అజింకా రహానే టెస్టు కెరీర్ ముగిసినట్టేనా... అయ్యర్ అదరగొడుతుండడంతో మాజీ వైస్ కెప్టెన్‌కి....

Published : Dec 14, 2022, 05:22 PM IST

అది 2020, డిసెంబర్. భారీ అంచనాలతో ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన టీమిండియా, ఆడిలైడ్‌లో జరిగిన పింక్ బాల్ టెస్టులో 36 పరుగులకు కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. విరాట్ కోహ్లీ పెటర్నిటీ లీవ్‌తో స్వదేశానికి వెళ్లిపోవడంతో టీమిండియా... మిగిలిన మ్యాచుల్లో చేతులు ఎత్తేయడం ఖాయమనుకున్నారంతా. అయితే అజింకా రహానే కెప్టెన్సీలో టీమిండియా అంచనాలకు మించి రాణించి 2-1 తేడాతో సిరీస్ గెలిచింది.. 

PREV
17
అజింకా రహానే టెస్టు కెరీర్ ముగిసినట్టేనా... అయ్యర్ అదరగొడుతుండడంతో మాజీ వైస్ కెప్టెన్‌కి....
Ajinkya Rahane

ఆడిలైడ్ టెస్టు పరాజయం తర్వాత నీరసించిపోయిన భారత జట్టు, మెల్‌బోర్న్ టెస్టులో ఘన విజయం అందుకుంది. సెంచరీతో టీమ్‌ని ముందుండి నడిపించాడు అజింకా రహానే. సిడ్నీ టెస్టును చారిత్రక డ్రాగా మలుచుకున్న టీమిండియా... బ్రిస్బేన్‌లో 32 ఏళ్ల తర్వాత ఆసీస్‌కి పరాజయాన్ని రుచి చూపించింది...

27
Ajinkya Rahane

అజింకా రహానే కెప్టెన్సీలో ఐదు టెస్టులు ఆడిన టీమిండియా... ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. 2021 నవంబర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టుకి ఆఖరిగా కెప్టెన్సీ చేసిన అజింకా రహానే, ఆ మ్యాచ్‌లో గాయపడి రెండో టెస్టు ఆడలేదు. అప్పటి నుంచి రహానే గడ్డు కాలం మొదలైంది...

37

అజింకా రహానే స్థానంలో తుది జట్టులోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్, ఆరంగ్రేటం టెస్టులోనే సెంచరీ బాదాడు. మొదటి 10 ఇన్నింగ్స్‌ల్లో 4 హాఫ్ సెంచరీలు బాదిన అయ్యర్... ఒక్కసారి కూడా సింగిల్ డిజిట్ స్కోరుకి అవుట్ కాలేదు...

47
Ajinkya Rahane

శ్రేయాస్ అయ్యర్ టెస్టుల్లో చూపిస్తున్న నిలకడైన ప్రదర్శనతో అజింకా రహానే కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది. వరుసగా విఫలమవుతున్నారనే ఉద్దేశంతో ఛతేశ్వర్ పూజారా, అజింకా రహానేలను సౌతాఫ్రికా టూర్ 2022 తర్వాత పక్కనబెట్టేసింది టీమిండియా...

57

ఛతేశ్వర్ పూజారా, కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొని రికార్డు లెవెల్లో సెంచరీల మోత మోగించి తిరిగి భారత జట్టులో చోటు దక్కించుకోగలిగాడు. అజింకా రహానే కూడా దేశవాళీ టోర్నీల్లో మంచి పర్ఫామెన్స్ ఇచ్చాడు. రంజీ ట్రోఫీలో రెండు సెంచరీలు చేసిన రహానే, దులీప్ ట్రోఫీలో డబుల్ సెంచరీ బాదాడు...

67

2020 నుంచి అజింకా రహానే 35 ఇన్నింగ్స్‌ల్లో 24.08 సగటుతో 819 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇదే సమయంలో విరాట్ కోహ్లీ 33 ఇన్నింగ్స్‌ల్లో 26.45 సగటుతో 873 పరుగులు చేశాడు. అయితే కోహ్లీని కొనసాగిస్తున్న టీమిండియా మేనేజ్‌మెంట్, రహానేని మాత్రం పూర్తిగా పక్కనబెట్టేసింది..

77

అదీకాకుండా ఐదో స్థానంలో శ్రేయాస్ అయ్యర్ సెటిల్ అయిపోవడంతో అజింకా రహానేని తిరిగి భారత జట్టులోకి తీసుకురావాల్సిందే.. అనే అవసరం టీమ్‌కి కనిపించడం లేదు. దీంతో అజింకా రహానే కెరీర్ దాదాపు ముగిసినట్టేనని అంచనా వేస్తున్నారు అభిమానులు.. 

click me!

Recommended Stories