముందు వెన్ను నొప్పితో బాధపడుతూ ఆఖరి నిమిషంలో మ్యాచ్ నుంచి తప్పుకున్నాడు విరాట్ కోహ్లీ...

216

అయితే ఆ గాయం నిజమైనదా? లేక టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలనే నిర్ణయం తీసుకునేముందు టీమ్ పర్ఫామెన్స్ చూసేందుకు వేసిన ఎత్తుగడా... అనేది ఇప్పటికీ చాలా మందికి అనుమానమే...

316

కెఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, రుతురాజ్ గైక్వాడ్ వంటి యంగ్ ప్లేయర్లు కూడా గాయపడి జట్టుకి దూరమవుతున్నా... విరాట్ అంతటి ఫిట్‌నెస్ ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నాడు?

416

టీమిండియా మాజీ ఫిజియో ఆశీష్ కౌషిక్, విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్ రహస్యాన్ని బయటపెట్టాడు. గాయాలను పట్టించుకోకుండా విరాట్ కెరీర్ ఎలా కొనసాగుతున్నాడో తెలియచేశాడు...

516

‘ఇప్పుడున్న పరిస్థితుల్లో మూడు ఫార్మాట్లను బ్యాలెన్స్ చేస్తూ 100 టెస్టులు ఆడడం అంటే అంత తేలికైన విషయం కాదు. అయితే విరాట్ జర్నీ మిగిలినవారికి కంటే అందంగా ఉంటుంది...

616

ఎందుకంటే విరాట్ కోహ్లీ, తన గాయాలతో ఆడుకుంటూ ఆటను ఆస్వాదించాడు. విరాట్‌కి ఎన్నో ఏళ్లుగా వెన్ను నొప్పి సమస్య ఉంది. అయితే దాన్ని పట్టించుకోకుండా ఫిట్‌నెస్‌పైనే ఫోకస్ పెట్టాడు విరాట్...

716

నొప్పిని భరిస్తూ, ఆటను మరింతగా ఆస్వాదించేవారిని నేనెప్పుడూ చూడలేదు. విరాట్ కోహ్లీ జట్టు నుంచి తన బాధను సంతోషంగా స్వీకరించాడు...

816

2011లో వెస్టిండీస్‌ టూర్‌కి ముందు విరాట్ కోహ్లీ ఎప్పుడూ గాయాలతో బాధపడింది లేదు. అతను ఓ సూపర్ ఎనర్జీ నిండిన పవర్ హౌజ్‌లో వికెట్ల మధ్యన పరుగెత్తేవాడు...

916

అప్పటిదాకా విరాట్ కోహ్లీ తన ఫిట్‌నెస్‌పై పెద్దగా ఫోకస్ పెట్టలేదు. అయితే వెన్నునొప్పి ఎక్కువయ్యేకొద్దీ, ఫిట్‌నెస్‌పై శ్రద్ధ పెట్టడం మొదలెట్టాడు...

1016

విండీస్ టూర్‌లో విరాట్ కోహ్లీ గాయపడ్డాడు, అయితే గాయం కారణంగా ఇంటికి వెళ్లడం అతనికి ఇష్టం లేదు. అందుకే నేరుగా ఎన్‌సీఏకి వెళ్లాడు...

1116

ఇంగ్లాండ్ టూర్‌లో నాలుగు టెస్టులు ఆడే సమయానికి ఫిట్‌నెస్ సాధించాలని ఫిక్స్ అయ్యాడు. తన సమస్యకి తానే సమాధానం, పరిష్కారం వెతుక్కున్నాడు...

1216

ఫిట్‌నెస్ సమస్యలను విరాట్ కోహ్లీ డీల్ చేసిన విధానం తెలిస్తే మతిపోతుంది. 2011లో పాకిస్తాన్‌తో సెమీ ఫైనల్‌ మ్యాచ్‌కి ముందు కూడా విరాట్ కోహ్లీ మెడ, వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు...

1316

అయితే ఆ గాయాన్ని అతను ఏ మాత్రం పట్టించుకోలేదు. జొకోవిచ్, రొనాల్డో వంటి లెజెండ్స్‌లా తాను మారాలని అనుకునేవాడు. అందుకే ఫిట్‌నెస్‌పై చాలా శ్రద్ధ పెట్టాడు.

1416

నొప్పిని భరిస్తూనే ఆ మ్యాచ్‌లో బరిలో దిగాడు. నిజానికి విరాట్ కోహ్లీ వెన్నునొప్పితో బాధపడుతున్నాడనే విషయం నాకు, అతనికి తప్ప మరో వ్యక్తికి కూడా తెలీదు...’ అంటూ చెప్పుకొచ్చాడు టీమిండియా మాజీ ఫిజియో ఆశీష్ కౌశిక్...

1516

2011 వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 21 బంతులాడి 9 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. అయితే సచిన్ టెండూల్కర్ 85, సురేష్ రైనా 36, సెహ్వాగ్ 38 పరుగులు చేయడంతో 260 పరుగులు చేసింది టీమిండియా...

1616

లక్ష్యఛేదనలో పాకిస్తాన్ 231 పరుగులకి ఆలౌట్ కావడంతో భారత జట్టుకి 29 పరుగుల తేడాతో విజయం అందుకుంది. 56 పరుగులు చేసిన మిస్బా వుల్ హక్‌ని కళ్లు చెదిరే క్యాచ్‌తో పెవిలియన్ చేర్చాడు విరాట్... 

Read more Photos on
click me!

Recommended Stories