ఆ కారణంగానే ఐపీఎల్‌లో కొత్త టీమ్‌కి ఆడాలని డిసైడ్ అయ్యా... ఆసీస్ ప్లేయర్ స్టోయినిస్...

Published : Jun 07, 2022, 06:42 PM IST

ఐపీఎల్‌ 2022 సీజన్‌లో కొత్త జట్లుగా ఎంట్రీ ఇచ్చిన లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ టాప్ క్లాస్ పర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నాయి. టైటిల్ విన్నింగ్ టీమ్స్ ముంబై ఇండియన్స్, సీఎస్‌కే, కేకేఆర్, సన్‌రైజర్స్ హైదరాబాద్... విజయాల కోసం కష్టపడుతుంటే వరుసగా మ్యాచులు గెలుస్తూ ప్లేఆఫ్స్‌కి చేరుకున్నాయి గుజరాత్, లక్నో...

PREV
18
ఆ కారణంగానే ఐపీఎల్‌లో కొత్త టీమ్‌కి ఆడాలని డిసైడ్ అయ్యా... ఆసీస్ ప్లేయర్ స్టోయినిస్...

ఐపీఎల్ 2022 సీజన్‌లో పాత ఫ్రాంఛైజీలు రిటైన్ చేసుకున్న ప్లేయర్లలో చాలామంది పేలవ ప్రదర్శనతో అట్టర్ ఫ్లాప్ కాగా... కొత్త ఫ్రాంఛైజీలు డ్రాఫ్ట్ రూపంలో కొనుగోలు చేసిన ప్లేయర్లు మాత్రం సీజన్‌లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చారు...
 

28

గుజరాత్ టైటాన్స్ గెలవడంలో డ్రాఫ్ట్‌లుగా వేలానికి ముందే జట్టులోకి వచ్చిన హార్ధిక్ పాండ్యా, రషీద్ ఖాన్, శుబ్‌మన్ గిల్ మేజర్ రోల్ పోషిస్తే... లక్నో సూపర్ జెయింట్స్ విజయాల్లో కెఎల్ రాహుల్, రవి భిష్ణోయ్‌లతో పాటు ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్ పాత్ర కూడా చాలా ఉంది...

38

కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌ వేసిన స్టోయినిస్, చివరి 2 బంతుల్లో 3 పరుగులు మాత్రమే ఇచ్చి లక్నోకి సూపర్ విక్టరీ అందించాడు. ఈ విజయంతో ప్లేఆఫ్స్‌ బెర్త్ కన్ఫార్మ్ చేసుకుంది లక్నో సూపర్ జెయింట్స్...

48

‘వరుసగా వరల్డ్ కప్‌లు రాబోతున్నాయి. అందుకే ఐపీఎల్‌లో కొత్త ఫ్రాంఛైజీ తరుపున ఆడాను. నాకు చాలా గాయాలయ్యాయి. ఆ గాయాలు చేసిన మరకలు ఇంకా మాసిపోలేదు...
 

58

అందుకే ఆ మచ్చలను తొలగించుకోవాలంటే ఓ బ్లాంక్ కాన్వాస్‌లో ఆడితే బాగుంటుందని అనుకున్నా. కెఎల్ రాహుల్, సంజీవ్ (లక్నో ఓనర్ సంజీవ్ గోయింకా)  కలిసి మరో 10-15 ఏళ్ల పాటు నిలబడగల ఓ సామ్రాజ్యాన్ని నిర్మించారు...

68

కొత్త ఫ్రాంఛైజీ తరుపున ఆడే అదృష్టం అందరికీ దక్కదు. రాజస్థాన్ రాయల్స్‌ తరుపున షేన్ వార్న్‌కి ఇలాంటి అవకాశం దక్కింది. ఆయన అక్కడ ఏం చేశారో, అది వార్న్ కెరీర్‌ని ఎలా మార్చేసిందో అందరికీ తెలిసిందే...

78

ఇప్పటికీ షేన్ వార్న్ ఆ టీమ్‌లో ఓ అంతఃసభ్యుడిగానే ఉంటున్నాడు. ఎందుకంటే టీమ్ కల్చర్‌ని నిర్మించడంలో వార్న్ కీలక పాత్ర పోషించాడు...  నా వ్యక్తిగత జీవితంలో  ఓ కొత్త అంకం వైపు చూస్తున్నా.పెళ్లి చేసుకోవడం, వైవాహిక జీవితాన్ని ప్రారంభించడం... ఐపీఎల్‌లో కొత్త టీమ్ తరుపున ఆడడం అన్నీ కొత్తగా ఉన్నాయి...’ అంటూ క్రిక్‌బజ్ వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు ఆసీస్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్... 

88

ఐపీఎల్ 2022 సీజన్‌లో 11 మ్యాచులు ఆడిన మార్కస్ స్టోయినిస్ 10 ఇన్నింగ్స్‌ల్లో 147.7 స్ట్రైయిక్ రేటుతో 156 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో 4 వికెట్లు పడగొట్టాడు. అయితే స్టోయినిస్‌ని బ్యాటింగ్ ఆర్డర్‌లో కిందకి పంపుతూ కెప్టెన్ కెఎల్ రాహుల్ అతన్ని సరిగా వాడుకోలేకపోయాడని విమర్శలు వచ్చాయి.

click me!

Recommended Stories